ఆ అధికారి ధైర్యవంతుడు.

https://epaper.netidhatri.com/view/207/netidhathri-e-paper-12th-march-2024/8

`అధికారుల్లో నిజాయితీకి నిలువెత్తు రూపం!

`మైనింగ్‌ మీద ఆ అధికారి ఉక్కుపాదం.

`ఏ అధికారులు సహకరించకపోయినా క్వారీల సందర్శన.

`అందరూ అలాంటి అధికారులుంటే వ్యవస్థకు జీవం.

`రాష్ట్రానికి పునరుజ్జీవం.

`అక్రమార్కుల పాలిట సింహస్వప్నం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అధికారుల్లో కొంత మంది అధికారులు వేరయా! వారెంతో గొప్పవారయా.. అని చెప్పుకోవాల్సివస్తే ఓ తహసిల్తార్‌ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల వడ్లగింజలో బియ్యపు గింజలాగా ప్రత్యేకంగా, గొప్పగా చెప్పుకునే అధికారులు చాల తక్కువగా వున్నారు. ఒక రకంగా చూస్తే భూతద్దం పెట్టి వెతికినా అక్కడొకరు, అక్కడొకరు మాత్రమే కనిపిస్తుంటారు. నిజం చెప్పాలంటే అలాంటి అధికారులు కొందరైనా వుండడం వల్లనే ఆ వ్యవస్ధల మనుగడ ఇంకా వుందనే చెప్పాలి. ఎందుకంటే తెల్లారి లేస్తే ఎక్కడో ఒక చోట అధికారి పట్టుబడ్డాడు అన్న వార్త కామన్‌ అయ్యింది. కాని ఫలానా అధికారి గొప్పవాడు. ఫలానా అధికారి మంచి వారు. అని ప్రజలు కీర్తిస్తున్నవారు లేరు. ఎక్కడ విన్నా, ఆ అధికారి లంచం అడిగాడు. ఈ అదికారి వేదిస్తున్నాడు. అన్న వార్తలు తప్ప, మంచి వార్తలు ఉద్యోగుల మీద వుంటాయి. అందులో రెవిన్యూ, రిజిస్రేషన్‌, తర్వాత పోలీసు. ఇవన్నీ ఒకే కోవకు చెందిన ఉద్యోగాలు. అప్పుడప్పుడు వైద్యశాఖలో వినిపిస్తుంటాయి. కాని ఇలాంటి శాఖలో మంచి వైద్యుడంటే దేవుడంటాం. మంచి తహసిల్ధార్‌ వుంటే ప్రజలకు ఎంతో మేలు చేసే అధికారి అంటాం. అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల అధికారుల నిజ స్వరూపం ఏమిటో బాగా తెలిసిపోయింది. మరో రకంగా చెప్పాలంటే అధికారుల ఆస్ధులు వందల రెట్లు పెరిగాయి. నెల నెల జీతాలు తీసుకునే అధికారుల జీవితాలు ఒక్కసారిగా విలాసవంతమైన, సంపన్న వంతమైనవిగా మారిపోయాయి. ఇటీవల పట్టుబడని హెచ్‌ఎమ్‌డియే అధికారి బాలకృష్ణ సంగతి తెలిసిందే.

