అసలైన తెలంగాణ వాది రేవంత్‌ రెడ్డే!

`తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడు వ్యతిరేకించలేదు.

`తెలుగుదేశంలో వుండి కూడా తెలంగాణ వాదం వినిపించారు.

`కేసిఆర్‌ తెలుగుదేశంలో వున్నప్పుడు జై తెలంగాణ అనలేదు.

`పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమానికి వచ్చారు.

`రేవంత్‌ రెడ్డి టిడిపిలో వున్నప్పుడే గళమెత్తారు.

`గవర్నర్‌ ప్రసంగం సమయంలో కాగితాలు లాగింది రేవంత్‌ రెడ్డే!

`గుంటూరులో గుంట జాగ అడిగితిమా?అని అడిగిన కేసిఆర్‌ ఆంద్రులు ఆక్రమించుకున్న భూముల చెర విడిపించలేదు.

`ఆంద్రా వ్యాపారులకు లక్షల ఎకరాలు దారా దత్తం చేశాడు.

`అని అధికారంలోకి వచ్చి ఆంద్రులకు కొమ్ము కాసింది కేసిఆర్‌.

`తెలంగాణ ఆస్థులు కాపాడుతోంది రేవంత్‌.

`హైదరాబాద్‌ పరిసర భూములన్నీ ఆంద్రుల గుప్పిట్లో వున్నాయి.

`హైదరాబాద్‌ చుట్టూ వున్న చెరువులు మింగింది ఆంద్రా రియల్టర్లు.

`ఆంధ్రా రియల్టర్ల చెరలో వున్న చెరువులను రక్షిస్తోంది రేవంతే.

`హైదరాబాద్‌ కు పూర్వ వైభవం తెస్తున్నది రెవంతే.

`జై తెలంగాణ అన్నంత మాత్రాన ప్రేమ వున్నట్లు కాదు.

`తెలంగాణ స్వాభిమానాన్ని కాపాడేవారే అసలైన తెలంగాణ వాదులు.

`తెలంగాణ వాదులకు కేసిఆర్‌ చేసిందేమీ లేదు.

`పది నెలలో పది తరాలకు పనికి వచ్చే పనులు మెదలుపెట్టింది రేవంత్‌.

`ప్రజా క్షేత్రంలో ఇప్పుడు వ్యతిరేకత కనిపించొచ్చు.

`భవిష్యత్తు తరాలకు చెరువుల పునరుద్ధరణ ఎంతో మేలు.

`తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒరిగిన మేలేమీ లేదు.

`ఆంద్రుల దోపిడీ ఆగింది లేదు.

`ఇప్పుడే తెలంగాణ అస్తిత్వం కనిపిస్తోంది.

`అన్యాక్రాంతం చేసిన వారి బండారం బైటపడుతోంది.

`యువతకు ఉద్యోగాలొస్తున్నాయి.

`పదేళ్లలో అందని ఉద్యోగాలు పది నెలల్లో అందుతున్నాయి.

`ప్రభుత్వం స్కూళ్లు బాగుపడుతున్నాయి.

`కార్పొరేట్‌ కాలేజీల బండారం బైట పడుతోంది.

`పేద ప్రజలకు అందుబాటులో విద్య అందేందుకు మార్గాలు పడుతున్నాయి.

`స్కిల్‌ డెవలప్మెంట్‌ యూనివర్సిటీ వచ్చింది.

