నూతన పాలక వర్గానికి ఘన సన్మానం.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల లోని మూడు చెక్కలపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సపావత్ కవిత దేవ్ నాయక్, ఉప సర్పంచ్ ఇస్లావత్ స్వరూప నెహ్రూ, వార్డు సభ్యులకు స్థానిక ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధితోపాటు పాఠశాల అభివృద్ధి చేసే విధంగా పాలనా సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భూక్య రమేష్, ఇస్లావత్ రవీందర్, సపావట్ స్వరూప, బానోతు విజయ, ప్రేమ్ కుమార్, లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యాయులు దేవీలాల్, వార్డెన్ స్వరూప, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
