జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జన్మదిన వేడుకలు.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి వేడుకలను స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర పోరాటంలో దేశంకోసం వారి పూర్తి జీవితాన్ని త్యాగం చేశారని, అందువల్లే మనకు స్వాతంత్రం వచ్చిందని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో
మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్ మాజీ వార్డు సభ్యులు ప్రసాద్,సతీష్,సుధాకర్, దివ్యసాగర్, మధు,సుమన్,మధు,గంగాధర్, నరేందర్,శంకర్,శ్రీనివాస్, రాజు మరియు ఉపాధ్యాయ బృందం, సేవా సమితి సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!