https://epaper.netidhatri.com/view/275/netidhathri-e-paper-25th-may-2024%09/2
చిత్రపురికి నేటిధాత్రి అండ!
`చిత్రపురిలో దశాబ్దాల మోసాలపై నేటిధాత్రి అక్షర కవాతు.
`ఫలించిన నేటిధాత్రి అక్షర పోరాటం
`అనిల్ అరెస్టుతో కార్మికులలో వెల్లివిరిసన సంతోషం.
`నేటిధాత్రికి అభినందనల పర్వం.
`చిత్రపురిలో పె(గ)ద్దలు చేసిన అరాచకాలపై గళం విప్పుతున్న కార్మికులు.
`నేటిధాత్రితో ఒక్కసారిగా కార్మికులకు వచ్చిన ధైర్యం.
`చిత్రపురి చిట్టాలన్నీ విప్పుతాం.
`చీకటి కోణాలన్నీ వెలుగులోకి తెస్తాం.
`దోచుకున్న వారి బండారం బైట పెడతాం.
`జనం ముందు దోషులుగా నిలబెడతాం.
`తిన్నదంతా కక్కిస్తాం..
`అప్పటిదాకా నేటిధాత్రి విశ్రమించదు.
`అనిల్ అరాచాలు వెలుగులోకి తెచ్చాం.
`ప్రభుత్వం స్పందించేలా వార్తలు రాశాం.
`తప్పులు చేస్తున్నారని ప్రతిసారీ హెచ్చరిస్తూనే వున్నాం.
`కార్మికులకు అన్యాయం చెయొద్దని సూచిస్తూనే వున్నాం.
`అనిల్ పెడచెవిన పెట్టాడు…కటకటాలపాలయ్యాడు.
`నేటిధాత్రి ఇక్కడితో ఆగిపోదు…
`ఇప్పుడే అసలు కథ మొదలైంది.
`అనిల్ వెనుక వున్న పెద్దల బాగోతాలన్నీ బైటపెడతాం.
`కార్మికులకు అన్యాయం చేసిన వారి భరతం పడతాం.
హైదరాబాద్,నేటిధాత్రి:
చిత్ర పరిశ్రమలో శ్రీరంగ నీతులు చెప్పేవారు చాలా ఎక్కువ. ఎందుకంటే సినిమాల ఆఖరుకు చెప్పేది నీతే. కాని సినిమా మొత్తంలో చూపించేదంతా దిక్కుమాలిన పనులే. అవి నిజ జీవితంలో కూడా చూపించేవారు కూడా ఎక్కువే. అయితే అందరూ కాదు. ప్రతి వ్యవస్ధలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. అక్కడ కూడా అదే వుంది. కాకపోతే చెడు కొంచెం ఎక్కువ శాతం వుంటుంది. అసలే గ్లామర్ ప్రపంచం కావడం వల్ల కొన్ని పాల్లు ఎక్కువగా వుంటుంది. అడుగేస్తే అందం, చూస్తే డబ్బు చుట్టూ మోగిపోతాయి. అందుకే అక్కడ మోసాలు ఎక్కువ. అమాయకులు కూడా ఎక్కువే. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ అమాయకులు వుంటారో అక్కడే ఎక్కువ మోసాలు జరుగుతుంటాయి. కొంతం అతి తెలివితేటలు వుండేవారు. ఎక్కువగా వుంటారు. అందుకే మోసాలు చేస్తుంటారు. ప్రపంచంలో సినీ పరిశ్రమలో వుండేవారంతా గొప్పవారు మరొక చోట వుండరన్నంతగా నమ్మిస్తారు. ఎవరినైనా నమ్మిస్తారు. రంగుల ప్రపంచంలో తేలుస్తుంటారు. మాయ మాటలు చెప్పి బెరిడీ కొట్టిస్తుంటారు. ఇలాంటి వేషాలు వేసేవారు ఎవరో చిన్నా చితకా వ్యక్తులు కాదు. పెద్ద పేరు వున్న వాళ్లే ఎక్కువ మోసాలు చేస్తుంటారు. వాళ్లనే అందరూ నమ్ముతుంటారు. అందుకే మోసాలు చేయడానికి చాలా సులువన్నది చేసి చూపిస్తుంటారు. సినిమా తీస్తున్నామంటారు. అవకాశమిస్తామంటారు. వాళ్ల చేతనే ఖర్చులు పెట్టిస్తుంటారు. అంతటి ఘనా పాటీలుంటారు. అలాగే మీకు సొంతింటి దారి చూపిస్తామని చెప్పి, చిత్ర పురిలో ఇళ్లిస్తామని చెప్పి నలభై ఏళ్లుగా మోసం చేస్తూనే వున్నారు. నలభై ఏళ్లుగా ఎదురుచూసేవారు ఎదురుచూస్తూనే వున్నారు. మోసపోయిన వారు కూడా ఇంకా ఆశతో బతుకుతున్నారు. ఇప్పటికి చిత్ర పురితో కొత్త వాళ్లను మోసం చేస్తూనే వున్నారు.
వాళ్ల నుంచి లక్షలు వసూలు చేస్తునే వున్నారు.
గత నలభై సంవత్సరాలుగా కార్మికులను మోసం చేస్తూనే వున్నారు. అయినా ఆ దందా ఆగడం లేదు. అసలు సిసలైన కార్మికులకు న్యాయం జరిగింది లేదు. ఇంకా ఎన్నాళ్లీ మోసాలు అని నేటిధాత్రి ప్రశ్నించడం మొదలు పెట్టింది. కార్మిక లోకంలో కదలిక వచ్చింది. నేటిధాత్రి చిత్రపురిలో జరుగుతున్న మోసాల మీద వరుస కథనాలు రాస్తూ వచ్చింది. దాంతో ఆ సొసైటీ చైర్మన్ నేటిధాత్రి వార్తలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో నేనేంతో సుద్దపూసను అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. ఆ తర్వాత నేటిధాత్రి రాసిన కథనంతో అనిల్ వల్లభననేని కధ అడ్డం తిరిగింది. వల్లభనేని అనిల్ చెప్పేదాంలో ఏ ఒక్కటీ నిజం కాదని నేటిధాత్రి తేల్చేసింది. అందులో ఒక్కటి కూడా వాస్తవం కాదని అనేక ఆధారాలు బైట పెట్టింది. కార్మిక లోకాన్ని పెద్దలు ఎప్పటినుంచో మోసాలు చేస్తూ వస్తున్నారు. కార్మికుల కడుపు కొడుతూనే వున్నారు. వాళ్లకు రావాల్సిన స్ధలాలను కొట్టేస్తూనేవున్నారు. కట్టిన ఇండ్లలో వారి పేరు లేకుండా చేశారు. వారికి గూడు లేకుండా మోసం చేస్తూనేవున్నారు. వాళ్ల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేశారు. పేరుకు చిత్ర పురి కాని కాని సినీ కార్మికులు కాని వారికి అమ్ముకున్నారు. ఒక్కొ ప్లాట్‌ను ఇద్దరికి, ముగ్గురికి రిజిస్ట్రేషన్లు చేశారు. సొసైటీ పేరుతో చేసిన మోసాలు ఒకటి కాదు, రెండు కాదు..లెక్కలేనని తప్పులు చేశారు. కార్మికులను నిండా దోచుకున్నారు. కార్మికుల కష్టంతోనే పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నారు. వారి చెమట చుక్కలతో పెద్దలు బతుకుతున్నారు. విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. అదే కార్మికులను చిన్న చూపు చూస్తున్నారు. అంతటి దుర్మార్గులు ఎంతో మంది చిత్ర పరిశ్రమలోవున్నారు. చిత్ర పురిలో జొరబడ్డారు. ఇంత కాలానికి పాపం పండిరది. నేటిధాత్రి అక్షరం శక్తి అందరికీ అర్ధమైంది. వల్లభనేని అనిల్ సాగిస్తున్న అరాచలకాలు వెలుగులోకి తెచ్చింది. అంతకు ముందు ఏం జరిగిందన్నదానిపై కూడా కధనాలు అందించింది. దాంతో కదలిన కార్మికల లోకం, అనిల్‌తోపాటు మరి కొంత మంది మీద పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దాంతో అనిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది పరారీలో వున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంటే కార్మికుల జీవితాలతో ఎలా ఆడుకున్నారో అర్ధమౌతోంది. ఆది నుంచి చిత్రపురిలో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందనేది కార్మిక వర్గాలు చెబుతున్న మాట. ఎవరికి వారు పెద్దలు దోచుకోవాల్సిందంతా దోచుకున్నారు.
కార్మికులకు న్యాయంగా రావాల్సిన ప్లాట్లను ఇష్టాను రీతిన అమ్ముకున్నారు.
