నర్సంపేట,నేటిధాత్రి :
నేటిధాత్రి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలండర్ ను నర్సంపేట ఆర్సీ ఇంఛార్జి కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి పోలీస్ స్టేషన్ లో స్థానిక జర్నలిస్టులతో కలిసి అవిస్కరించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే స్వేచ్చ జర్నలిజానికి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కుండె సురేష్,మహాదేవుని జగదీశ్వర్,శీలం రమేష్,జూలూరి హరిప్రసాద్ గౌడ్, హింగే రాజు పాల్గొన్నారు.