https://epaper.netidhatri.com/view/296/netidhathri-e-paper-18th-june-2024%09/2
`నాడు చంద్రబాబు.. నేడు హరీష్ రావు!!
`1989 లో ప్రజలు తనను ఓడిరచి తప్పు చేశారన్నారు ఎన్టీఆర్.
`2023 ప్రజలు మరింత ఆశతో ఓడిరచారన్నారు కేసిఆర్.
`1989 నుంచి 1999 వరకు టిడిపిని పార్టీని కాపాడిరది చంద్రబాబు.
`ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను బతికించేది హరీష్.
`1989లో ఓడాక ఎన్టీఆర్ బయటకు రాలేదు.
`అసెంబ్లీకి కూడా వెళ్లలేదు.
`అసెంబ్లీలో అవమాన భారం భరించలేనన్నాడు.
`అసెంబ్లీలో ఉపనాయకుడిగా అప్పటి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నది చంద్రబాబే.
`పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని కాపాడిరది చంద్రబాబే.
`ఇప్పుడు బిఆర్‌ఎస్ కోసం కష్టపడేది హరీష్ రావే.
`ఇప్పుడు కేసిఆర్ కూడా బయటకు రావడం లేదు.
`అధికారంలో వున్నప్పుడు కూడా పెధ్దగా జనాన్ని కలవలేదు.
`అప్పుడు టిడిపి అధికారంలోకి రావడానికి బాబే కారణం.
`ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను మళ్ళీ నిలబెట్టాలంటే హరీష్ తోనే సాధ్యం.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయంలో ఎన్టీఆర్‌కు, కేసిఆర్‌కు కొన్ని పోలికలున్నాయి. సినీ రంగం నుంచి వచ్చి రాజకీయం చేసి, రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు ఎన్టీఆర్. వస్తూ వస్తూనే రాజకీయ ప్రభంజనం సృష్టించారు. అంతలోనే ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 1985లో మళ్లీ అనూహ్య విజయం సాధించిన ఎన్టీఆర్ ప్రజలకు దూరమయ్యారు. సినిమాల మీద వ్యామోహం తగ్గలేదు. దాంతో ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా షూటింగులో మునిగితేలారు. పాలన గాలికి వదిలేశారు. ప్రజలకు సంక్షేమ పధకాలు అందజేస్తున్నానని, ప్రజలు తనను దేవుడిలా కొలుస్తున్నారన్న అహం ఎక్కువై జనానికి దూరమయ్యారు. 1989 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. దాంతో ప్రజలు తనను ఓడిరచి తప్పు చేశారని అన్నారు. ఈ విషయంలో కేసిఆర్‌కు కూడా అంతే చేశారు. ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ సాధకుడిగా ప్రజలు కేసిఆర్‌ను ఆదరించారు. సంక్షేమ పథకాల అమలుతో ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. రెండుసార్లు గెలిపించారు. ఆయన ప్రగతి భవన్‌కే పరిమితమై ప్రజలకు దూరమయ్యారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మళ్లీ ప్రజలకు చేరువౌతానని చెప్పలేదు. కాలేదు. ఓడిపోయి ఆరు నెలలు గడుస్తున్నా ఆయన జనం మధ్యకు విచ్చంది లేదు. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఓ ఇరవై రోజలు బస్సు యాత్ర చేశారు. ప్రజలు ఆత్యాశకుపోయి ఓడిరచారనే అర్ధమొచ్చేలా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజా తీర్పును గౌరవించడం లేదన్న అర్ధంలోనే మాట్లాడారు. 1989 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ పెద్దగా అసెంబ్లీకి హజరు కాలేదు. అప్పుడప్పుడు, అడపా దడపా అన్నట్లు వచ్చేవారు. ఆ సమయంలో అప్పటి పాలక పక్షం ఎన్టీఆర్‌ను తూర్పారపడుతుండేంది. అసెంబ్లీలోనే ఆట పట్టిస్తుండేది. దాంతో ఎన్టీఆర్ అసెంబ్లీకి రావడం మానేశారు. ఆ సమయంలో అటు పార్టీని, అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు నాయుడే సమన్వయం చేసేవారు. ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరుగుతూ పార్టీని బలోపేతం చేశారు. తీరా ఎన్నికల సమయం దగ్గర పడిన వేళ ఈనాడు పత్రిక ఎత్తుకున్న సారా నిషేద ఉద్యమాన్ని ఎన్టీఆర్ భుజాన వేసుకున్నారు. రాష్ట్రంలో పర్యటనలు చేశారు. అటు చంద్రబాబు ఆ కార్యక్రమాల రూపకల్పన, పర్యవేక్షణ చేసేవారు. ఇప్పుడు బిఆర్‌ఎస్ విషయంలోనూ అదే జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయం మొత్తం కేసిఆర్‌కు తోడుగా నిలిచింది ఒక్క హరీష్‌రావే. ప్రభుత్వంలో కొన్ని సార్లు ప్రాధాన్యత, మరి కొన్ని అప్రదాన్యత వున్నా, ఆయన సర్ధుకుపోయారు. ఇప్పుడు మళ్లీ హరీష్‌రావు అవసరం పార్టీకి వచ్చింది. కేసిఆర్ ఎలాగూ ఈ ఐదేళ్ల పాటు బైటకు రాడు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇదే ముమ్మాటికీ నిజం. మళ్లీ బిఆర్‌ఎస్‌ను తన భుజాల మీద వేసుకొని నడిపించాల్సిన బాద్యత హరీష్‌రావు వంతే అవుతుంది. ఏ నాయకుడైనా సరే..ఎంత పెద్ద నాయకుడైనా సరే జనంలో లేకపోతే అంతే..జనాన్ని దూరం చేసుకంటే అంతే… ఇప్పటికైనా కేసిఆర్ తెలుసుకోవాల్సింది ఒక్కటే. గెలిచినా ఓడినా, జనంలో వుంటేనే పార్టీకి మనుగడ. నాయకుడికి భవిష్యత్తు. ఇవి కేసిఆర్‌కు తెలియక కాదు. జనమంటే చులకన.
జనమంటే గొర్రెలని నమ్మకం. అదే వారిని నిండా ముంచింది.
దీనికి తోడు తన చుట్టూ వుండే భజన సంఘం చెప్పిందే వినడం నాయకులకు ఆశని పాతం. కేసిఆర్ పక్కన వుండేది కొందరే..అందులో ఎక్కువ ముందుండేది ఒక్కడే. ఆ ఒక్కటే బిఆర్‌ఎస్ పార్టీ సర్వనాశనమయ్యేందుకు దారి తీసిందనేది అందరూ చెప్పే మాటే. ఒకప్పుడు ఎప్పుడూ జనంతో, జనంలో వుండే కేసిఆర్ జనానికి దూరమయ్యాంటే కారణం సంతోష్. ఇది తెలంగాణ మొత్తం చెప్పే మాట. కేసిఆర్ బంధువులు అనే మాట. బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించే మాట. ఉన్నతాదికారులు కూడా నోరెత్తకుండా, మనసులో నిత్యం తిట్టుకున్న మాట. ఇప్పటికీ కేసిఆర్ ప్రజల దగ్గరకు రాకపోవడానికి, వచ్చిన వారిని కలవకపోవడానికి కూడా కారణం సంతోషే అంటారు. కాని ఇక్కడ మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా వుంది. సంతోష్ వద్దంటే ఆగే కేసిఆర్ మనకెందుకు అన్నది తెలంగాణ సమాజం ఆలోచించింది. అయినా కేసిఆర్‌లో మార్పు ఎందుకు రావడం లేదు? ఇది ఎవరైనా సరే లోతుగా ఆలోచించాల్సిన విషయం. కేసిఆర్ ఇప్పుడే కాదు..ఎప్పుడూ జనంలోకి రావడానికి ఇష్టపడడు. ఆయన కూర్చన్న దగ్గర నుంచి చేసే ఆదేశాలు అమలు కావలని కోరుకుంటాడు. ఉద్యమ నేపధ్యం కూడా ఓసారి బాగా పరిశీలించి చూస్తే ఎన్నికలు వుంటే తప్ప కేసిఆర్ బైటకు రాడు. ఇది ముమ్మాటికీ నిజం. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా చెప్పార ఎన్నికలంటే కేసిఆర్‌కు ఒక జూదం లాంటిది. ఎప్పుడూ ఎన్నికలు వుండాలని కోరుకునే వ్యక్తి. ఎన్నికలు వుంటే తప్ప ఆయన బైటకు రాడు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన జనానికి దూరమౌతాడు. ఇదే గతంలో జరిగింది. కాకపోతే అప్పుడు జనం ఆకాంక్ష వేరు. ఇప్పుడు జనం అవసరాలు వేరు.
ఒక తరం మారింది. కొత్త తరం వచ్చింది.
