https://epaper.netidhatri.com/view/345/netidhathri-e-paper-10th-aug-2024%09
-బీజేపిలో అజాతశత్రువు బండి ఒక్కడే!
-తెలంగాణ బిజేపికి బండి ఊపిరి!
-తెలంగాణలో బిజేపి పుంజుకోవడంలో బండి పాత్ర కీలకం.
-జోడు పదవులైనా నిర్వహించగల సమర్థుడు.
-అటు మంత్రిగా వుంటూనే, బిజేపి అధ్యక్ష పదవి కోరుతున్న అభిమానులు.
-బీజేపిలో నిత్యం ప్రజల్లో వుండే ఏకైక నాయకుడు.
-మోడీ, అమిషాలంటే బండికి విపరీతమైన అభిమానం.
-ఆ ప్రేమ అందరిలో కలిగించారు.
-బీజేపి బలం అనూహ్యంగా పెంచారు.
-బీఆర్‌ఎస్ ను ఒక దశలో ఉతికి ఆరేశారు.
-బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత పెంచారు.
-మూడేళ్లపాటు బిఆర్‌ఎస్‌పై నిరంతరం పోరాటం చేశారు.
-ఉప ఎన్నికలలో బిజేపిని గెలిపించి ఊపు తెచ్చారు.
-కాలం గతి తప్పినా బండి బీజేపిని దారిలో పెట్టారు.
-ఏక కాలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొన్నాడు.
-పాదయాత్ర ద్వారా బీజేపిని ప్రజల్లోకి తీసుకెళ్లాడు.
-ప్రజా సంగ్రామ యాత్రతో అటు చైతన్యం తీసుకొచ్చాడు.
-ఇటు బీజేపిపై ప్రజల్లో అభిమానం పెంచాడు
-తెలంగాణలో మరింత బలమైన పునాదులకు మార్గం వేశాడు.
-కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతున్నాడు.
-తెలంగాణలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
-ఙషజేపి శ్రేణులు శనివారం ఎప్పుడు వస్తుందా! బండన్న ఎప్పుడు వస్తాడా! అని ఎదురుచూసేంత ప్రేమ సంపాదించుకున్నాడు.
తెలంగాణలోని బిజేపి సమాజం మొత్తం ఒక వ్యక్తి గురించి ఎదురుచూస్తోంది. అంతే కాదు తెలంగాణ ప్రజలు ఆ నాయకుడుంటే చాలు అనుకుంటున్న ఏకైక నాయకుడు బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ప్రజల్లో అంతగా అభిమానాన్ని పెంచుకున్నారు. ఏ పార్టీలోనైనా బండి సంజయ్ నాయకుడు వుంటే బాగుండు అన్నంతగా ఆయన తన నాయకత్వ పటిమను చూపించారు. 2019 ఎన్నికల దాకా ఆయన ఎవరో తెలంగాణ మొత్తం సమాజానికి పూర్తిగా తెలియదు. కాని కరీంనగర్ జిల్లా ప్రజలకు బాగా సుపరిచితుడు. బిజేపిలోని ముఖ్యమైన నాయకులుందరికీ తెలుసు. కాని 2018 శాసనసభ ఎన్నికల ద్వారా బండి సంజయ్ అంటే ఎవరూ? అన్నది తెలిసిపోయింది. ఆయన నాయత్వం గొప్పదనం అందరికీ తెలిసింది. కరీంనగర్ ప్రజలకు ఆయన ప్రేమ తెలుసు. ఆయన పోరాట పటిమ తెలుసు. హిందూ సమాజానికి ఆయన చేసిన సేవ తెలుసు. మొత్తం హైందవ రక్షణ కోసం ఆయన దూకుడు తెలుసు. తనను అభిమానించే వారికోసం ఎలా నిలబడతాడన్నది తెలుసు. తన వారికి కోసం ఎంత దూరమైనా వెళ్తాడన్నది కూడా తెలుసు. అలాంటి బండి సంజయ్ 2018 శాసన సభ ఎన్నికల్లో ఓటమిని కరీంనగర్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణలోని బిజేపి శ్రేణులన్నీ ఉద్వేగం ఆపుకోలేకపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ నాయకత్వం అంటే ప్రజలకు ఎంత ఇష్టమే ఆ ఎన్నికల ద్వారానే బిజేపి అధిష్టానానికి కూడా తెలిసిపోయింది. ఇక అక్కడి నుంచి బండి సంజయ్ గ్రాప్ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసింది. తెలంగాణ సమాజమంతా బండి సంజయ్ నాయకత్వం కావాలని కోరుకున్నది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా గెలవడంతోనే తెలంగాణ బిజేపికి ఒక ఊపిరి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఒకప్పుడు బిజేపి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆకు చాటు పిందె అన్నట్లు వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తప్ప బిజేపికి మనుగడ లేదన్నట్టుగా వుండేది. 