హైడ్రా అంటే అంత వణుకెందుకు!

https://epaper.netidhatri.com/view/411/netidhathri-e-paper-23rd-october-2024%09

`రియల్‌ వ్యాపారుల గుండెల్లో గుబులెందుకు!

`రూపాయికి కొని కోటికమ్ముకున్నారు.

`పైసాకు పనికి రాని వాళ్లు కోట్లకు పడగలెత్తారు.

`మాయ మాటలే పెట్టుబడి చేసుకున్నారు.

`అబద్దాలతో అందరానంత ఎత్తుల ఆశలు చూపారు.

`తిమ్మిని బమ్మిని చేసి అమాకులను బలి చేశారు.

`ప్రజలను నమ్మించి మోసం చేశారు.

`వంచించి భూములు అంటగట్టారు.

`ఆశలు చూపించి అన్యాయం చేశారు.

`ప్రజల బలహీనతలతో ఆడుకున్నారు.

`పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ముకు రెక్కలు తొడిగేలా చేశారు.

`వాళ్ల చేతుల్లో నుంచి ఎగిరి మీ ఖాతాలో పడేలా చేసుకున్నారు.

`ఇప్పుడు రియల్‌ ఢమాలౌతోందని గుండెలు బాదుకుంటున్నారు.

`చెరువులను చెరపట్టిన నాడు తెలియదా!

`కుంటలు పూడ్చిన నాడు గుర్తుకు లేదా!

`నాళాల ఆనవాలు చేసినప్పుడు కనిపించలేదా!

`ఎకరాలు వేలకు కొన్నారు.

`కోట్లలో బేరాలు చేశారు.

`అప్పనంగా భూములు కబ్జాలు పెట్టారు.

`ప్రభుత్వ భూములు మాయం చేశారు.

`మట్టి ముట్టుకుంటే బంగారమౌతుందన్నారు.

`ప్లాట్లే బంగారు బాతుగుడ్లన్నారు.

`జనం చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశారు.

`జనం నెత్తిన చెయ్యి పెట్టి వాయిదాల పేరుతో కోట్లు వసూలు చేశారు.

`సక్రమం కాని భూములు చూపించి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారు.

`వ్యాపారం పేరుతో కోట్ల కొద్ది రుణాలు తీసుకున్నారు.

`రియల్‌ పేరుతో విలాసవంతమైన జీవితాలు అనుభవించారు.

`హైడ్రా రాకతో మొసలి కన్నీరు కారుస్తున్నారు.

