బండికి పగ్గాలిస్తేనే బీజేపికి అధికారం!

`ఇంకెవ్వరికిచ్చిన మరింత దిగజారడం ఖాయం!

`తెలంగాణ బీజేపి శ్రేణుల మెజారిటీ అభిప్రాయం.

`తెలంగాణలో ఏ బీజేపి నాయకుడిని కదిలించినా ఒకటే మాట.

`బండి వస్తేనే మొదలౌతుంది ఆట.

`పోటీ పడుతున్న వాళ్లంతా వలసవాదులే!

`అవసరం కోసం బిజేపి గూటికి చేరిన వాళ్లే.

`రాజకీయ ప్రయోజనాలు తప్ప, పార్టీ ప్రయోజనాలు ఎవరికీ పట్టవు.

`బండిని దించిన తర్వాత పార్టీకి ఊపు తెచ్చిన నాయకుడు ఒక్కరు లేరు.

`బండి పెంచిన బలంతోనే బిజేపి సీట్లు గెలిచింది.

`బండి వున్నాడన్న నమ్మకంతోనే ప్రజలు ఓట్లేసి గెలిపించింది.

`ఈటెల వల్ల ఇటు పుల్ల అటు జరిగింది లేదు.

`అరవింద్‌ తో అడుగు ముందట పడిరది లేదు.

`రఘునందన్‌తో వచ్చిన కొత్త బలమేమీ లేదు.

`డికే. అరుణతో జిల్లాలో బలపడిరది లేదు.

`వీళ్లంతా బీజేపి కేంద్రంలో అధికారంలో వుండడంతో వుంటున్నారు.

`బీజేపి బలహీన పడుతుందన్న మరు క్షణం జారుకుంటారు.

`బీజేపి గూటికి చేరిన వాళ్లు ఎల్ల కాలం బీజేపితోనే వుంటారన్న గ్యారెంటీ లేదు.

`ఇవన్నీ మెజారిటీ బీజేపి శ్రేణులు చర్చించుకుంటున్న మాట.

`తెలంగాణలో ఇప్పటికీ ఏ సమస్య మీద మాట్లాడాలన్న మళ్లీ బండే.

`రుణమాఫీ మీద మాట్లాడుతున్న వాళ్లు లేరు.

`రైతుల పక్షాన పోరాటం చేస్తున్నది లేదు.

`ఆరు గ్యారెంటీల మీద ఒత్తిడి కార్యాచరణ ఇప్పటికీ లేదు.

`రైతు భరోసా మీద గళం విప్పింది లేదు.

`ఒక్క బండి సంజయ్‌ తప్ప ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వాళ్లు లేరు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 తెలంగాణ రాజకీయాల్లో బీజేపికి మంచి రోజులు రావాలంటే ఏం చేయాలి. రాష్ట్రంలో బిజేపి అధికారంలోకి రావాలంటే ఎవరి నాయకత్వం రావాలి? ఇది ఇప్పుడు బిజేపి శ్రేణులను తొలిచేస్తున్న అంశం. ఇప్పుడున్న పరిస్దితుల్లో బిజేపికి మళ్లీ ఊపిరిపోయాల్సిన సమయం వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో అడుగులు ముందుకు పడడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు. ఉచిత బస్సు తప్ప, ఆరు గ్యారెంటీలు తుస్సుమన్నాయన్న చర్చలే తెలంగాణలో జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సమయాన్ని బిఆర్‌ఎస్‌ వినియోగించుకోకుండా, కాంగ్రెస్‌కు ప్రజల్లో నీడ లేకుండా బిజేపి వైపు ప్రజలను మళ్లించాలంటే తెలంగాణకు సమర్ధవంతమైన నాయకుడు కావాలి. అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో మాత్రమే సాధ్యమౌతుంది. ఇది తెలంగాణలోని మెజార్టీ బిజేపి శ్రేణుల అభిప్రాయం. పార్టీలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే మాత్రం బండి సంజయ్‌ తప్ప మరొక నాయకుడు కనిపించడన్నది ముమ్మాటికీ నిజం. కనీసం మాట మాత్రానికైనా సరే ఇతర నాయకుల పేర్లు చెప్పడానికి కూడా శ్రేణులు ఇష్టపడకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బండి సంజయ్‌ను అధ్యక్షబాధ్యతలను తప్పించిన నాటి నుంచి బిజేపి శ్రేణుల్లో ఒక రకమైన నిస్తేజం ఆవహించింది. అంతకుముందు బండి సంజయ్‌ తెలంగాణ బిజేపిలో నింపిన జోష్‌ నిలకడగా వుంది. కాని అది ఇప్పుడు సరిపోదు. మరింత ఊపు కావాలి. ప్రజలనుంచి స్పందన రావాలి. బిజేపికి అనుకూలమైన వాతావరణం మళ్లీ ఏర్పడాలి. ఇతర పార్టీలనుంచి బిజేపికి వలసలు రావాలి. అందుకు పార్టీని పటిష్టపరిచే నాయకుడు రావాలి. 

