క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ అధికారి
నడికూడ,నేటిధాత్రి:
తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన క్యాలెండర్ను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, జిల్లా నాయకులు సుగుణ సుధాకర్,చౌల రామారావు, హింగే రవీందర్,అంబరి శ్రీనివాస్,సురావు బాబురావు, అలాగే నడికూడ,పరకాల, ఎల్కతుర్తి మండల అధ్యక్షులు వంకే రాజు, బిక్షపతి,మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్ మాధవరావు,రైతు నాయకులు లోనే సతీష్ తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. నూతన క్యాలెండర్ రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడిందని పేర్కొన్నారు.