ఒక అధికారి ఇన్ని వందల కోట్లు ఎలా పోగేసుకోగిగాడు. కోట్ల రూపాయాలు ఇంట్లో దాచుకున్నాడు.
కిలోల కొద్ది బంగారం కొనుగోలు చేయడం అంటే వ్యవస్ధ ఎక్కడికి వెళ్తుందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే ఉద్యోగ వ్యవస్ధలో మహిళా అధికారులు వుంటే నిజాయితీ పెరిగిపోతుందని అనుకునేవారు. ఇటీవల బైటపడుతున్న సంఘటనల్లో వాళ్లు కూడా వుంటున్నారు. ఇటీవల ఓ పట్టుబడిన ఓ మహిళా అధికారి ఇంట్లో ఆస్ధులు, నోట్ల కట్టలు, కిలోలకొద్ది బంగారు ఆభరణాలు…ఎలా సాధ్యమౌతున్నాయి. అంటే ప్రజలు ఏ విధంగా పీల్చుకుతింటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల ఓపిక నషించిన సందర్భాలు కూడ అనేకం వున్నాయి. ఓ తహసిల్ధార్‌ పై ఏకంగా బాధితుడు పెట్రోలు పోసి నిప్పంటిచారు. మరో దగ్గర కార్యాలయాలకు తాళాలు వేశారు. మరో చోట ఓ మహిళా బాదితురాలు తన తాళిని కార్యాలయం గుమ్మానికి వెలాడి దీసి నిరసన తెలిపారు. లంచం, లంచం అని వేధిస్తున్న ఓ మత్య్స శాఖకు చెందిన అధికారి మెడలో నోట్ల కట్టల దండ వేసి నిరసన తెలిపారు. ఇలా కొన్ని వేల సంఘటలున్నాయి. మహిళా అధికారిని పెట్రోలు పోసిన సమయంలో మా కార్యాలయంలో లంచం తీసుకోబడదు. అని కొన్ని కార్యాలయాల్లో బోర్టులు తగిలించారు. ఇప్పుడు ఎక్కడైనా వున్నాయా? కనిపిస్తున్నాయా? ఏ అధికారైనా నేను లంచం తీసుకోలేదు. తీసుకోను అని చెబుతున్నాడా? కనీసం పేదల పక్షాన నిలబడుతున్నారా? మెజారిటీ అధికారులు సంతకానికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు. అలాంటి వ్యవస్ధల్లో ఒక్కడున్నాడు. అని గొప్పగా చెప్పుకోవాల్సిన అధికారి ఒకరున్నారు. ఇలాంటి వాళ్ల గురించి ప్రపంచానికి తెలిస్తే, సమాజంలో వారు పొందుతున్న గైరవం తెలిస్తే మేం కూడా తప్పులు చేయకుండా, అవినీతికి ఆశపడకుండా విధులు నిర్వర్తిస్తామని మారుతారేమో! అని నేటిధాత్రి చిన్ని ఆశ…

ఆయన ఓ తహసిల్ధార్‌. పేరు రమేష్‌బాబు. నిజానికి నిలువెత్తు రూపం.
నిజాయితీకి నిదర్శనం. పైగా ధైర్యవంతుడు. ఆదర్శప్రాయుడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండల రెవిన్యూ అధికారి. ఆయన పనిచేసే మండల పరిధిలో ఎక్కడపడితే అక్కడ మైనింగ్‌ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. ప్రజల నుంచి పిర్యాధులు విపరీతంగా అందాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు మేలు చేయాలనుకున్నాడు. ఆ మండల పరిధిలో జరిగే కొన్ని గ్రానైట్‌ మైనింగ్‌ క్వారీలను సందర్శించాలనుకున్నాడు. అక్రమం అనుకున్న వాటికి నోటీసులు ఇచ్చాడు. నిజానికి గ్రానైట్‌ క్వారీలు అంటే అవి మహాసముద్రం లాంటివి. వాటిని ఈదడం ఎవరి వల్ల కాదు. బైటి వ్యక్తులు క్యారీలను కనీసం తొంగి చూడలేరు. ఆ దరిదాపుల్లోకి కూడా పోలేరు. పోయినా తిరిగి రాలేదు. అలా వుంటుంది ఆ సామ్రాజ్యం. అందులో పనిచేసే కార్మికులే తోక జాడిస్తే మరునాడు పని వుండదు. ఇంకా ఎవరైనా మొండికేస్తే జీవితమే వుండదు? మరి అలాంటిది ఏ సామాన్యుడు ఆ దరిదాపుల్లోకి వెళ్లలేడు. అదికారులు అసలే వెళ్లరు. ఎందుకంటే అక్కడికి వెళ్లముందే సామదాన బేధదండోపాయాలు కూడా చవిచూస్తారు. అయినా భయపడకపోతే తప్ప ఆ మైనింగ్‌ ప్రాంతాలను ఓ అధికారి చేరుకోలేడు. కాని రమేష్‌ బాబు చేరుకున్నారు. మైనింగ్‌ వ్యాపారులు భుజ్జగించారు. వినలేదు. బెదిరించారు. భయపడలేదు. హెచ్చరించారు. లేక్కచేయలేదు. క్వారీలు చూడాల్సిందే అన్నాడు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా డోంట్‌ కేర్‌ అన్నాడు. ఇక్కడ కాకపోతే మరో చోట ఉద్యోగం చేసుకుంటాను.

