ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన నూతన ల్యాబ్ టెక్నీషియన్లు..
పేద ప్రజలకు మరింత దగ్గర కానున్న వైద్య సేవలు..
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా 24 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు నివేదించారు. అనంతరం బొకేలు అందించి శాలువాలతో సన్మానించారు… ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్లకు పలు సూచనలు చేశారు…వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్ రత్నం. ఆర్ ఎంఓ లు ,అడిషనల్ డైరెక్టర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు…