అది ఒక్క బండి సంజయ్‌ వల్లనే సాధ్యమౌతుంది.

 ఇది పార్టీ శ్రేణుల మనోగతం. వారి మనసుల్లో బండి సంజయ్‌ తప్ప మరొకరు లేరు. ఇదే ఇప్పుడు తెలంగాణ బిజేపి కనిపిస్తున్న సీన్‌. ఎక్కడ నలుగురు బిజేపి నాయకులు కలిసినా ఇదే మాట చర్చించుకుంటున్నారు. పది మంది కార్యకర్తలు కలిస్తే బండి సంజయ్‌కే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ బిజేపి ఆట, రాజకీయ వేట మొదలు కావాలంటే బండి సంజయ్‌కి మళ్లీ పగ్గాలిస్తే బిజేపికి కళ్లెం వేయడం ఎవరి వల్లా కాదు. గతంలో కేవలం మొదటిసారి ఎంపిగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్‌క పగ్గాలిస్తే ఆయన చూపిన తెగువ గతంలో ఏ నాయకుడు చూపించలేదు. ఆయన నిలబెట్టిన బిజేపి ఆత్మగౌరవం మరెవ్వరూ రుచి చూపించలేదు. తెలంగాణ బిజేపి శ్రేణులను ఆయన బండి ఉత్సాహ పర్చినంతగా మరెవ్వరూ ప్రోత్సహించలేదు. గత ప్రభుత్వం మీద బిజేపి చేసిన పోరాటంలో సామాన్య కార్యకర్తకు కష్టం విచ్చినా సరే, అండగా నిలిచి తన దైన ముద్ర వేశారు. కష్టాల్లో వున్న కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆపద వస్తే అక్కడికి వాలిపోయేవారు. ఇలా అటు పార్టీ శ్రేణుల్లో నమ్మకాని, బిజేపిపై విశ్వాసాన్ని ఏక కాలంలో నింపిన ఏకైన నేత బండి సంజయ్‌. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాత తెలంగాణలో నైనా అంతటి తెగువ, చొరవ చూపిన నాయకుడు బండితప్ప మరొకరు కనిపించరు. ఎంత సేపు పార్టీని పరమైన కార్యక్రమాల హజరు తప్ప, పార్టీని బలోపేతం చేయడం కోసం నిత్యం ప్రజల్లో వున్న ఒకే ఒక్కడు బండి సంజయ్‌. ప్రధాని నరేంద్ర మోడీకి ఏకలవ్య శిష్యుడుగా, కేంద్ర హోం మర్రతి అమితషాలకు అత్యంత ఇష్టుడుగా బండి సంజయ్‌ పేరుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలతో మది నిండా, మనసు నిండా బిజేపి బలోపేతాని బండి సంజయ్‌ చేసిన కృషి మరే నాయకుడు చేయలేదన్నది నూరుపైసల నిజం. ఇదే పార్టీ శ్రేణులు చెబుతున్న సత్యం. 

ప్రస్తుతం బండి సంజయ్‌ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా వున్నందున ఆయనను పక్కనట్టే అన్న నమ్మకంతో చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు. 

