
MLA GSR
గణపురం నూతన పోలీస్ సర్కిల్ ను ప్రారంభం కలెక్టర్, ఎస్.పీ గార్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
శాంతి భద్రతల బలోపేతమే ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
గణపురం నేటి ధాత్రి
గురువారం గణపురం మండలం కేంద్రంలోనిపోలీస్ స్టేషన్లో నూతన పోలీస్ సర్కిల్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ,ఎస్పీ కిరణ్ కరే గార్లతో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ “ప్రజల శాంతి భద్రతల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందనీ,నూతన సర్కిల్ ఏర్పాటుతో చట్ట పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది” అన్నారు.ఈ సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయని తెలిపారు.ఈ నూతన సర్కిల్ కి చెన్నమనేని కరుణాకర్ రావు ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రభుత్వం నియమించింది అని ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే జీఎస్సార్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.