
New Fire Station Inaugurated in Jadcherla
“నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభం”
“ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ”
మంత్రి వాకటి శ్రీహరి.
జడ్చర్ల /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని గురువారం పశుసంవర్థక క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
“ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా ఆధునిక పరికరాలు, సిబ్బందిని ఈ కేంద్రంలో ఏర్పాటు చేశాం. జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కొత్త కేంద్రం భద్రతా పరంగా పెద్ద తోడ్పాటు అందిస్తుంది” అని తెలిపారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు మాట్లాడుతూ…
“జడ్చర్ల పట్టణం అభివృద్ధిలో మరో ముందడుగుగా ఈ అగ్నిమాపక కేంద్రం నిలుస్తుంది. పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా ఈ కేంద్రం అవసరం ఉంది. ప్రజలకు అత్యవసర సర్వీసులు అందించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. మా నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకురావడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఐజి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, జిల్లా అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.