‘‘నేటిధాత్రి’’ న్యూస్‌ ఎఫెక్ట్‌

`డిఫార్టర్లకు డోర్స్‌ క్లోజ్‌!

`మిల్లర్ల అక్రమ దందాకు అడ్డుకట్ట

`వెంటనే స్పందించిన మంత్రి వర్గ ఉపసంఘం.

`బకాయిలు పెండిరగ్‌లో వున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దని నిర్ణయం.

`ఇలా జరుగుతుందని ఊహించని బకాయి మిల్లర్లు.

`ఏళ్ల తరబడి సాగుతున్న బకాయి మిల్లర్ల మోసాలు.

`గత ప్రభుత్వం నిర్లక్ష్యం అక్రమ మిల్లర్లకు వరంగా మారింది.

`ఇప్పుడు కూడా అదే సాగుతుందని అనుకున్నారు.

`కథ అడ్డం తిరగడంతో ఆగమాగమౌతున్నారు.

`మిల్లర్లు సాగిస్తున్న అక్రమ దందాలపై ‘‘నేటిధాత్రి’’ వరుస కథనాలు.

`మంత్రి వర్గ ఉపసంఘానికి చేరిన ‘‘నేటిధాత్రి’’ కథనాలు.

`ఇక ఉపేక్షిస్తే మరింత నష్టమని గ్రహించిన సబ్‌ కమిటీ.

`బకాయిల వసూలుకు ఇదే సరైన సమయమని నిర్థారణ.

`ఉదాసీనత చూపిస్తే మళ్ళీ మిల్లర్లు మళ్ళీ దోచుకునేందుకు అవకాశం.

`నిజాయితీగా వ్యవహరించిన మిల్లర్లకే వడ్లు ఇవ్వాలని ఆదేశాలు.

`దిక్కు తోచని స్థితిలో అక్రమ మిల్లర్లు.

`మిల్లులు నడవాలంటే బకాయిలు చెల్లించాల్సిందే.

`ఉరుకుల పరుగుల మీద బకాయిలు చెల్లించేందుకు సిద్ధపడుతున్న కొంత మంది.

`మిల్లర్ల బకాయిలు పెరిగిపోవడానికి సివిల్‌ సప్లయ్‌ అధికారులే కారణం.

`గత ప్రభుత్వం హయాంలో ‘‘డిసిఎస్‌ఓ’’ల సంపాదన కోట్లలో…

`ఏళ్ల తరబడి తిష్ట వేసి కోట్లు కూడబెట్టుకున్న అధికారులు.

`జనగామలో ‘‘డిసిఎస్‌ఓ’’గా పని చేసిన అధికారి మీద అనేక ఆరోపణలు.

`అధికారుల సహకారంతోనే మిల్లర్ల ఎగవేతలు.

`వారికే అధికారులు పట్టుబట్టి మరీ వడ్లు ఇచ్చారు.

`బకాయిలు లేని మిల్లర్లను వేధించారు.

`బకాయిలు లేని మిల్లర్లకు వడ్లు ఇస్తే మాకేం లాభమనే అధికారులున్నారు.

`బకాయిలున్న మిల్లర్ల నుంచి విపరీతంగా వసూళ్ళు.

`అధికారుల అక్రమ సంపాదన మీద ప్రభుత్వం దృష్టి పెడితే అసలు బండారం బైటపడుతుంది.

`తెలంగాణ వ్యాప్తంగా అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తే అక్రమ సంపాదన తేలిపోతుంది.

`అధికారుల అవినీతి వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం.

