`తెలంగాణ గడ్డ మీద మహిళా కెరటం కొండా సురేఖ!
`మహిళా చైతన్య నినాదం కొండా
`ప్రశ్నించే సమాజానికి గొంతుక కొండా
`అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన మేరు పర్వతం కొండా
`తెలంగాణ రాజకీయాలను కొన్నేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్న రాజకీయం కొండా
`బీసీ బిడ్డ మీద ఓసిల కక్ష!
`ఒకప్పుడు వరంగల్ అంటే కొండా!
`కొండా అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్
`ఆదిపత్య రాజకీయాలు కొండాకు కొత్త కాదు
`కొండాకు తెలియని రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు కాదు
`నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన కుటుంబం కొండా
`అనుచరుల కోసం ఎంత దూరమైనా వెళ్లే సాహసం కొండా
`పేద ప్రజల కోసం జీవితాంతం త్యాగం కొండా
`పదవులు కొండా ముందు పూచిక పుల్లలు
`కష్టాలకు ఏనాడు వెరవలేదు, నిర్భందాలకు ఎప్పుడూ వెరవలేదు
`ఎదురించి నిలబడిన పోరాటం కొండా
`నమ్మిన పార్టీలను నిలబెట్టిన కొండంత ధైర్యం కొండా
`దిగజారుడు రాజకీయాలపై సింహ స్వప్నం కొండా
`వ్యక్తులకైనా, వ్యవస్థకైనా అండగా నిలవడమంటేనే కొండా
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉమ్మడి వరంగల్ రాజకీయాలకు కొండా కుటుంబం కొండంత అండ. ఆ కుటుంబం ఏ పార్టీతో వున్నా ఆ పార్టీకి కట్టుబడి పనిచేయడం వారి నైతికత. తిరుగుబాటు రాజకీయాలకు పెట్టింది పేరు. పేదల కోసం వారి త్యాగం ఇంటిపేరు. మూడున్నర దశాబ్ధాలుగా ఆ కుటుంబం పేద ప్రజల కోసం కట్టుబడి సేవలందిస్తున్నారు. నమ్ముకున్నవారి కోసం జీవితాలను త్యాగం చేస్తూ వస్తున్నారు. నిత్యం ఒడిదొడుకుల రాజకీయాలలో అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ప్రజల కోసం నిలబడుతున్నారు. వారు తయారు చేసిన ఎంతో మంది రాజకీయ జీవితాల్లో స్ధిరపడిన వారున్నారు. ఉన్నతమైన స్దానాలలో పదవులు పొందిన వారున్నారు. తమ అనుచరులకోసం ఎంత దూరమైనా వెళ్లే అంకితభావం వున్న కుటుంబం కొండాది. వారి రాజకీయం ముందు ఇప్పుడున్న ఏ నాయకుడైనా దిగదుడుపే అని చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ఇంత కాలం శాసించిన కుటుంబం మరొకటి లేదు. అయినా వారి మీద ఎప్పుడూ ఏదో రకమైన కక్షపూరిత రాజకీయాలు చేయాలని చూసిన వారు కనుమరుగైపోయారే గాని వాళ్ల రాజకీయం ఎప్పుడూ ఓడిపోలేదు. పరిస్ధితులు అనుకూలించక కొన్ని సార్లు ఓడిపోయినా వ్యక్తిగత రాజకీయాల్లో వారికి ఎప్పుడూ ఓటమి లేదు. ప్రజల్లో వారికి ఎప్పుడూ వ్యతిరేకత రాలేదు. పదవుల కోసం కొండా కుటుంబం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. పదవులే వారిని వరించుకుంటూ వచ్చాయి. పదవులు కోసం ఎవరి ముందు అర్రులు చాచలేదు. వారి ప్రజా సేవకు పార్టీలే పిలిచి పెద్ద పీఠ వేశాయే గాని, పైరవీలతో పదువులు పొందిన చరిత్ర కొండా కుటుంబానికి లేదు. నమ్మిన సిద్దాంతం కోసం పదవులను తుణ ప్రాయంగా వదిలేసిన చరిత్ర కొండా దంపతులది. పదవులు పట్టుకొని వేళాడిన చిరత్ర ఆ కుటుంబం వ్యతిరేకులది. అయితే ఆ కుటంబం రాజకీయాల్లో ఓడిపోలేదు. కాని సొంత పార్టీలలోనే కొంత మంది వారిని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేయాలని ప్రతిసారి చూస్తూనే వున్నారు. వారిని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తూనే వున్నారు. ఈ తంతు ఇప్పుడు సాగుతున్నది కాదు. కొండా కుటుంబానికి ఎత్తు పల్లాలు కొత్తవి కాదు. రాజకీయాల్లోకి వచ్చిన నిమిషం నుంచి, ప్రతి క్షణం కాలంతో పోరాటం చేస్తూనే వున్నారు. తమ వ్యతిరేకులపై పై చేయి సాధిస్తూనే వున్నారు. ఎప్పటికైనా కొండా కుటుంబం మీద ఆధిపత్యం చేయాలని చూసిన వారు రాజకీయంగా తెరమరుగైన వాళ్లే కాని, ఇప్పటి వరకు కొండా కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేసిన వాళ్లు లేదు. అదీ వారికి ప్రజలతో వున్న అనుబంధం. ప్రజలకు కొండా కుటుంబం మీద వున్న బలమైన నమ్మకం. ఈ రెండిరటి మధ్య ఎవరొచ్చినా రాజకీయంగా కాలగర్భంలో కలిసిన వారే కాని, కొండా కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేసిన వారు ఎవరూ లేరు. కొండా కుటుంబాన్ని ఎన్ని రకాలుగా రాజకీయాలకు దూరం చేయాలని చూసినా, ప్రతిసారి అంతే వేగంగా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. రాజకీయాలను ఏలుతూ వస్తున్నారు. మంత్రి కొండా సురేఖ అంటేనే ఒక బ్రాండ్. కేవలం వరంగల్ జిల్లా రాజకీయాలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆ కుటుంబానికి ఒక పేరుంది. కొండా సురేఖ తెలియని ప్రాంతం లేదు. కొండా కుటుంబానికి అభిమానులు లేని జిల్లా లేదు. అంతే కాదు ఏపిలో కూడా కొండా కుటుంబం అప్పటికీ ఎంతో అభిమానించే వాళ్లు కొన్ని లక్షల్లో వున్నారు. రాష్ట్రం విడిపోయినా సరే ఆమె ఏపికి వెళ్తే వేలాది మంది పోగౌతుంటారు. వారి అభిమానాన్ని తెలియజేస్తుంటారు. అయితే ఇక్కడ కొండా కుటుంబం అంటేనే త్యాగానికి పేరు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ జీవితాన్ని నిలబెట్టిన రాజశేఖరెడ్డి కుటుంబం అంటే ఆమెకు ఎనలేని ప్రేమ వుండేది. నమ్మిన సిద్దాంతం కోసం, అండగా నిలిచిన రాజశేఖరరెడ్డి కుటంబం కోసం ఆమె చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. తన రాజకీయ జీవతం గురించి ఏనాడు ఆమె ఆలోచించలేదు. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొండా సురేఖ మంత్రి అయ్యారు. రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకభూమిక పోషించారు. అయితే రాజశేఖరరెడ్డి మరణించడం కొండా సురేఖతో తనపదవికి రాజీనామా చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఆమె తన పదవినే వదులుకున్నారు. కాని రాజశేఖరెడ్డి చలువతో రాజకీయాలు చేసిన ఎంతో మంది ఆ కుటుంబానికి దూరమయ్యారు. జగన్‌ను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తెలియడంతో దూరమయ్యారు. కాని కొండా సురేఖ మాత్రం మళ్లీ పదవి తీసుకోలేదు. తర్వాత జగన్ కోసం రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన ఘనత కొండా సురేఖకుమాత్రమే దక్కుతుంది. కాని ఆయన ఆ కృతజ్ఞత మర్చిపోయారు. కొండా మురళికి అన్యాయంచేశారు. ఒక దశలో తెలంగాణ అంతా కొండా కుటుంబంపై పగబట్టినంత పనిచేసినా, నమ్మితే ప్రాణమిచ్చే అంకితభావం తమ సొంతమని నిరూపించారు. తెలంగాణ వాదుల చేత అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడు వాళ్లు చలించలేదు. చంచల స్వభావం చూపించలేదు. అది వారి గొప్పదనం. అలాంటి నాయకులు దేశం మొత్తం వెతికినా ఒక్కరు కూడా కనిపించరు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలన్నీ అవకాశ వాద రాజకీయాలే..కాని తమ రాజకీయ జీవితంలో ఏనాడు కొండా దంపతులు స్వార్ధపూరిత రాజకీయాలు చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ కూడా వారిని మోసం చేసింది. రెండోసారి కొండా సురేఖకుటికెట్ ఇవ్వలేదు. అయినా కొండా సురేఖ వెరవలేదు. మళ్లీ పడిలేచిన కెరటంలా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె మంత్రి కావడం ఇష్టం లేని కొంత మంది వరంగల్ జిల్లాకు చెందిన నాయకులు ఏదో వివాదం సృష్టించాలని చూస్తూనే వున్నారు. అడుగడుగునా కొండా సురేఖను విమర్శల పాలు చేయాలని చూస్తున్నారు. ఆమె మంత్రి అయిన నుంచే ఆమె పదవి రావడం గిట్టని వారు కాంగ్రెస్‌లోనే వున్నారు. పరకాల వివాదంతో కొండా దంపతులపై రాజకీయాధిపత్యం చేయాలని చూశారు. అయినా తెలంగాణలోనే కాదు, ఏపిలో కూడా ఎంతో మంది అభిమానులు, అనుచరులున్న కొండా దంపతుల విలువ తెలియని వాళ్లు గిట్టని వేషాలు వేస్తున్నారు. మంత్రి కొండా సరేఖ ప్లెక్సీలు ఏర్పాటుచేస్తే వాటిని చించేసి రాజకీయం చేయాలని చూశారు. కాని అయినా వారి చిల్లర చేష్టలు చెల్లలేదు. ఇక ఇటీవల మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలిసి, కొంత మంది కొండా సురేఖ మంత్రి వర్గం నుంచి తొలగిస్తారంటూ రకరకాల వార్తలు రాయిస్తున్నారు. గతంలోనే మంత్రి పదవిని పూచిక పుల్లతో వదులుకున్న కొండా సురేఖ ఇప్పుడు భయపడుతుందని అనుకుంటే పొరపాటు. అయినా తెలంగాణలో బిసిలలో ముప్పై ఏళ్లుగా చైతన్యం నింపుతున్న కుటుంబం కొండాది. అలాంటి కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేయడం అంటే కొరివితో తలగోక్కున్నట్లే. కొండా మురళీదర్‌రావు తెలంగాణ బిసిలలో అతి పెద్ద సామాజికవర్గమైన మున్నూరు కాపు. తెలంగాణలో మరో బలమైన సామాజిక వర్గం పద్మశాలి అడబిడ్డ కొండా సురేఖ. ఇలా రెండు సామాజిక వర్గాలు కలిసిన కుటుంబం కొండాది. ఓసిలు కొంత మంది తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పుడు కొండా సురేఖపై ఎలాంటి రాజకీయాలు చేయాలని చూసినా అది వారి రాజకీయ సమాదికే దారి తీస్తుంది. కొండా సురేఖ మీద లేని పోని రాతలు రాయిస్తూ తమ వెలికి రాజకీయాన్ని చూపించాలని చూసినా సాధ్యమయ్యేది కాదు. మంత్రులు కావాలని ఎవరైనా కోరుకోవచ్చు. కాని వారి వ్యక్తిగత రాజకీయాలతో పదవులు పొందాలి.లేదా ప్రజల్లో వారికున్న పరపతితో పదవులు పొందాలి. అంతే కాని పదవుల్లో వున్నవారిని పదవులపై పుల్లలు పెట్టి మంత్రులు కావాలంటే జరిగేది కాదు. కొండా సురేఖ మంత్రి పదవి పోయేది కాదు. రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా వున్న కొండా సురేఖ మంత్రి పదవికి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, తెలంగాణ ఈ రెండు సామాజిక వర్గాలలో అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మొదటికే మోసం వస్తుంది. అంతటి సాహసం కాంగ్రెస్ చేయదు. అయినా కొండా దంపతుల రాజకీయ శక్తి ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. నిన్న మొన్న రాజకీయాలు చేయడం తెలిసిన వారు కొండా దంపతుల రాజకీయాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అది తెలియక ఆధిపత్యం చేయాలనుకుంటున్నారు. అడ్రస్ లేకుండా పోవడానికి వాళ్లకు వాళ్లే దారులు వేసుకుంటున్నారు.