New Padmashali Cooperative Society Launched in Kasibugga
కాశిబుగ్గలో నూతన పద్మశాలి పరపతి సంఘం ఏర్పాటు
నేటిధాత్రి కాశిబుగ్గ.
వరంగల్ కాశిబుగ్గలో బుధవారం పద్మశాలి సహకార పరపతి సంఘం నూతనంగా ఏర్పాటు చేయబడింది. మొత్తం 150 మంది సభ్యులతో ఈ సంఘం ప్రారంభమైంది. మార్కండేయ స్వామి ఫోటోకు పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి ఆరంభ కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా గుళ్లపల్లి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గోరంటల మనోహర్, కోశాధికారిగా పోతన లక్ష్మీనరసింహస్వామి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా వేముల నాగరాజు, సహాయ కార్యదర్శులుగా మాటేటి విద్యాసాగర్, ములుక సురేష్, సహా కోశాధికారులుగా బండారి రాజేశ్వరరావు, సిందం చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్గనైజర్లుగా కుసుమ నగేష్, క్యాతం రంజిత్, బాల మోహన్ కొనసాగనున్నారు. గౌరవ సలహాదారులుగా కుసుమ దయాసాగర్, బండారి శ్రీనివాస్, రాచర్ల శ్రీనివాస్, గుళ్లపల్లి సాంబశివుడు, బేతి అశోక్ బాబు నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా దాసి శివకృష్ణ, రామ యాదగిరి, గుండు సత్యనారాయణ, చిలగాని రమేష్, వెంగళ లక్ష్మణ్, కూరపాటి మహేష్ ఎంపికయ్యారు.ఈ కమిటీ మూడు సంవత్సరాలపాటు కొనసాగేందుకు తీర్మానం చేయబడింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గుళ్లపల్లి రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 12వ తేదీ బిల్లులు చెల్లించాలనే నిర్ణయం తీసుకున్నామని, కాశిబుగ్గ పద్మశాలి సహకార పరపతి సంఘం సభ్యులందరికీ అవసరమైన సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