`తిన్నది కక్కాల్సి రావడంతో లబోదిబో మంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అమ్ముకోవడానికి అలవాటు పడ్డవారు ఆగలేరు. కొనుక్కునే శక్తి వున్నవారిని ఎవరూ ఆపలేరు. కాని అమ్మకాలు ఆగిపోయాయంటూ గగ్గోలు పెట్టినంత మాత్రాన నిజం అబద్దంకాదు. అబద్దాలు వాస్తవాలు కావు. తెలంగాణలో రియలెస్టేట్‌ పడిపోయిందా? ఇలాంటి మాటలు చెప్ప, తెలంగాణ ఎకానమిలో గందరగోళం సృష్టిస్తే సరిపోతుందా? తెలంగాణలో ఎక్కడా రియల్‌ వ్యాపారం ఆగిపోలేదు. కాని తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది. రియల్‌ వ్యాపారులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మే కాలంపోయింది. రియల్‌ వ్యాపారుల మాటలకు మోసపోయ అవకాశం లేకుండాపోయింది. వాళ్లుచెప్పిందే విని కొనుగోలు చేయడం ఆగిపోయింది. కాకపోతే తెలంగాణలో రియల్‌ మోసపు వ్యాపారం చేసేవారికి ఎదురుదెబ్బ తగిలింది. తగాల్సిందే. లేకపోతే తెలంగాణలో సామాన్యులకు గుంట స్ధలం కూడా అందుబాటులో లేకుండాపోయింది. కనీసం నివాసానికి వంద గజాలు కొనుగోలు చేసుకునే పరిస్ధితి లేకుండాపోయింది. ఒక రకంగా బాదపడాల్సివస్తే తెలంగాణలో సామాన్యులు కలత చెందాలి. తమకు ఎందుకంటే తమ స్ధొమతకు వంద గజాలు కొనుగోలు చేసుకునే పరిస్టితి లేకుండాపోయిందని బాధపడాలి. అంతే కాని రియల్‌ వ్యాపారులకు ఉలుకెందుకు ? గుబులెందుకు? గుండెల్లో బుల్లోజర్లు పరిగెత్తుడం ఎందుకు? రియల్‌ వ్యాపారానికి తెరతీసిన వాళ్లలో తెలంగాణ వాళ్లు కేవలం పది శాతం కూడా లేరు. తెలంగాణలో రియల్‌ వ్యాపారం చేసిన వారంతా ఆంధ్రాకు చెందిన నాయకులు, వారి అనుచరలు, వ్యాపారులు మాత్రమే చేశారు. ఒక్క హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలే కాదు, ఆదిలాబాద్‌ వరకు వెళ్లికూడా రియల్‌ వ్యాపారం చేసిన వారిలో ఎక్కువ శాతం ఆంద్రా వ్యాపారులే. తెలంగాణలో హైడ్రా వల్ల బాధపడుతున్నదంతా ఆంద్రా వ్యాపారులే. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో చెరువులు ఆక్రమణలు చేసింది ఆంద్రాకు చెందిన వ్యాపారులే. అక్కడ కొనుగోలు చేసిన వాళ్లు ఆంధ్రాకు చెందిన వాళ్లే. అంతే తప్ప రియల్‌ వ్యాపారం విస్తరించిన తర్వాత హైదరాబాద్‌ చుట్టుపక్కల స్ధలాలు గాని, భూములు కాని కొనుగోలు చేసిన వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు పడికెడు మంది కూడా లేరు. సినీ రంగానికి చెందని వాళ్లెంతో మంది హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. వేలల్లో ఎకరాలకొద్ది భూములు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటి విలువ కోట్ల చేర్చుకున్నారు. భహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు విచ్చలవిడిగా పెంచింది వ్యాపారులే. అలాంటి వాళ్లు ఇప్పుడు తమ భూముల అమ్మకాలు తగ్గిపోవడం, వారు వేసిన వెంచర్లు ఆగిపోవడం, చేపట్టిన నిర్మాణాలు దుమ్ము పట్టిపోతుంటే కలత చెందుతున్నారు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం కోకాపేటలో ఎకరం భూమి ఇరవై వేలు. కాని ఇప్పుడు ఎకరం వంద కోట్లు. ఎన్ని రెట్లు పెంచేశారు. కోకాపేట లాంటి ప్రాంతంలో స్ధానికులైన వారు కంటికి కూడా కనిపించకుండాపోయారు. ధరలొస్తున్నాయి కదా? అని అక్కడ కొంత లాభానికి కొనుగోలు చేసి దూరం వెళ్లిపోయారు. ఆ భూముల్లో వ్యాపారం చేసి వేలల్లో కొన్న భూములను కొట్లకు అమ్ముకుంటున్నారు. ఇంకా దిగులు చెందుతున్నట్లు రియల్‌ వ్యాపారులు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. పసాకు కూడా పనికి రాని వాళ్లంతా కోట్లకు పడగలెత్తారు. చదువుకున్న వాళ్లంతా ఉద్యోగాల కోసం పాకులాడుతుంటే, ఏ చదవు లేని వాళ్లంతా రియల్‌ వ్యాపారం చేశారు. ఇదర్‌కా మాల్‌ ఉదర్‌, ఉదర్‌ కా మాల్‌ ఇదర్‌ అన్నట్లు చేసి వ్యాపారంలో ఆరితేరిపోయారు. మాయ మాటలే పెట్టుబడిగా మార్చుకున్నారు. మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలు నిండా ముంచారు. ఉమ్మడి రాష్ట్రంలోని నాయకులు ఒత్తిళ్ల మేరకు అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. చెరువుల్లో భూములున్నా పనికి రాకుండాపోతున్నాయని దిగులుతో రైతులు వాటిని అమ్ముకున్నారు. ఒకనాడు ఎకరాల కొద్ది భూములు చేతిలో వున్న రైతులు నేడు చేతిలో చిల్లి