ట్రాన్స్‌ఫర్‌ కొత్త కాదన్నాడు. ఎక్కడ పోస్టింగ్‌ చేస్తే అక్కడ నిజాయితీగా వుంటాను.
ధైర్యంగా పనిచేస్తాను. ప్రజలకు మేలైన పనులే చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. గతంలో ఎంతో మంది అధికారులు భయపడిన చోట ధైర్యంగా క్వారీల వద్దకు వెళ్లాడు. కొన్ని గ్రానైట్‌ కంపనీలకు నోటీసులు జారీ చేశాడు. దాంతో ఆ అదికారిని ప్రజలు ఎంతో గొప్పగా చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయనకు అధికారులు ముందు సహకరించినట్లు కనిపించలేదు. కాని తహసిల్ధార్‌ ధైర్యం చూసి, ఆయన కింది సిబ్బంది కూడా సహకరించారు. ధైర్యంగా క్యారీలను పరిశీలించారు. ధైర్యంగా వాటికి నోటీసులిచ్చారు. లోపాలపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాడు. ఇలాంటి అధికారులే మొత్తం ఉద్యోగ వ్యవస్ధలో వుంటే అవినీతి అన్న పదమే ఎక్కడా వినిపించదు. ప్రజల సమస్యలు పేరుకుపోవు. పెద్ద చిన్న అనే తేడా సమాజంలో వుండదు. ఒకరిపై మరోకరి పెత్తనాలకు తావుండదు. ప్రజలంతా సమానం..అనే రాజ్యాంగ స్పూర్తి పరిఢమిల్లుతుంది. అంతే కాదు అక్రమలు చేయాలంటే కూడా అందరూ భయపడతారు. భూముల విషయంలో గాని, మరే విషయంలో గాని ఏ ఒక్క అధికారి మేం తప్పు చేయం. లంచం తీసుకోమని చెబితే, వారిని ఒత్తిడి చేయడం ఎవరి వల్ల కాదు. వారిచేత తప్పులు చేయించడం ఎంత పెద్ద వల్లకూడా కాదు. కాకపోతే వారి బలహీనతలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటారు. అధికారులను అవినీతి పరులను చేస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో చేరే ముందు అధికారి లంచాలు తీసుకొని మేడలు మిద్దెలు కట్టాలనుకోడు. సమాజానికి సేవ చేద్దామనే అనుకుంటాడు. కాని ఆ వ్యవస్ధను చూసి, చూసి తాను కూడా అలాగే తయారౌతాడు. అవినీతి అధికారిగా ముద్రపడతాడు. అక్రమార్కులకు సహరిస్తుంటారు. అయినా తులసి మొక్కలా అక్కడక్కడ రమేష్‌ బాబు లాంటి అధికారులు కొందరుంటారు. సమాజం చేత శబాష్‌ అనిపించుకుంటారు. ప్రజల చేత కీర్తింపబడుతుంటారు. ఆ వ్యవస్ధలకే వన్నె తెస్తుంటారు. లంచావతారులు అనే శీర్షికలో లంచం అనేదానిని ఆమడ దూరం పెట్టే అధికారి గురించి వార్తలు రాస్తే, కొంత మందైనా మారుతారన్నదే నేటిధాత్రి ఆశ…సమాజానికి మేలు జరగాలన్నది నేటిధాత్రి కోరిక. సమాజం మారితే అందిరికీ మేలు. ఈ వ్యవస్ధలకు జీవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!