తెలంగాణకు నిజమైన రక్షకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. తెలంగాణ అసలైన సంరక్షకుడు సిఎం. రేవంత్‌ రెడ్డే. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఇదే సత్యం. ఇదే నిత్యం. కాని అసలు నిజాల్లోకి వెళ్లకుండా పైపైన జరిగే ఆరోపణలు ముందుపెట్టి తెలంగాణకు ఏదో జరుగుతోంది? హైదరాబాద్‌ బ్రాండ్‌ విరిగిపోతోందిన కొందరు గగ్గోలు పెడుతున్నాడు. బ్రాండ్‌ అంటూ లేనిపోని లెక్కలు చెప్పి, కనిపించని కధలు అల్లి ఇంత కాలం తెలంగాణ ప్రజలకు అరుచేతిలో వైకుంఠం చూపించిన వారున్నారు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజాన్ని చూపిస్తున్నారు. వాస్తవాలను కళ్లకట్టినట్లు చూపిస్తున్నారు. హైదరాబాద్‌ అంటే తెలంగాణకు గుండెకాయి. హైదరాబాద్‌ చుట్టూ పరిసర ప్రాంతాలు తెలంగాణకు ఆయువుపట్టు. మరి అలాంటి ప్రాంతాలు ఇప్పుడు ఎవరి చేతుల్లో వున్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ఎవరు పాగా వేసుకొని వున్నారు. రియల్‌ వ్యాపారం ముసుగులో ఎవరున్నారన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆస్ధులు పెరిగాయా? లేక ఆంధ్రుల ఆస్ధుల లెక్కలేనన్ని రెట్లు పెరిగాయా ? అన్నది కళ్లముందు కనిపిస్తూనే వున్నాయి. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ధాలుగా ఎంత మంది వచ్చారో..తెలంగాణ వచ్చిన పదేళ్లలో అంతకు నాలుగు రెట్ల మంది సీమాంధ్ర వ్యాపారులు హైదరాబాద్‌ను ముంచెత్తారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలన్నీ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రజల కాలుకు ముల్లు గుచ్చుకున్నా పంటితో తీస్తానని చెప్పిన గత పాలకులు, నిజంగానే వారికి గొడుగు పట్టారు. తెలంగాణ ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో విలువైన భూములన్నీ ఆంద్రా వ్యాపారులకు దారా దత్తం చేసి, తెలంగాణ ప్రజలకు కనీసం ఆవాసాలకు కూడా చోటు లేకుండాచేశారు. ఐటి పేరుతో, ఫార్మా పేరుతో, రియల్‌ వ్యాపారం ముసుగులో కొన్ని లక్షల ఎకరాలు భూమిని ఆంధ్రా వ్యాపారులకు అప్పగించారు. అడ్డికి పావుసేరుకు ప్రభుత్వ స్ధలాలను అంటగట్టారు. ఐటి పెరిగింది. సరే అందులో ఎంత మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయి? అన్నది ఎవరూ చెప్పరు. ఎవరికి స్కిల్‌ వుంటే వారికి ఉద్యోగాలు వస్తాయన్న లాజిక్‌ చెప్పే ముందు ఇతర రాష్ట్రాల యువతకు ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ యువతకు ఎందుకు రావడం లేదన్న సోయి గత పాలకులకు పట్టలేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో వున్న ఉపాది అవకాశాలు తెలంగాణ యువతకే ఎక్కువగా అందాలన్న లక్ష్యంతో స్కిల్‌ డెవలప్‌ మెంటు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వేలాది పుస్తకాలు చదవినా అని గొప్పలు చెప్పుకున్న గత కీలక పాలకుడుకి ఈ విషయం తెలియకుండాపోయిందా? అమెరికాల ఉద్యోగం చేశారు. వివిధ దేశాలు తిరగాను. పెట్టుబడులు ఆకర్షించాను అని చెప్పిన మరో కీలక నాయకుడికి తెలంగాణ యవతలో నైపుణ్యాలు పెంచాలన్న సోయి రాలేదా? తెలంగాణ భూములను ఇచ్చి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా వుంటే తెలంగాణకు ఏం ప్రయోజనం. తెలంగాణ వచ్చి ఏం లాభం? ఈ మాత్రం ఆలోచన లేకుండా ఏదో చేశాం..హైదరాబాద్‌లో బిల్డింగులు కట్టామని చెప్పుకుంటే అందులో తెలంగాణ ప్రజలుంటున్నారా? అన్నది ముఖ్యం. తెలంగాణ యువత చదువుకున్నా ఉపాది అందక, కూలీలుగా మారి బిల్డింగుల్లో పనిచేస్తే అందులో ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరు? ఇతర రాష్ట్రాల యువతకు ఎందుకు నైపుణ్యాలు ఎక్కువగా వున్నాయి? మన విద్యావిధానంలో ఎక్కడ లోపం జరగుతోందని తెలుసుకోలేని వాళ్లకు పాలకులయ్యే అర్హత లేదు. మేం గొప్పగా చేశామని చెప్పుకునే హక్కు అసలే లేదు. తెలంగాణ విద్యా వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేసి, కేజీటు పీజీ అంటూ లేనిపోని మాటలు చెప్పి, ఆఖరుకు సర్కారు విద్యను పేదలకు అందని ద్రాక్ష చేసిన దౌర్భాగ్యులు ఎవరు? కాని ప్రజా ప్రభుత్వం అదే పేద ప్రజలందరికీ ప్రభుత్వ విద్య మరింత అందుబాటులోకి రావడానికి ఐదు వేల కోట్ల రూపాయాలతో అధునాతమైన అన్ని హంగులతో కూడిన స్కూళ్లు నిర్మాణం చేస్తోంది. భవిష్యత్తులో పేద ప్రజలు ప్రైవేటు విద్యా దాహానికి బలి కాకుండాచూస్తున్నారు. పదేళ్ల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్ధను అట్టడుగు స్ధాయికి