గవ్వలేకుండా చేసుకున్నారు. చిల్లిగవ్వకు కూడా పనికి రాని వాళ్లు రియల్‌ వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తారు. చెరువుల్లో ఎఫ్‌టిఎల్‌ పరిధిలో వున్న భూములను అమ్ముకోరాదు? కొనుగోలు చేయరాదు? అన్న సంగతి అధికారులకు ఆనాడు తెలుసు. ఇప్పుడు తెలుసు. ఆ భూములు కేవలం వ్యయసాయం కోసం మాత్రమే వినియోగించాలని అధికారులకు తెలియందికాదు. కాని సాగు పేరుతో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేసుకొని, అదికారుల మీద ఒత్తిడి చేసి, వారి కక్కుర్తిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున లంచాలు ముట్టజెప్పి హైదరాబాద్‌ చుట్టూ వున్న చెరువులన్నీచెరపట్టారు. చెరువుల ఆనవాలు లేకుండా చేశారు. అది ఇక పరాకాష్టకు చెరుకున్న దశలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రాను తెచ్చారు. దాంతో రియల్‌ వ్యాపారుల గుండెలు అదిరేలా చేశారు. ఒకప్పుడు చెరువులను ఆక్రమించి భూముల్లో ప్లాట్లు చేసి అమ్మారు. ఇప్పుడు చెరువులను పూడ్చి హైరేజ్‌ బిల్డింగుల పేరుతో అంతస్ధుల మీద అంతస్థులు నిర్మాణం చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. చెరువుల పక్కనే పెద్ద పెద్ద అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తున్నారు. చెరువు పక్కనే ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుందని ప్రజలను నమ్మించి లక్షల్లో అమ్మకాలను కోట్లలోకి మార్చారు. హైరదాబాద్‌ నగరంలో హైరేజ్‌ బిల్డింగులను పెద్దఎత్తున నిర్మాణాలుచేసి కోట్లకు అమ్ముతున్నారు. జనం కూడా ఎగబడి కొన్నారు. కాని చెరువుల్లోనే ఆ బిల్డింగులు కట్టారని ప్రజలు తెలుసుకోలేకపోయారు. వ్యాపారులు చెప్పకుండా దాచేశారు. వారికి అధికారులు అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారు. అమాయకులైన ప్రజలు వాటిని గుడ్డిగా నమ్మి మోసపోయారు. ఇకపై అలాంటి మాయ మాటలు చెప్పి వ్యాపారాలు చేసే అవకాశం లేకపోవడంతో రియల్‌ వ్యాపారులు హైడ్రాను తప్పు పడుతున్నారు. తాము అన్యాయమైపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. రియల్‌ వ్యాపారం మందగించిందని లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారు. ప్రజలకు అవసరం లేకున్నా అత్యాశలు చూపించి భూములు అమ్ముకున్న నాడు తాము మోసం చేస్తున్నామని రియల్‌ వ్యాపారులకు తెలియదా? ఒక జీవిత కాలంలో సంపాదించే సంపాదనను కొన్నితరాలు కూర్చున్నా తరగనంత సంపాదించామన్న విషయాలు తెలియకనా? ఇంకా మోసం చేయడానికి అవకాశం లేకపోవడంతో రియల్‌ వ్యాపారులు ఆగమౌతున్నారు. లేని పోని అబద్దాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఒక రకంగా బాదపడాల్సివస్తే సామాన్యులు బాధపడాలి. రియల్‌ వ్యాపారుల మాయ మాటలు నిమ్మి మోసపోయిన వాళ్లు బాధపడాలి. అందుకే ప్రజలను వంచించి చెరువుల్లో భూములు అంటగట్టిన రియల్‌ వ్యాపారుల నుంచి వసూలు చేసి బాధితులకు అందించాలి. అప్పుడే రియల్‌ వ్యాపారాల్లో మోసాలు జరగవు. తాము కొనుగోలు చేసిన చిక్కులు లేని భూముల్లో కొంత లాభానికి భూముల వ్యాపారం చేయాల్సిందిపోయి బంగారు బాతును ఒక్కసారి కోసుకు తిన్నట్లు ఇరవై ఏళ్లలో వందల ఏళ్ల సంపాదన కూడబెట్టుకున్నారు. తరతరాలకు సరిపడ ఆస్దులు కూడబెట్టుకున్నారు. ఇంకా రియల్‌ వ్యాపారులు చేతుల్లో వేల ఎకరాల భూములున్నాయి. వాటిని అడ్డికి పావుసేరు అమ్ముకున్నా రూపాయి లాస్‌ కూడా కాదు. ఇదిలా వుంటే ఏ రియల్‌ వ్యాపారి తన సొంత సొమ్ములతో వ్యాపారం చేయలేదు. పెద్దఎత్తున బ్యాంకుల ద్వారా కోట్లలో రుణాలు తీసుకున్నారు. ఎక్కడ వాటిని చ చెల్లించాల్సి వస్తుందో అన్న అనుమానంతో అన్యాయమైపోతున్నామని అంటున్నారు. బ్యాంకులకు ఎగనామం పెట్టేందుకు ఎదురుచూస్తున్నారు. తాము నిర్మాణం చేసిన బిల్డింగులు అమ్మకాలు సాగడం లేదని సాకులు చెబుతున్నారు. రియల్‌ వ్యాపారం డమాల్‌ అయ్యిందని గుండెలు బాదుకుంటున్నారు. ఎక్కడ తిన్నది కక్కాల్సివస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకంటే ఏమీ లేదు. రియల్‌ వ్యాపారుల నాటకాల్లో నిజం లేదు. భూమలు అమ్మినాడు అబద్దాలే చెప్పారు. ఇప్పుడు అవే అబద్దాలతో తప్పించుకోవాలని చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!