
సింగరేణి కాలరీస్. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి.అంతోటి నాగేశ్వర్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా ది.05.07.2024 న ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది.దేశ వ్యాప్తంగా త్వరలో నిర్వహించబోయే బొగ్గు బావుల వేలం జాబితా నుండి సింగరేణి పరిధిలోవున్న “”శ్రావణ్ పల్లి “” బొగ్గు బావిని తొలగించి నామినేషన్ పద్దతిలో సింగరేణికే శ్రావణ్ పల్లి ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము.
గత 130 సంవత్సరాలుగా సింగరేణి బొగ్గు వ్యాపార రంగంలో గణనీయమైన చరిత్ర ఉందని, సింగరేణికి కావలసినంత నైపుణ్యత, పెట్టుబడి, యంత్రపరికరాలు, అనుభవం కలిగిన కార్మికులు, అధికారులు, యితర అన్ని సౌకర్యాలు సింగరేణికి ఉన్నాయని అందువలన మా ప్రాంతంలోని బొగ్గు బావులు మాకేయివ్వాలని కోరుతావున్నాం. కొత్త గనులు రాకపోతే 15 సంవత్సరాలలోనే సింగరేణి మూతపడే పరిస్థితులు ఉన్నాయని, సింగరేణి మూతపడితే కార్మికుల భవితవ్యం ఆగమ్యాగొచరంగా మారుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలలో చేరిన యువ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నర్దాకంగా మారుతుందని తెలియజేస్తున్నాము.
లాబాలతో విరాజిళ్లుతున్న సింగరేణి సంస్థని ముందుకు నడిపించే భాద్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కార్మికులకు, సింగరేణికి నష్టం కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం కార్మికుల ద్రోహిగా మిగిలిపోతుందని అంతోటి నాగేశ్వరావు అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోసించి, సింగరేణి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శ్రావణ్ పల్లి మైన్ ని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాం.
సింగరేణిలో పనిచేసే ఎస్సీ ఎస్టీ. ఉద్యోగస్తులతో పాటు అన్ని కులాల, మతాల ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు, సంక్షేమం ముఖ్యమని అంతోటి నాగేశ్వర్ రావు అన్నారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సింగరేణి కాలరీస్ ని కాపాడుకోవడంకోసం.ఎస్సీ ఎస్టీ. ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆందోళనలను తీవ్రతరం చేస్తుందని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని, సకల కార్మికుల ఉద్యమానికి సైతం వెనుకాడబొమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ . అందెల ఆనందరావు, అసోసియేషన్ నాయకులు . రావు , మధుసూదన్ రావు (చిన్ని ), బందెల విజేందర్,.చక్రపాని,. శ్రీనివాస్, ప్. భద్రయ్య, . వెంకటేశ్వర్లు, సురేష్, . శ్రీనివాస్,కుంచం వెంకటేశ్వర్లు, రామారావు,.మురళి కృష్ణ, నాగరాజు, తోట రవి, శ్రీనివాస్, కేశవరావు, ఈశ్వర్ లాల్, మంద హనుమంతు, గుడివాడ సీతారామరాజు ,దీక్షలో పాల్గొన్నారు.సమ్మయ్య, ప్రవీణ్ కుమార్, మురళి, . సుమన్, శివ దర్శన్ తదితరులు సందర్శించారు.