దిగజార్చి, ఒక్క ఉపాద్యాయ పోస్టు కూడ భర్తీ చేయలేదు. కాని పదినెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉపాద్యాయ నియామాకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్షలు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఫలితాలు విడుదల చేశారు. స్వయంగా ఆయన చేతుల మీదుగా ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. ఇదీ రాష్ట్రం మీద విజన్‌ వున్న నాయకుడు చేయాల్సిన పని. కాని పదేళ్లలో ఒక్కనాడైనా ఒక్క నియామకపత్రాన్నైనా గత పాలకులు అందించిన సందర్భం వుందా? గతంలొ ఇచ్చిన నోటిఫికేషన్లు ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారంటూ గత పాలక పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం సిగ్గు చేటు. పదేళ్ల తెలంగాణ ప్రజలు పాలించమని అవకాశమిస్తే నిరుద్యోగుల సమస్య కనిపించలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఆలోచించలేదు. యువత ఎన్నిసార్లు రోడ్డెక్కినా కనికరించలేదు. ఖాళీలు పెరుగుతున్నా పూరించలేదు. కాని ఇక ఓడిపోయే ప్రమాదముందని గమనించి ఆఖరు క్షణంలో నోటిఫికేషన్లు ఇచ్చి, మరోసారి నమ్మించి మోసం చేయాలని గత పాలకులు చూశారు. అందుకే నిరుద్యోగులు వారిని నమ్మలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బలంగా నమ్మారు. అధికారం అందించారు. ఆ కృతజ్ఞతను సిఎం. రేవంత్‌ రెడ్డి తీర్చుకుంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పదేళ్లపాటు నిరుద్యోగుల ఉసురుపోసుకొని, ఇప్పుడు మొసలి కన్నీళ్లు గత పాలక నాయకులు కారిస్తే తెలంగాణ యువత నమ్మడానికి సిద్దంగా లేరు. పొరపాటును మరోసారి అవకాశం కల్పించి వుంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మరోసారి మోసం చేసేవారు. పైగా పరీక్షల పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నారన్న అపవాదులు గత పాలకుల మీద అనేకం వున్నాయి. సింగరేణి ఉద్యోగాల విషయంలో ఒకే ఇంటిపేరుతో వున్న ఎంతోమందికి ఉద్యోగాలుఎలా వచ్చాయని ఎంత మంది ప్రశ్నించినా స్పందించలేదు. అసలైన నిరుద్యోగులకు న్యాయం జరగలేదు. గ్రూప్‌ టూ పరిక్షల్లో నిజామాబాద్‌లో ఒకే సెంటర్‌కు చెందిన వారికి ఉద్యోగాలు వచ్చాయని అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ఎందుకొచ్చాయన్నది ప్రపంచానికి తెలుసు. అందుకు నిరుద్యోగులు గత పాలకులకు కర్రు కాల్చి వాత పెట్టారు. అయినా వారి మాటల్లో డొల్ల తనం ఇంకా పోవడం లేదు. గ్రూప్‌ వన్‌ పరీక్షను మూడుసార్లు నిర్వహించి అనేక పొరపాట్లు చేశారు. పేపర్‌ లీకేజీలు చేశారన్న అపవాదులు ఎదుర్కొన్నారు. కాని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించారు. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజాయితీకి నిదర్శనం. అటు తెలంగాణ చెరువులు రక్షిస్తున్నాడు. చెరువులు ఆక్రమించకున్నవారి తాట తీస్తున్నారు. అటు చెరువుల పరిరక్షణ, ఇటు ప్రభుత్వ భూముల రక్షణను ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. ప్రకృతి విద్వంసాన్ని అరికడుతున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేవారి గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తిసున్నారు. హైదరాబాద్‌ వాసులకు ప్రకృతి సంపదను తిరిగి వరప్రసాదంగా అందిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే అసలైన తెలంగాణ వాది అని చెప్పకతప్పదు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేయలేదన్నది తప్పు. కాని ఆయన అప్పుడు తెలుగుదేశంలో వున్నప్పటికీ తెలంగాణ వాదాన్ని బలంగానే వినిపించారు. సహజంగా ఒక రాజకీయ పార్టీలో వున్నప్పుడు ఆ పార్టీ లైన్‌ దాటకుండా రాజకీయం చేయాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్‌కు ఆ అవసరం లేదు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ ఏర్పాటైందే తెలంగాణ పేరు మీద. అలాంటప్పుడు తాము మాత్రమే తెలంగాణ వాదులమని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. తెలంగాణలోని సకలు జనులు చేసిన ఉద్యమం, పోరాటంతోనే తెలంగాణ వచ్చింది.. అందులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా వున్నారు. ఇప్పుడు అసలైన తెలంగాణ వాదిగా తెలంగాణ హక్కులను పరిరక్షిస్తున్నాడు. తెలంగాణ ఆస్ధులను కాపాడుతున్నాడు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడు. ఇదీ అసలైన తెలంగాణ వాదం. విధానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *