
హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని పెంబర్తి గ్రామాన్ని నూతన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సందర్శించారు గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. ఆనంతరం నూతన ఎంపీడీవో ను గ్రామ పంచాయితీ కార్యాలయం లో ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా సన్మానించారు.