అసలుచిత్ర పురిలో ఎవరికి ఇండ్లు వుండాలి? కేవలం చిన్న చన్ని ఆర్టిస్టులు, 24 శాఖలకు చెందిన కార్మికులకు వుండాలి. కాని చిత్ర పురి కాలనీలో నిర్మాతలకు ఇండ్లు వుండడం ఏమిటి? దర్శకులకు వుండడం ఏమిటి? హీరోలకు కేటాయించడం ఏమిటి? పోలీసుశాఖలో పనిచేసేవారికి వుండడం ఏమిటి? రాజకీయ నాయకులకు వుండడం ఏమిటి? వీళ్లంతా ఎవరు? వీళ్లకు సినీ రంగానికి సంబంధం ఏమిటి? మరీ విడ్డూరమేమిటంటే ఐటి ఉద్యోగులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు వున్నాయి. అమెరికాలో వున్నవారికి కూడా చిత్రపురిలో ఫ్యాట్లు వున్నాయి. ఇంతకన్నా దుర్మార్గమేమైనా వుంటుంది. ఇంతటి దౌర్భాగ్యం ఎక్కడైనా వుంటుందా? అందుకే పరిశ్రమకు చెందిన కార్మికులు నేటిదాత్రిని ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు. అప్పుడు నేటిదాత్రి చిత్రపురిలో అక్రమాలపై కథనాలు మొదలు పెట్టింది.
నేటిదాత్రి కథనాలతో వచ్చిన స్పందన వల్ల కార్మిక లోకంలో కదలిక వచ్చింది.
నేటిదాత్రిలో వచ్చిన వరస కథనాలతో ప్రభుత్వంలో కూడా చలనం వచ్చింది. గత ప్రభుత్వంలోని పెద్దలు కూడా చిత్ర పురి గద్దలకు సహకరించారన్న వార్తలు అనేకం వున్నాయి. కాని కొత్త ప్రభుత్వం చిత్రపురిలో జరిగిన అన్యాయాలపై దృష్టిపెట్టింది. నేటిధ్రాత్రి కధనాలతో చిత్రపురిపై సమీక్షకూడా జరిగింది. అసలు ఏంజరుగుతుందో తెలుసుకున్నది. అధికారులుకు ఆదేశాలు జారీ చేసింది. అందుకే చిత్ర పురి పెద్దలపై ఎలాంటి పిర్యాధులైనా స్వీకరించని పోలీసు యంత్రాంగం వెంటనే కార్మికులు ఇచ్చిన పిర్యాధును స్వీకరించారు. సొసైటీ చైర్మన్ అనిల్‌ను అరెస్టుచేశారు. వారే కాకుండా మరి కొందరి మీద కూడా చిత్రపురిలో మోసపోయిన వాళ్లు పిర్యాధు చేశారు. కాకపోతే వాళ్లు అందుబాటులో లేరు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమచారం. అయితే ప్రభుత్వ పెద్దలు వారిని దగ్గరకు రానివ్వడంలేకపోవడం వల్ల ఇతర మార్గాలతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపురిలో జరిగిన అన్యాయం మీద ఉక్కుపాదం మోపాలనే చూస్తున్నారు. కార్మికులకు అన్యాయం చేసిన వారు ఎంత పెద్దవారైనా సరే వదిలిపెట్టకూడదన్న నిర్ణయంతో వున్నట్లు సిఎంవో వర్గాలు చెబుతున్నాయి. అసలు చిత్రపురిలో సినీ పెద్దలలైన 250 మందికి పెద్దఎత్తున స్థలాలు కేటాయించడమేమిటి? వాటిలో రో హౌజ్‌ల పేరుతో విల్లాలు నిర్మాణం చేసుకోవడమేటి? కార్మికుల స్దలాలలో వారు పాగా వేయడమేమిటి? అక్రమంగా నిర్మాణం చేసిన రోహౌజ్‌లను కూల్చేయాలని ఆదేశాలున్నా, అదికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. సొసైటీ చేసిన బాగోతాలు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలైన రోహౌజ్‌లను కూల్చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోహౌజ్‌లు కూల్చేస్తే అక్కడ కొన్ని వందల మంది కార్మికులకు ఫ్లాట్స్ నిర్మాణం చేసి ఇవ్వొచ్చు. కార్మికులు ఎప్పటినుంచో జమ చేసుకున్న సొమ్మంతా సొసైటీలో మూలుగుతోంది. కాని కార్మికులకు ఇండ్లు లేవు. నిర్మాతలు, హారోలకు మాత్రం రో హౌజ్‌ల నిర్మాణం జరిగిపోయింది. ఇది కార్మికులన నిలువునా ముంచడం కాదా? వారి హక్కులను హరించడం కాదా? చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కాదా? అందుకే ముందు రోహౌజ్‌లు ఎవరికి కేటాయించారో వెలుగులోకిరావాలి. ఆ ఇండ్లన్నీ కూల్చేయాలి? కార్మికులను ఇప్పటి వరకు మోసం చేసిన వాల్లందిరిపై కేసులు నమోదు చేయాలి. వారిని కటకటాల వెనక్కి పంపాలి. ఇది కార్మికులు చేస్తున్న డిమాండ్. కార్మికలందరికీ న్యాయం జరగాలి. న్యాయంగా వారికి రావాల్సన ఇండ్లు వారికి రావాలి. ఇదే నేటిదాత్రి డిమాండ్.