2014 ఎన్నికల్లో కూడా బిజేపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లింది. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో 5గురు శాసనసభ్యులు గెలిచారు. అంటే ఇక ఎప్పటికైనా బిజేపి తెలుగుదేశం చాటు పార్టీయే అన్న ముద్ర మరింత బలపడిపోయింది. 1999 నుంచి 2004 దాకా దేశంలో ఐదు సంవత్సరాల పాటు బిజేపి కేంద్రంలో అధికారంలో వున్నా, దక్షిణాదిన ఆ పార్టీ బలమైన పునాదులు వేసుకోలేకపోయింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలోనూ బిజేపి ఎదగలేకపోయింది. కాకపోతే తెలంగాణలో మొదటి నుంచి బిజేపి బలంగానే వుంది. కాని ఓటు బ్యాంకుగా మల్చేందుకు ఏ నాయకుడు కృషి చేయలేదు.
ఎనభైవయ దశకంలో కూడా తెలంగాణలో బలమైన నాయకులు వుండేవారు. కాని ఉమ్మడి రాష్ట్ర నాయకత్వ ప్రభావం మూలంగా వాళ్లుంతా ఎదగలేకపోయారు. కాని రాష్ట్రం వచ్చిన తర్వాత బిజేపికి ప్రత్యేక విభాగం ఏర్పడడంలో నాయకత్వాలు తెరమీదకు వచ్చాయి. 2018 ఎన్నికల్లో బిజేపి ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేయలేకపోయింది. ఒంటరి పోరు మూలంగా ఓడిపోయామన్న భావన చాలా మందిలో కలిగింది. మూడు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలు గెల్చుకోవడంతో తెలంగాణ ప్రజల దృష్టి ఒక్కసారిగా బిజేపి పడిరది. బిజేపి పుంజుకోవాలని తెలంగాణ సమాజం కూడా కోరుకున్నది. ఆ సమయంలో రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న కిషన్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. రాష్ట్ర పగ్గాలు ఇతర నాయకులకు అప్పగించాల్సిన సమయం వచ్చింది. ఆ తరుణమే బండి సంజయ్‌ను తెలంగాణ బిజేపికి కొత్త నాయకత్వం పరిచయం చేసింది. బిజేపికి కొత్త ఆశలు చిగురించేలా చేసింది. తెలంగాణలో బిజేపికి కొత్త ఊపిరి అందించినట్లైంది. ఇక అక్కడితో మొదలైన బండి సంజయ్ రాజకీయంగా వేటలాగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్‌కు కంటి మీద కనుకులేకుండా చేశారు. మూడున్నరేళ్లపాటు కేసిఆర్‌కుఊపిరి సలపకుండా చేసిన నాయకుడు బండి సంజయ్. అప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా చతికిలకపడిపోయి వుంది. ఆపార్టీ కోలుకుంటుందన్న నమ్మకం లేకుండా వుంది. ఆ పార్టీని గట్టెక్కించే నాయకుడు లేడు. ఇక తెలంగాణ భవిష్యత్తు బిజేపే అన్నంతగా బిజేపికి జవసత్వాలు కల్పించిన నాయకుడు బండి సంజయ్. బండి సంజయ్‌కు బిజేపి రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సమయంలో చాలా మంది పెదవి విరిచారు. అసలు బండి సంజయ్‌కి ఏం తెలుసు? రాష్ట్ర రాజకీయాల మీద ఆయనకు పట్టుందా? అన్న ప్రశ్నలు వినిపించాయి. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసి, ఉద్యమ నాయకుడిగా గుర్తింపు వున్న రఘునందన్ నేనే బిజేపి అధ్యక్షుడిని అని చెప్పుకున్న సందర్భం కూడా వుంది. కాని బిజేపి జాతీయ నాయకత్వం బండి సంజయ్‌ను ప్రకటించడంతో చూద్దాం..అని పెదవి విరిచిన నాయకులు సైతం తర్వాత కొద్ది కాలంలోనే అబ్బుర పడిపోయారు.
బండిని ఎదుర్కొవడం మన వల్ల కాదన్న స్ధాయికి తీసుకెళ్లారు. ఇక పార్టీలో బండిదే భవిష్యత్తు అన్నంతగా నాయకులంతా సైలెంటు అయ్యారు. ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రఘునందన్ గెలుపు కోసం బండి సంజయ్ పడిన తపన. పోషించని పాత్ర. బిజేపి శ్రేణులను ఆయన కదలించిన విధానం అందర్నీ ఆకర్షించింది. దాంతో బిఆర్‌ఎస్ విజయాల పరంపరకు మొదటిసారి బ్రేక్ పడిరది. కేసిఆర్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకొని బరిలోకి దిగిన బండి సంజయ్ చెలరేగిపోయారు. అడుగడుగునా బిజేపి జెండాలు ఎగురవేశారు. హైదరాబాద్ మొత్తం కాషాయమయం చేశారు. ప్రతి గల్లీని తిరిగారు. రోడ్‌షోలతో పెద్దఎత్తున ప్రజల దృష్టిని మళ్లించగలిగారు. అంతకు ముందు జాతీయ స్ధాయి నాయకులు హైదరాబాద్ రావడం చాల తక్కువ. ప్రదాన మంత్రులు కూడా పెద్దగా వచ్చేవారు కూడా కాదు. 2014 నుంచి 2019 వరకు ప్రధాని మోడీ కూడా ఒకటి రెండుసార్లు మాత్రమే వచ్చారు. ఒక బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని అనేక సార్లు తెలంగాణకు వచ్చారు. అనేక అభివృద్ది కార్యాక్రమాలలో పాల్గొన్నారు. అనేక సార్లు పార్టీ సభలకు హజరై తెలంగాణలో బిజేపి బలోపేతాన్ని ప్రోత్సహించారు. అడుగడుగునా బండి సంజయ్ నాయత్వాన్ని అభినందిస్తూ వచ్చారు. ఆ మూడున్న సంవత్సరాల పాటు జాతీయస్ధాయి నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఒక వైపు ఆయన స్వయంగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతోపాటు, అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. వాటికి జాతీయ నాయకులను పెద్దఎత్తున ఆహ్వానించేవారు. పైగా వివిధ రాష్ట్రాలలో వున్న ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చేవారు. బిజేపికి ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. దాంతో బిజేపి జాతీయ నాయకులు తెలంగాణకు రావడానికి ఎంతో సుముఖత వ్యక్తం చేసేవారని చెబుతుంటారు. ఇలా పార్టీని తనదైన శైలిలో బలోపేతం చేసి, బండి సంజయ్ అనేక విజయాలు అందించారు. యువతను పెద్దఎత్తున బిజేపి వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు పదే పదే వివాదాస్పదం చేసి, రాజకీయంగా ఆయనను ఎదుర్కొనలేక నైతికంగా దెబ్బతీయాలని చూశారు. కాని ఎక్కడా తగ్గలేదు. ఆయన నమ్మిన సిద్దాంతాన్ని వదులుకోలేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాలు ఒక్క అడుగు వెనక్కి లాగాయి. కాని ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా వున్నప్పకీ ఆయనకే మళ్లీ బిజేపి పగ్గాలు అప్పగిస్తే ఈసారి పార్టీని విజయ తీరాలకు చేర్చుతాడన్న విశ్వాసం అందరిలోనూ వుంది. అయితే ఆయన మంత్రి పదవిలో కొనసాగుతూనే పార్టీ పగ్గాలు చేపడితేనే పార్టీకి బాగుంటుందని అంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వుంటూ ఆయన పార్టీ శ్రేణులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ పార్టీని రక్షించుకునే అవకాశం వుంటుంది.