`పదవీ కాంక్ష తప్ప పరోపకారం లేదు!
`జనంలో లేని సేనకు సేనాని!?
`తనకు తానే అప్రకటిత జ్ఞాని?
`యంత్రాంగం లేని పార్టీనిన డుపుకుంటున్నాడు.
`టిడిపి నీడలో గెలిచి నేనే గొప్ప అనుకుంటున్నాడు.
`తెలుగు తమ్ముళ్ల దయతో గెలిచి నా వల్లే కూటమికి బలిమనుకుంటున్నాడు!
`పక్కదారి పడుతున్న పవన్ అత్యాశ!
`పవన్ గెలుపే టిడిపి పుణ్యం!
`పవన్ పేరాశ పదవికి చేటు
`జనసేనకు జనంలో ఆదరణ లేదు
`పవన్ కళ్యాణ్‌ను జనం నాయకుడుగా ఇంకా గుర్తించలేదు
`తెలుగు దేశం బలంతో జనసేన గెలిచింది
`ఎన్నికల నాటికి జనసేనకు అభ్యర్థులే లేరు
`జగన్ వద్దనుకున్న ఎమ్మెల్యేలను అద్దెకు తెచ్చుకున్నారు
`పార్టీకి పని చేసిన వారికి పక్కకు పెట్టి టిక్కెట్లిచ్చాడు
`2019 నుంచి పవన్ చేసిన పోరాటం లేదు
`అసలు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు
`లోకేష్ పాదయాత్ర కూటమి గెలుపుకు కారణమైంది
`చంద్రబాబు మీద నమ్మకంతో జనం ఓట్లేసి గెలిపించింది
`పొత్తు ధర్మంలో చంద్రబాబు స్నేహానికి విలువిచ్చారు
`దానిని పవన్ విచ్చిన్నం చేసుకోవాలని చూస్తున్నారు
`ఇప్పటికీ అన్న నాగబాబు రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ ఆరాటపడుతున్నాడు
`పెద్దన్న చిరంజీవికి పెద్ద పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నడు
`జనసేన నాయకుల కోసం పవన్ ఆలోచించడం లేదు
`కూటమి గెలుపులో కీలక భూమిక తెలుగు తమ్ముళ్లు
`ఐదేళ్లలో కేసులు ఎదుర్కొన్నది తమ్ముళ్లు
`వైసిపి మీద అలుపెరుగని పోరాటం చేసింది తమ్ముళ్లు
`నిర్భంధాలను ఎదుర్కొని నిలబడిరది తమ్ముళ్లు
`సుదీర్ఘమైన పాదయాత్ర చేసింది లోకేష్
`ఇక్కడ పవన్ పాత్రేముంది?
`పవన్ బలం ఎక్కడ పనికొచ్చింది
`పంట చేతికొచ్చాక కుప్ప మీద కూర్చున్నది పవన్
`కూటమిలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నది పవన్
`చెరపకురా చెడేవు అన్న సామెత మర్చిపోయినట్లున్నాడు
`స్వయంకృతాపరాధంతో మొత్తం చెడగొట్టుకుంటున్నాడు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గెలుపుకు కారణం ఎవరు? ఇది ఇప్పుడు ఏపిలో జరుగుతున్న చర్చ. నిజంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూలంగానే కూటమికి అంత మెజార్టీ వచ్చిందా? లేక తెలుగుదేశం బలం వల్లనే జనసేనకు ఉనికి ఏర్పడిరదా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూలంగానే జనసేనకు ఊపిరి పోసినట్లైందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జనసేనాని పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నికల్లో గెలిచింది లేదు. గత ఎనికల్లో రెండు చోట్ల పోటీచేసినా ఒక్క సీటులో కూడా కనీసం ప్రభావం చూపలేదు. అలాంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశానికి ఊపు వచ్చిందనేదానిలో అర్దమే లేదు. ఎందుకంటే వైసిపి ప్రభుత్వ హయాంలో జనసేన చేసిందేమీ లేదు. తన ఉనికి కోసం పడిన ఆరాటం లేదు. వైసిపి మీద చేసిన జనసేనాని ప్రత్యక్షంగా చేసిన పోరాటమేమీ లేదు. ఏనాడు ఏ ఒక్క సమాజం కోసం ఉద్యమం చేసింది లేదు. అసలు ప్రజల్లో వున్నదే సరిగ్గా లేదు. అప్పుడప్పుడు సీజనల్ నాయకుడిగా వచ్చిపోవడం తప్ప ఆయన నిబద్దతలో రాజకీయాలు చేయలేదు. అటు సినిమాలు చేసుకుంటూ, ఆ గ్యాప్‌లో రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాని ఎన్నికలకు ఆరు నెలల ముందు వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడం, ఆ సమయంలో పవన్ కల్యాణ్ కలిసి రావడంతో జనసేన దశ తిరిగింది. తెలుగుదేశం నీడలో ఆ పార్టీకి వెలుగు సంతరించుకున్నది. ఎంతో గొప్ప మనసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హుందాగా పవన్ కల్యాణ్ సహాకారాన్ని కొనియాడారు. ప్రభుత్వ ఓటు చీలిపోకుండా వుండేందుకు, కూటమి అద్భుతమైన విజయం సాదించేందుకు పవన్ కృషి గొప్పదని అనేక సార్లు చెప్పారు. నిజానికి ఆ సమయంలో పొత్తు లేకపోకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. ఇది ముమ్మాటికీ నిజం. కాని జగన్ రాజకీయాన్ని తుడిచిపెట్టాలంటే జనసేన కూడా కలిసి వస్తే అద్భుతమైన విజయాన్ని చూడొచ్చని తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు ముందుకు సాగారు. అది జనసేనకు బాగా కలిసి వచ్చింది. అసలు ఉనికిలో లేని జనసేనకు జవసత్వాలు వచ్చేలా చేసింది. ఎన్నికల మందుకు పవన్ కల్యాణ్‌కు కూడా తన బలమెంతో తెలియదు. అంతే కాదు తాను గెలుస్తానో లేదో..అని చెప్పిన సందర్భాలు కూడా అనేకం వున్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్‌కు ఆ పొత్తు పొడిచినప్పుడే అడిగిన 50 సీట్లకు తగ్గేవారు కాదు. కాని ఆయనకు పది సీట్లు ఇస్తే ఎక్కువ అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయకుడు ఎంతో ఉదారతతో 21 సీట్లు ఇచ్చారు. అయినా పవన్ కల్యాణ్ ఎంత మంది జనసేన నాయకులకు టిక్కెట్లు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో తన అన్న నాగబాబుకు కూడా టికెట్ ఇచ్చిన పవన్ ఈ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే తన గెలుపు మీదనే ఆయనకు నమ్మకం లేదు. దాంతో నాగబాబును రంగంలోకి దింపలేదు. లేకుంటే తప్పకుండా అన్నకు టికెట్ ఇచ్చేవారు. గత ప్రభుత్వం వైసిపి మీద నిరంతరం పోరాటం చేసింది చంద్రబాబు నాయుడు, లోకష్, తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు నాయుడు నుంచి, తమ్ముళ్లదాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు ఏకంగా జైలు పాలయ్యారు. లోకేష్ సుధీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలను చైతన్యం చేశారు. ఇలా ఐదేళ్ల పాటు నిరంతరం వైసిపికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాని వైసిసికి వ్యతిరేకంగా పోరాటం చేసిన జనసైనికులు ఎవరైనా వున్నారా? అసలు ఇప్పటి వరకు ఆ పార్టీకి యంత్రాంగమే లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు 21 టికెట్లు ప్రకటిస్తే కూడా అందులో జనసేన నుంచి పోటీ చేసేందుకు అభ్యర్దులే దొరకలేదు. జగన్ టికెట్లు ఇవ్వకుండా వదిలేసిన నాయకులను జనసేనలోకి తీసుకొని పవన్ టిక్కెట్లు ఇచ్చారు. వైసిపి పనికి రారని వదిలేసిన వారికి పవన్ టిక్కెట్లు ఇచ్చారు. అది కూడా ఆ నాయకులు పవన్‌ను చూసి రాలేదు. కూటమిని చూసి వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వచ్చారు. ఈ విషయం పవన్‌కు ఇప్పటికీ అర్ధం కాకుండా వుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు. 2019లో ఆయన తెలుగుదేశానికి దూరంగా వున్నారు. తర్వాత మళ్లీ దగ్గరయ్యారు. జగన్ మీద కలిసి పోరాటం చేశారు. ఇది కూడా పవన్ కల్యాన్ వ్యూహంలో భాగమే. ఒకరికొకరు అన్నట్లు ఉభయ కుశలోపరిగా సహకరించకుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకున్నారు. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇంత వరకు బాగానేవుంది. కాని ఎప్పటికైనా తెలుగుదేశం పొత్తుతో ఈ ఐదేళ్ల కాలంలో ఏదైనా జరగొచ్చని పవన్‌కు తెలియంది కాదు. మంత్రి లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదనలు వస్తాయని పవన్‌కు తెలియక కాదు. పవన్‌కు అన్నీ తెలుసు. తెలిసే పొత్తుకు అంగీకరించారు. ముందు ఏరు దాటాలి. అప్పుడు కదా? ఏ నిర్ణయం తీసుకునేది అనుకున్నారు. అనుకున్నట్లుగా ఆది నుంచి వ్యవహరిస్తూనే వస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ మీద చేసిన వ్యాఖ్యలైనా, ఇతర చర్యలైనా ఆయన కావాలనే చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు తనపై రాకుండా చూసుకుంటూ జాగ్రత్తపడుతున్నారు. అయితే లోకేష్‌కు ప్రాధాన్యత ఇంత తొందరగా ఇచ్చే రాజకీయం మొదలౌతుందని పవన్ కూడా ఊహించలేదు. దాంతో తన ప్లాన్‌కు పవన్ మరింత పదును పెట్టారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా దూరం దూరంగా వుంటున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే ఈ మధ్య ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలువచ్చాయి. కాని మరునాడే దక్షిణభారత దేశ సనాతన ధర్మ యాత్ర మొదలు పెట్టారు. దేవాలయాల సందరర్శను వెళ్లిపోయారు. ఇది తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడాలనుకున్నా సాధ్యం కాలేదు. అంటే దూరం పెంచుకోవాలని పవన్ అనుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నట్లే లెక్క. దీని వెనకాల బిజేపి వుందన్న వాదనలు కూడా వున్నాయి. బిజేపి దక్షిణాదిలో పాగా వేసేందుకు పవన్‌ను ఒక వారదిగా వాడుకోవాలని చూస్తోందనేది కనిపిస్తూనే వుంది. ఎందుకంటే ఒకప్పటి పవన్ వేరు..ఇప్పుడు పవన్ వేరు. ఒకప్పుడు తాను ఎర్రరంగు వాదినని ఆయనే చెప్పుకున్నారు. ఇప్పుడు కాషాయదారిగా మారారు. అందువల్ల పవన్ రాజకీయాలు రకరకాల మార్గాలను ఎంచుకొని సాగుతోంది. కూటమిలో కటకట మొదలైందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అందులో పెద్దగా విబేధాలు కనిపించకపోయినా, కుంపటిలో నివురుగప్పిన నిప్పులా పొగ మాత్రం అప్పుడపప్పుడూ కనిపిస్తుంది. అందుకే పవన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజకీయాన్ని విస్తరించాలనుకుంటున్నాడు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూడా పవన్ రాజకీయానికి ఆది లోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది. పెద్దలు కీలెరెగి వాతలు పెట్టాలన్నారు. ఇప్పుడు జనసేన విషయంలో టిడిపి ఆ పద్దతి అనుసరించాల్సిన పరిస్ధితి వస్తుందనే చెప్పాలి. రెండు బలమైన జోడెట్లు బండి లాగుతుంటే దాని కింద నడుస్తున్న మేక నేనే లాగుతున్నాను అన్నట్లు వుంది ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన. రాజకీయాలలోకి రాకుముందు పవన్ కల్యాణ్‌పై రకరకాల ఆరోపణలు వుండేవి. ఆయన ఆవేపరుడని అంటూ రకాల మాటలు వినపడేవి. అవి ఆయన ప్రత్యక్ష్యంగా తెలిసిన వ్యక్తులు చేసిన వ్యాఖ్యలే. కాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనలో కొంత మార్పువచ్చిందని అంటారు. కాని గతంలో ఎన్నికల ముందు ఆయన ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి ఇంకా ఆయనలో అలాంటి ఆవేశం వుందనేది కాదనలేనిది. కాకపోతే పవన్ కల్యాన్‌ను బాగా అభిమానించే వారంత ఆయన వ్యక్తిత్వమే పవనిజమంటూ గొప్పగా చెప్పుకునేవారు. ఆ పవనిజంలో నిజమెంత వుంది? అన్నది ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులతోనే తేలిపోతోంది. ఒకప్పుడు ఆయన ఆలోచనలు వేరు. ఆయన చెప్పిన మాటలు వేరు. తాను బీఫ్ తినాల్సివస్తే అంటూ ఒకరి మనోభావాలను, వారి ఆచార వ్యవహారాలను తప్పు పట్టొద్దని చెప్పిన సందర్బాలు అనేకం వున్నాయి. కాని ఇప్పుడు అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మంలో గతం తాలూకు ఆలోచనలన్నీ తుడిచేశారా? సమాధి చేశారా? అన్నది ఆయన వ్యక్తిగతం. కాని ఆయన ప్రజల్లో వుంటున్నారు. ప్రజానాయకుడుయ్యారు. రాజ్యాంగబద్దమైన పదవిలో వున్నారు. దాంతో ఆయన గతంలో చెప్పిన మాటలను, ఇప్పడు ఆచరిస్తున్న విధానాలను అనేక మంది ప్రశ్నిస్తున్నారు.