`బకాయిల వసూలుపై దృష్టి పెట్టకపోవడంతో అధికారులకు చేరిన వందల కోట్లు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వాన్ని ఇంత కాలం మోసం చేస్తూ బకాయిలు ఎగ్గొడుతూ కోట్లు కూడబెట్టుకుంటున్న అక్రమ మిల్లర్లకు రaలక్‌ ఇచ్చింది. ఇకపై బకాయిలు వున్న మిల్లర్లకు వడ్లు ఇచ్చే ప్రసక్తి లేదని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం ప్రకటించింది. దాంతో అక్రమంగా ఇంత కాలం ప్రభుత్వ సొమ్ము దిగిమింగిన మిల్లర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పనైంది. ఇప్పుడు వడ్లు కావాలంటే బకాయిలు చెల్లించాలి. వద్దనుకుంటే మిల్లులు మూసేసుకోవాలి. ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది మిల్లర్ల పరిస్ధితి. రాష్ట్రంలో వేల కోట్లు బకాయిలు పడి, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిల్లర్ల అక్రమ దందాలపై నేటిధాత్రి ఎంతో కాలంగా అక్షర సమరం మొదలు పెట్టింది. ప్రతి జిల్లాలో ఎలా మిల్లర్లు మోసం చేస్తున్నారన్న సంగతిని అనేక కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఏఏ జిల్లాల్లో ఎంత బకాయిలున్నాయన్నదానిపై పూర్తి వివరాలు సేకరించింది. మిల్లర్ల ఎలాంటి దారులు ఎంచుకున్నారన్నదానిపై కూడా పూర్తి స్దాయి పరిశోధన కథనాలు ప్రచురించింది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రభుత్వాన్ని ఎలా బురిడీ కొట్టిస్తున్నారన్న విషయాలను అనేకం నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది. తాజాగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వొద్దని సూచిస్తూ నేటిధాత్రి కథనం రాసింది. గతంలో జరిగిన అనేక అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నేటిధాత్రిలో వచ్చిన కథనాలను క్షుణ్ణంగా పరిశీలించింది. తెలంగాణలో మిల్లర్లు చేస్తున్న మోసాలపై ఆరా తీసింది. ఎప్పటి నుంచి తెలంగాణలో మిల్లర్లు అక్రమ దందాలు మొదలు పెట్టారన్న సంగతులున్నింటిపై ఆరా తీసింది. నేటిధాత్రి రాసిన వార్తల్లో నూటికి నూరు పాల్లు నిజముందని మంత్రి వర్గ ఉప సంఘం ఒక నిర్ధారణకు వచ్చింది. వెంటనే మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నది. పెద్దఎత్తున బకాయిలు వున్న మిల్లర్లకు వడ్ల ఇచ్చే ప్రసక్తి లేదని నిర్ధారణకు వచ్చింది. ఆ విషయాన్ని మంత్రి వర్గ ఉపసంఘం అధికారికంగా ప్రకటించింది. నిజానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని వెసులుబాటు తెలంగాణ రైసు మిల్లర్లకు వుంది. అయినా మిల్లర్లు అక్రమాలు తెగడడం విడ్డూరం. గతంలో ఉమ్మడి రాష్ట్రంతోపాటు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా మిల్లర్లకు పెద్దగా స్వేచ్ఛ లేదు. మిల్లర్లు వడ్లు కావాలంటే ఖచ్చితంగా డిపాజిట్లు చెల్లించాలి. డిపాజిట్లు చెల్లించని మిల్లులకు అక్కడ ప్రభుత్వం వడ్లు సరఫరా చేయదు. కాని తెలంగాణలో మిల్లర్లకు రూపాయి కూడా డిపాజిట్‌ లేదు. మిల్లర్లు ఎంత కోరుకుంటే అన్ని వడ్లు ప్రభుత్వం ఇచ్చేది. అయినా మిల్లర్ల దన దాహం తీరలేదు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును వాడుకుంటూనే, మరో వైపు ప్రభుత్వాన్ని మోసం చేయడం అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వడ్లకు లెక్కకు లెక్కలేకుండా చేస్తున్నారు. వడ్లను తమ ఇస్టాను సారం అమ్ముకుంటున్నారు. మిల్లులు ఆడిరచి బియ్యం కూడా పెద్దఎత్తున అమ్ముకుంటూ ప్రభుత్వానికి అక్రమ మిల్లర్లంతా కలిసి వేల కోట్లు బకాయిలు పడ్డారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిన ప్రతిసందర్భంలోనూ అధికారులను మచ్చిగ చేసుకోవడం వారికింత ముట్ట జెప్పడం అలవాటు చేసుకున్నారు. చివరికి అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు. అదికారుల అవినీతి దాహం కూడా మిల్లర్లకు వరంగా మారింది. అధికారులు కూడా అడ్డూ అదుపు లేకుండా అవినీతికి తెబడడం నేర్చుకున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేయడంలో మిల్లర్లతో మిలాఖత్‌అయ్యారు. ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. ఈ దందాలు ఇక సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అక్రమ మిల్లర్లకు పాలుపోని పరిస్ధితి ఎదురైంది. ఇప్పటికప్పుడు ప్రభుత్వం ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని కూడా మిల్లర్లు ఊహించలేదు. గత పదేళ్లుగా సాగుతున్నట్లే ఇప్పుడూ సాగుతుందనుకున్నారు. మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు రోజున డిపాజిట్ల విషయం వెలుగులోకి రాగానే దాన్ని వ్యతిరేకించాలని కొంత మంది మిల్లర్లు రెడీ అయ్యారు. ప్రభుత్వం మీద పోరుకు సిద్దమయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో బకాయిలు వున్న మిల్లర్లకు వడ్లు ఇవ్వకూడదని నేటిధాత్రి సంచనల వార్తను ప్రచురితం చేసింది. ఆ వార్తను ఆధారం చేసుకొని అసలు అక్రమ మిల్లర్లకు వడ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మిల్లర్లకు దిక్కు తోచనిపరిస్దితి ఎదురైంది. ఇప్పుడు కథ అడ్డం తిరగడంతో మిల్లర్లు ఆగమాగమౌతున్నారు. ప్రభుత్వం ఇంకా ఉదాసీనత ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుందని ఉప సంఘం గ్రహించింది. ఇంకా నిర్లిప్తంగా వుంటే బకాయిలు మరింత పెరిగిపోతాయి. వాటి వసూలుకు మరింత ఇబ్బందులు తలెత్తుతాయి. పైగా బకాయిల వసూలుకు ఇదే సరైన సమయమని కూడా ప్రభుత్వం నిర్ధారణ చేసుకోవడంతో మిల్లర్లకు ఊపిరాకుండాపోతోంది. ఒక వేళ బకాయిలు చెల్లించాలన్నా మిల్లులు నడవాలి. మిల్లులు నడవాలంటే ముందు బకాయిలు చెల్లించాలి. ఎలాగైనా సరే ముందు బకాయిలు పూర్తి చేయాలి. ఈ దశలో బకాయిల వసూలులో అధికారులు అలసత్వం వహించకుండా చూడాల్సిన అవసరం వుంది. అయితే కొంత మంది మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు సిద్దమౌతున్నారు. కాని వందలకోట్లలో బకాయిలు వున్న వాళ్లు దిక్కు తోచని పరిస్దితి ఎదురౌతోంది. ప్రభుత్వంతో బేరసారాలు ఆడేందుకు వెసులుబాటు కల్పించాలని, కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక్కసారి వారికి అవకాశమిస్తే మళ్లీ బకాయిలు పెండిరగ్‌లో పడిపోతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి వుంది. మిల్లర్లు ఈ రకంగా బకాయిలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం అధికారులే అన్నది కూడా వెలుగులోకి వస్తోంది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన డిసిఎస్‌ఓల మూలంగానే ఈ బకాయిలు పెరిగిపోయానని తెలుస్తోంది. అధికారులకు ఎప్పటికప్పుడు కొంత ముట్ట జెప్పడం మిల్లర్లు అలవాటు చేసుకున్నారు. గతంలో జనగామ జిల్లాలో పనిచేసిన ఓ డిసిఎస్‌ఓ పెద్దఎత్తున అవినీతికి పాల్పిడినట్లు కూడా ఆరోపణలున్నాయి. అయితే ఒక్క జనగామలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డిసిఎస్‌ఓల పరిస్దితి అలాగే వుంది. పూర్తిగా అధికారుల సహాయ సహకారాలతోనే మిల్లర్లు ఎగవేత దారులుగా మారిపోయారన్న విమర్శలు కూడ వున్నాయి. అధికారులు అవినీతికి పాల్పడకపోతే మిల్లర్లు సకాలంలోనే బకాయిలు చెల్లించేవారు. ఎగవేత దారులైన మిల్లర్లకు సానుకూలంగా, న్యాయంగా బకాయిలు చెల్లించిన మిల్లర్లను అధికారులు వేదించడం నేర్చుకున్నారు. మిల్లర్లు బకాయిలు పడితేనే అదికారులకు మమూళ్లు అందేది. అందుకే అధికారులు అక్రమ మిల్లర్లకే వంత పాడడం నేర్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. న్యాయంగా వ్యహరించిన మిల్లర్లతో మీకు వడ్లు ఇస్తే మాకేం లాభమని అధికారులు ప్రశ్నిస్తున్నారంటే సివిల్‌సప్లయ్‌లో అవినీతి ఎంత పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం సరఫరా చేసే వడ్లను మిల్లింగ్‌ చేసి ఇచ్చిన మిల్లర్లను వేదిస్తూ, బకాయలు పేరుకుపోయిన వాళ్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వాదాయానికి గండిపడడంలో అధికారుల పాత్ర తక్కువేం కాదు. అందువల్ల ఏళ్ల తరబడి పాతుపోయి పని చేసిన డిసిఎస్‌ఓ అక్రమ ఆస్ధులపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో అలాంటి అధికారుల ఆస్ధులను సోదాలు చేస్తే అసలు బండారం బైట పడుతుంది. అక్రమ మిల్లర్లను అరికట్టాలంటే ముందు అధికారుల మీద కూడా దృష్టిపెట్టాలి. ఏ ఏ జిల్లాల్లో ఎంత మంది అక్రమ మిల్లర్లు వున్నారు. వారిని ఎవరు ప్రోత్సహించారు అన్న విషయాలు వెలుగులోకి రావాలి. అప్పుడే వ్యవస్ధ ప్రక్షాళన జరుగుతుంది. లేకుంటే నాలుగు రోజులు హడావుడి వుంటుంది. తర్వాత మళ్లీ అదే యదావిధి కొనసాగుతుంది. నిజమైన న్యాయమైన మిల్లర్లకు మళ్లీ మళ్లీ అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టకతో వ్యవస్ధను దిగజార్చినట్లౌతుంది. అంతే కాకుండా తెలంగాణలో మిల్లర్లకు, సివిల్‌ సప్లయ్‌కు మధ్య వున్న దళారీ వ్యవస్ధను పూర్తిగా ఎత్తివేయాలి. సివిల్‌ సప్లయ్‌లో ఎంతో మంది యంత్రాంగం వుంది. వారి సేవలు వినియోగించుకోకుండా దళారులను నమ్మితే ప్రభుత్వాదాయానికి గండి తప్ప మిగిలేదేమీ వుండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *