
చేతినిండా పని కల్పించాలి
చేనేత సంఘాలలో ఎన్నికలు నిర్వహించాలి
శాయంపేట నేటి ధాత్రి:
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య తెలంగాణ చేనేత జౌళి శాఖ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయంలో మెమోరాండం అందజేయ డమైనది. తెలంగాణలో అధిక జనాభా కలిగిన బీసీ వర్గంలో కటిక పేదరికం అనుభవిస్తున్న కులస్తులు పద్మశాలీలు రేక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు ఉన్నాయి సరియైన ఉపాధి లేక ఎన్నో కుటుంబాలు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కులం ఏదైనా ఉందంటే అది పద్మశాలీలే ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఉపయోగపడే పథకాలు ఏమి తీసుకురాలేదు
అగ్గిపెట్టెలో ఇమిడి చీరలు నేసి ప్రపంచానికి చేనేత కళాబైవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలదని అన్నారు
చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు నేసిన బట్టలకు గిట్టుబాటు లేక బ్రతుకు చిరిగిన వస్త్రమైంది నేటికీ వలస కూలీలుగా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఎలాంటి స్థిరాచర ఆస్తులు లేని సంచార జీవులుగా మారారు
నేతన్నలతోపాటు పవర్ లూమ్స్ నడిపేవారు అత్యంత దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు సిరిసిల్ల మరియు ఇతర ప్రాంతాలలో పవర్ లూమ్స్ నడిచేవని ఈ ప్రభుత్వం ఏర్పడిన నుండి పరిశ్రమలు మూతపడ్డాయని కార్మికులు పని లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని
పవర్ లూమ్స్ నడిపే కార్మికులకు మీటర్ వస్తారానికి ఒక రూపాయి 40 పైసలు కార్మికుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసే వారిని 2001 నుండి ఇప్పటి వరకు జమ చేయలేదని మూతపడ్డ వస్త్ర పరిశ్రమలు నడిచెట్టు చర్యలు చేపట్టాలని
ప్రతి పవర్లూమ్స్ కార్మికుడికి తాత్కాలికంగా ప్రతి నెల 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి 2000 రూపాయలు మరియు సహాయకుడికి 500 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసే వారని
ఈప్రభుత్వంవచ్చినప్పటినుండి వారి ఖాతాల్లో జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
*కార్మికులు తయారుచేసిన బట్టలను వెంటనే టెస్కోవారు ఖరీదు చేయాలి
*టెస్ట్కోఆర్ ఖరీదు చేసిన బట్టల బిల్లులు ప్రతి నెల సంఘాలకు చెల్లించాలి
*గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేత కార్మికులకు ట్రిఫ్ట్ పండు కొనసాగించాలి
*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల్లో ఉన్న నిల్వ వస్త్రాలను కొనుగోలు చేయాలి
*టెస్కో నుండి సంఘాలకు రావాల్సిన బాకీలను వెంటనే చెల్లించాలి
*చేనేత భీమాను కొనసాగించాలి.
పై విషయాలను అమలు చేయుటకు ప్రభుత్వంతో చర్చించి నేత కార్మికులను పవర్లూమ్ కార్మికులను ఆదుకొనుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.