చంద్రహృదయం…వెలుగు కిరణం!

 -మిత్రధర్మంలో కర్ణుడు…మిత్ర భేదంలో కృష్ణుడు.

-ఎలాంటి పాత్రలోనైనా ఇమడగలడు.

-ప్రజల కోణంలో ఆయన ఎటు వైపైనా అడుగులేయగలడు.

-ఎంతటి వారినైనా చెడుగుడు ఆడేయగలడు.

-విభేదించిన వాళ్లతో జతకట్టగలడు.

-వాళ్లను తన దరికి తెచ్చుకోగలడు.

-గెలిచిన ప్రతిసారీ మిత్రపక్షాలకు బలం పెంచగలడు.

-భేదాలొస్తే వాటి బలం లాగేయగలడు.

-రాజకీయంగా వాలిని మించిన బలవంతుడు.

-ఇతర పార్టీ బలం తనవైపు తిప్పుకోలడు.

-తన యుక్తితో ఇతర పార్టీలకు జీవం పోయగలడు.

-తన రాజకీయ శక్తిని పది మందికి పంచగలడు.

-తన నాయకత్వంలో లక్షలాది మంది నాయకులను తయారు చేశారు.

-విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి విదేశాలలో తెలుగు కీర్తి చాటారు.

-తెలుగు వాళ్ల ఆర్థిక మూలాలకు కారణమయ్యారు.

-కొన్ని లక్షల మంది తెలుగు వళ్లు విదేశీ వ్యాపార వేత్తలు కాగలిగారు.

-ఐటి రంగాన్ని శాసించే నిపుణులై ప్రపంచాన్నేలుతున్నారు.

-కోట్లాది గుండెల్లో చంద్రబాబు కొలువైవున్నారు.

-రేపటి తెలుగు నేలను నిలబెట్టే యజ్ఞం సాగిస్తున్నారు.

-అమరావతి నిర్మాణంతో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు.

-తరతరాలకు చెరగని కీర్తిని మూటగట్టుకున్నారు.

-తన శక్తియుక్తులు తెలిసిన హనుమంతుడు.

-చంద్రబాబు ఆలోచనలు పద్మ వ్యూహాలు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో బలమైంది. చంద్రబాబు రాజకీయం ఎంతో బలీయమైంది. పడిలేచిన కెరటంలా ఆయన రాజకీయమే కాదు, తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కింది. అది ఎన్టీఆర్‌ కాలంలోనైనా, స్వయంగా చంద్రబాబు నాయకత్వంలోనైనా పార్టీని కంచుకోటగా మార్చడంతో చంద్రబాబు పాత్రే ముఖ్యమైంది. కీలకమైంది. పార్టీ ఓడిన ప్రతీసారి మరింత బలంగా తయారు చేశారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. వారికి అండగా నిలుస్తూ వచ్చారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వచ్చారు. పార్టీకి బలమైన పునాదలు పడేలా కృషిచేశారు. దేశంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న ఒడిదొడుకులు మరేపార్టీ ఎదుర్కొలేదేమో! పడిపోయిన ప్రతిసారి నిలబెట్టారు. తన రాజకీయం చాణక్యం ప్రదర్శించారు. ఇక్కడ చంద్రబాబు ప్రత్యేకత మరింత భిన్నమైంది. పార్టీ గెలిచినప్పుడు ఓటమి గురించి ఆలోచించలేదు. ఓడినప్పుడు మళ్లీ గెలుపు ఎలా అన్నదాని గురించి ఏనాడు దిగులు చెందలేదు. పోరాట యోధుడు అంటే చంద్రబాబులా వుంటాడన్నది చరిత్రకు సాక్ష్యంగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ ఓడినా,గెలిచినా ఆయన ప్రజల్లో వున్నారు. ప్రజల కోసం వున్నారు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా, పండుగలైనా, పబ్బాలైనా ప్రజలతోనే వున్నారు. పండగ సంబరాలుకూడా ప్రజలతోనే పంచుకున్నారు. ఇలాంటి నాయకుడు దేశ చరిత్రలోనే ఒక్క చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు. ప్రజలంటే చంద్రబాబుకు అంత ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. చంద్రబాబు నాయుడు మిత్రధర్మంలో కర్ణుడు.. మిత్ర భేదంలో కృష్ణుడనే చెప్పాలి. అంటే ఆయన ఎక్కడున్నా ధర్మం వైపు నిలుస్తారు. తెలుగు ప్రజలను గెలిపిస్తారు. ఇది ఇప్పటికి నాలుగు సార్లు జరిగింది. 

1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటి పరిస్ధితులు ఒక్కసారి గమనిస్తే ఆనాడు ఆయన కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు తెలుగుదేశంపార్టీ సజీవంగా వుండేది కాదు. 

