కారేపల్లి నేటి ధాత్రి
కామ్రేడ్ గండి యాదన్న మరణం విప్లవోద్యమానికి తీరని లోటని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు కారేపల్లి మండల కార్యదర్శి వై ప్రకాష్ అన్నారు ఇల్లెందు సంజయ్ నగర్ లో తన స్వగృహంలో కామ్రేడ్ యాదన్న భౌతికకాయంపై పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు ఎన్ని నిర్బంధాలు వచ్చిన జీవితాంతం విప్లవోద్యమంలో తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం కృషి చేశారని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడని అన్నారు కామ్రేడ్ యాదన్న మృతికి ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు సానుభూతిని తెలియజేశారు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య నాయకులు ఎం యాకన్న జి సక్రు డి ప్రసాద్ నందగిరి వెంకటేశ్వర్లు వై జానకి ఎస్ నాగేశ్వరరావు బొగ్గరపు సంగయ్య ఎట్టి నరసింహారావు తోడేటి నాగేశ్వరరావు జి సదయ్య టి లాలు తదితరులు పాల్గొన్నారు.