నాకంటే నాకు అని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. కాని కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడుగా రెండు పదవులను నిర్వహిస్తున్నారు. కాని ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్న దాఖలాలు లేవు. ఒక వేళ ఇతర నాయకులకు ఎవరికైనా పగ్గాలు ఇస్తే వాళ్లు పార్టీకి గతంలో చేసిందేమిటి? ఇప్పుడు పదవి ఇస్తే చేసేదేముంటుందన్న దానిపై అధిష్టానం పక్కాగా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిజేపి రాష్ట్ర అధ్యక్షుడి పేరు ఖరారౌతుందని ప్రచారం జరుగుతున్న నాయకుల్లో ఈటెల రాజేందర్‌ పేరు కూడ వినిపిస్తోంది. అయితే ఈటెల రాజేందర్‌కు పార్టీ ఎంతో ప్రాదాన్యతనిచ్చింది. పార్టీలోకి వచ్చినందుకు ఎంతో గుర్తింపునిచ్చింది. ఉప ఎన్నికల్లో రాజేందర్‌ గెలుపుకోసం బిజేపి ఎంతో కృషి చేసింది. కాని శాసన సభ ఎన్నికల్లో ఆయనకు మరింత ప్రాదాన్యతనిచ్చి రెండు స్ధానాల్లో పోటీ చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. అయినా ఆయన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అయినా మళ్లీ ఆయనకు పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీకి కూడా అందర్నీ కాదని అవకాశమిచ్చింది. కాకపోతే ఆయనను పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనను చేరికల కమిటీకి చైర్మన్‌ను చేసింది. దాదాపు పార్టీ అధ్యక్ష పదవితో సమానమైన గుర్తింపుకల్పించింది. కాని ఏం జరిగింది. ఆయనతో వచ్చిన వారు ఎన్నికల సమయం వరకు కూడా ఎవరూ లేరు. ఆయన వారిని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. పట్టుమని పది మంది ఆయనతో వచ్చిన వారికే పార్టీ పట్ల విశ్వాసం కల్పించలేకపోయారు. ఆయన చేతుల్లో రాష్ట్ర పార్టీ భవిష్యత్తును పెడితే ఏం చేస్తారన్నదానిపై పార్టీలో పెద్దఎత్తున అంతర్గత చర్చ జరుగుతోంది. పైగా ఆయన ఎంపిగా ఎన్నికైన తర్వాత గాని, అంతకు ముందు గాని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీదగాని పెద్దగా స్పందించింది లేదు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఎలాంటి కార్యాచరణ చేపట్టింది లేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్లమెంటు సీటుకోసం చేసిన ప్రయత్నంతో మూడు నెలలు గడిపేశారు. పార్లమెంటు సభ్యుడైన తర్వాతనైనా పార్టీ పరమైన కార్యాచరణ చేపట్టింది లేదు. 

  రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్దం ప్రకటించింది లేదు.

 మహిళా మోర్చా అనేక కార్యక్రమాలు చేపట్టింది. మల్కాజిగిరి ఎంపిగా హైదరాబాద్‌లో మహిళా మోర్చా కార్యక్రమాలకు హజరైంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో కేవలం బస్సు ప్రయాణం మాత్రమే అమలు జరుగుతోంది. పెంచుతామన్న పించన్లు పెంచలేదు. ఇస్తామన్న రేషన్‌కార్డుల జాడ లేదు. రైతులకు మద్దతు దరలోపాటు, బోనస్‌ కనిపించలేదు. రైతులకు రైతు భోరోసా పత్తా లేదు. రుణమాఫీ విషయంలో అనేక తిరకాసులున్నాయి. రైతులు పెద్దఎత్తున రుణమాఫీ విషయంలో అసంతృప్తితో వున్నారు. కాని వారి గోడు పట్టించుకున్న వారు లేరు. అటు కేంద్ర మంత్రిగా కీలకమైన భాద్యతలు నిర్వహిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదరుదాడి చేస్తున్న ఒకే ఒక్కడు బండి సంజయ్‌. ఆయన తప్ప ఇప్పటి వరకు రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్న ఎంపిలు లేరు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారెవరూ రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడడం లేదు. ఎన్నికల హమీల కోసం పోరాటం చేయడం లేదు. రాష్ట్రంలో మహిళలపై జరగుతున్న దాడులపై మహబూబ్‌ నగర్‌ ఎంపి. డికే అరుణ పెద్దగా స్పందించింది లేదు. మహిళా మోర్చాకు అండగా నిలిచి పోరాటం చేసింది లేదు. కాని ఆమె కూడా బిజేపి అధ్యక్ష పదవి రేసులో వున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంపిగా గెలిచిన తర్వాత రఘునందన్‌రావు కార్యాచరణ ఏమీ కనిపించడంలేదు. నిజామాబాద్‌ ఎంపి. అరవింద్‌లో గతంలో వున్న జోష్‌ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వంలోపాటు, బిఆర్‌ఎస్‌పై కూడా ఏక కాలంలో యుద్దం చేయాల్సిన సమయంలో ఎంపిలు రాష్ట్ర పదవి పగ్గాల కోసం ఎదురుచూస్తున్నారే గాని, ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు. కాని బండి సంజయ్‌ మాత్రం ప్రజా సమస్యలపై ఎప్పుడూ గళమెత్తుతూనే వుంటారు. అందుకే అందరూ బండినే కోరుకుంటున్నారు. రాష్ట్ర పగ్గాలు బండికే అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!