
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి….
– ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్….
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే 4000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిదో అది తొందరగా అమలు చేయాలని, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వితంతు మహిళలు పింఛన్లుకు, దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరకు రాకపోవడంతో వారు చాలా అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చిందో అతి తొందరగా అమలు చేస్తూ నూతన పింఛన్లు మంజూరు చేస్తూ,దివ్యాంగులకు వితంతువులు ఒంటరి మహిళలకు పింఛన్లు 4000 రూపాయల ఇచ్చి వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.