నేతాజీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
సిరిసిల్ల (నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ యూత్ ఫెస్టివల్ మరియు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బోనాల రోజా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినీ విద్యార్థులను ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం లో రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. విద్యార్థినులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా సంప్రదాయ విలువలను చాటే అందమైన ముగ్గులు వేశారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభను అతిథులు ప్రశంసించారు.
ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికి తీస్తాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
బోనాల రోజా మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు సాంప్రదాయకరమైన పండుగలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని అన్నారు. ముగ్గులతో తమ యొక్క కలలను ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించి తమ జీవితాలలో ఉన్నతంగా స్థిరపడాలని ఆశిస్తున్నాను అన్నారు. అదేవిధంగా ఉమన్ ఎంపవర్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నేతాజీ డిగ్రీ కళాశాల చైర్మన్ జూపల్లి పృధ్విధర్ రావు, కరస్పాండెంట్ నాయిని జగన్మోహన్ రావు, ప్రిన్సిపల్ రేశం శ్రీకాంత్, అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