ఒకప్పుడు తెలంగాణ అవసరాలు వేరు. ఇప్పుడు అవసరాలు వేరు. గతంలో నీరుకావాలి. పంటలు పండాలి. రైతు బతకాలి. ఓ వైపు రైతు బతకాలని చెప్పిన కేసిఆర్ మరో వైపు రియల్ రంగాన్ని ప్రోత్సహించారు. తెలంగాణ భూములు ధరలు విపరీతంగా పెంచారు. దాంతో సాగుచేసుకునే రైతు కూడా భూములు అమ్ముకున్నాడు. అప్పటికప్పుడు వచ్చిన సొమ్మును చూసి మురిసిపోయాడు. ఇప్పుడు ఎకరం భూమి కొనాలంటే బాధపడుతున్నాడు. భూమి అన్నది అందరిది. అది అందరికీ అందుబాటులో వుండాలి. భూముల ధరలు పెరిగితే సామాన్యుడు బతకలేదు. రైతు సాగు చేయలేడు. సాగును నమ్ముకొని బతకలేడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంట్లోనుంచి బైటకు రాకుండా ప్రగతి భవన్‌లో వుంటూ, ఫామ్ హౌజ్‌కు చక్కర్లు కొడుతూ కాలయాపన చేశాడు. ప్రజలకు, కేసిఆర్‌కు మధ్య దూరం పెరిగిపోయింది. ఉద్యమ బంధం తెగిపోయింది. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. అలా కాంగ్రెస్ గెలిచిందో లేదో, ఇలా లబోదిబో మంటూ లేనిపోనివి కేసిఆర్ ప్రచారుం చేశాడు. ఇక తెలంగాణ ఆగమైపోయిందని గుండెలు బాదుకున్నాడు. కేసిఆర్ మొసలికన్నీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్లమెంటులో పది సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పేవాళ్లమని ఇప్పుడు అంటే ఏముంది. ఇక్కడ చంద్రబాబు గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి.
చంద్రబాబులో వున్న నాయకత్వ లక్షణం ఏ నాయకుడికి లేదు.
ఎందుకంటే ఆయన అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ఏనాడు ప్రజలకు దూరంగా లేడు. ఏనాడు ఆయన ఇంటికి పరిమితం కాలేదు. 1995లో ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఎప్పుడూ ప్రజల్లోనే వుంటూ వచ్చారు. 2004లో ఓడిపోయినా ఆయన ఇంట్లో ఏనాడు కూర్చోలేదు. ఐదేళ్లపాటు ఆయన జనంలోనే తిరిగారు. తర్వాత 2009 మళ్లీ ఓడిపోయారు. అయినా ఆయన రాజకీయాలు వదిలేసుకోలేదు. జనాన్ని నిందించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాడు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా ఆయన ఏనాడు ప్రజలకు దూరంగా లేరు. అటు పాలన, ఇటు పార్టీ, అమరావతి నిర్మాణం, పెట్టుబడలు ఆకర్షణ కోసం విదేశీ ప్రయాణాలు, పరిశ్రమల స్ధాపన, పోలవరం నిర్మాణం వంటి వాటిపై పూర్తి స్ధాయిలో దృష్టిపెట్టారు. ప్రతి సోమవారంను పోలవరం రోజుగా నామకరణం చేశారు. ఆ రోజు పోలవరం సందర్శన, లేకుంటే పోలవరం సమీక్ష జరిపేవారు. రాష్ట్ర ప్రయోజనాల మీద అంకిత భావం వున్న నాయకుడు అలా వుండాలి. అలా ఆయన నిత్యం ప్రజల్లో వుంటే చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి అంటూ కేసిఆర్ లాంటివాళ్లు ఎగతాలిచేశారు. మరి ఇప్పుడేం కేసిఆర్ ఏం మాట్లాడతారు? ప్రజలు మళ్లీ చంద్రబాబును ఈ వయసులో కూడా ఎందుకు కావాలనుకున్నారు. అదే చంద్రబాబు విషయంలో ఏనాడు ఏ కోటరీ లేదు. వున్నా అది కుటుంబ కోటరీ కాదు. సాక్ష్యాత్తు హరికృష్ణను కూడాదూరం పెట్టాడు. తోడళ్లుడు వెంకటేశ్వరరావును పక్కన పెట్టాడు. కాని కేసిఆర్ బంధువలందరనీ చేర్చుకున్నాడు. కుటుంబ పాలన సాగించాడు. సంతోష్ చెప్పిందే విన్నాడు. జనం ఆకాంక్షలు పెడచెవినపెట్టాడు. ఇదే చంద్రబాబుకు కేసిఆర్‌కు వున్న తేడా. అందుకే ఈ వయసులో కూడా చంద్రబాబు సునామీ సృష్టించాడు. చంద్రబాబు ఆనాడైనా ఈనాడైనా ఎవరినీ నమ్ముకోలేదు. తనను తాను నమ్ముకున్నాడు. పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. తరాలు మారినా మారాని పార్టీ యంత్రాంగాన్ని తయారు చేసుకున్నాడు. అందుకే మళ్లీ మళ్లీ గెలుస్తున్నాడు.