గతంలో తెలుగుదేశం పార్టీ ఒకటి వుండేదని చెప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చేది. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లేకుండా తెలుగుదేశం పార్టీయే లేదని కూడా చెప్పాల్సిన అవసరం వుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో లేరు. కాంగ్రెస్‌లో మంత్రిగా వున్నారు. కాని 1983 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలిచి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తెలుగుదేశంలో చేరారు. కాని ఆనాటి నుంచి ఆయన తెలుగుదేశంపార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వందేళ్ల పునాదులు చంద్రబాబు నాయుడు వేశారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అదే అదునుగా అప్పటి తెలుగుదేశం నాయకుడు నాదేండ్ల భాస్కరరావు పార్టీని హస్తగతం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. నెల రోజుల పాలన సాగించారు. ఆ సమయంలో నాదేండ్ల నుంచి పార్టీని రక్షించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్‌ అమెరికా నుంచి తిరిగి వచ్చే సరికి పార్టీని మళ్లీ నిలబెట్టి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన ఘనత చంద్రబాబుదే. ఆనాడే చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యం ఎంత బలమైందో, బలీయమైందో అర్ధమైంది. అయితే అలా వచ్చిన అధికారం వద్దని మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరుదామన్న ఎన్టీఆర్‌ ఆలోచనను అమలు చేసి, ఎన్నికలకు వెళ్లారు. 1984లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని అఖండ మెజార్టీతో గెలిపించారు. నిజానికి రాజకీయాల్లో అప్పుడే చంద్రబాబు రాటు దేలారు. ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. పార్టీని పటిష్టం చేశారు. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ ఓడిపోయింది. అప్పుడు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని కాపాడిరది చంద్రబాబు నాయుడే. 

1994 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని మరింత బలపడేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అమోఘమైంది.

 కాకపోతే 1994 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే లక్ష్మిపార్వతి పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసింది. డిపాక్టో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూ వచ్చింది. తర్వాత తానే ముఖ్యమంత్రిని అనే కలలు కనేదాకా వెళ్లింది. ఇది పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందని ముందే గ్రహించిన చంద్రబాబు నాయుడు పార్టీని భవిష్యత్తు తరాలకు అందించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు ఆయన ఆ నిర్ణయం తీసుకోకుండావుంటే తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీని ఏనాడు మర్చిపోయేవారు. అలా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడమే కాకుండా, జాతీయ రాజకీయాలను కూడా తన కనుసన్నల్లో నడిపారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో కీలకభూమిక పోషించారు. తర్వాత కాలంలో ఎన్డీయే ఏర్పాటులోనూ కీలకపాత్ర పోషించారు. చాలా కాలం పాటు ఎన్టీయే కన్వీనర్‌గా పనిచేశారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ఆయన ప్రజలను వీడలేదు. ప్రజల కోసం ఆయన పోరాటం ఆపలేదు. అందుకే ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా, ఏపి ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కావాలని కోరుకున్నారు. 

2019లో చంద్రబాబును కాదనుకున్నా, మళ్లీ 2024లో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత రికార్డు మెజార్టీతో ఏపి ప్రజలు ఎన్నుకున్నారు.

 చంద్రబాబు నాయుడును మించిన నాయకుడు తెలుగు గడ్డమీద లేదని ప్రజలు నిరూపించారు. ఇక ఆయన రాజకీయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజల కోణంలో ఆయన ఎటు వైపైనా అడుగులు వేయగలరు అని అనేక సార్లు నిరూపించారు. తెలుగు ప్రజల సంక్షేమంకోసం ఆయన ఎవరితోనైనా పొత్తుతో సాగగలరు. ఎంతటి వారితోనైనా విబేధించగలరు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వున్నారు. ఆ సమయంలో గుజరాత్‌ అర్లర్లు నరేంద్ర మోడీ మీద తీవ్ర ప్రభావం చూపాయి. దేశమంతా నరేంద్ర మోడీని నిందించాయి. ఆ సందర్భంలో నరేంద్ర మోడీ హైదరాబాద్‌ వస్తున్నారని తెలిసినప్పుడు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేస్తామంటూ ప్రకటించి, సంచనలం సృష్టించారు. దాంతో ఆయన ఎంతటి వారినైనా ఎదిరింగల నేతగా గుర్తింపుపొందారు. అయితే అదే నరేంద్ర మోడీ కోసం ఎన్టీయే కూటమికి అండగా నిలిచారు. ఎన్టీయే కన్వీనర్‌గా మోడీ గెలుపుకోసం కృషి చేశారు. అదే తరుణంలో ఏపిలో అదికారంలోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఏపికి ఇచ్చిన హమీలు విస్మరించారన్న కోపంతో 2019లో మోడీకి వ్యతిరేకంగా వెళ్లారు. కకపోతే ఓడిపోయారు. అయినా మళ్లీ బిజేపి ఈ ఎన్నికల వేళ చంద్రబాబును కోరుకోవడంతో మళ్లీ మద్దతిచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిలబడానికి ఒకపిల్లర్‌గా వున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిలబడిరదంటే కేవలం చంద్రబాబు చలతోనే కావడంతో ఏపికి నిదుల వరద పారిస్తున్నారు. తన అమరావతి కల నెరవేర్చడమే కాకుండా, ఏపికి రాజధాని నిర్మాణాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు మొదటి రోజు నుంచే తన ప్రయత్నం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు రాజకీయం తెలియక దూరం చేసుకున్నవారు మళ్లీ ఆయన కోసం ఎదురు చూసిన వాళ్లే కావడం విశేషం. దేశంలో బిజేపిని ఆది నుంచి ఆదరిస్తున్న నాయకుల్లో చంద్రబాబు ముఖ్యమైన నాయకుడు. 1983, 1985, 1999,2014,2024లలో బిజేపికి అండగా నిలిచి, ఆపార్టీ బలోపేతానికి కారణమైన నాయకుడు చంద్రబాబు. ఇలా సమయాన్ని బట్టి, రాజకీయ అవసరాలను బట్టి ఆయన రాజకీయంలో వామపక్షాలను కూడా ఆదరించారు. వామపక్షాల మనుగడకు కూడా చంద్రబాబు సహకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!