దేవుని రూపంలో ఎదురైన నెక్కొండ పోలీసులు
@ ఎస్సై మహేందర్ సేవలు అభినందనీయం
#నెక్కొండ ,నేటి ధాత్రి:
మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన బానోత్ బాలాజీ అనే రైతు బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం తన బావి వద్ద వ్యవసాయ పనులు చేస్తున్న తరుణంలో బాలాజీ పాముకాటుకు గురవడంతో బాలాజీ కుటుంబీకులు 108 సమాచారం ఇవ్వగా ఆ సమయంలో నెక్కొండ కు సంబంధించిన 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో విధులలో భాగంగా ఎస్సై మహేందర్ తన సిబ్బందితో కలిసి నెక్కొండ వైపు వస్తుండగా బాలాజీ మరియు వారి కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆర్తనాధారాలతో రోదిస్తుండగా గమనించిన ఎస్ఐ మహేందర్ పోలీస్ వెహికల్ ఆపి వెంటనే పాముకాటుకు గురైన బాలాజీని తన వాహనంలో ఎక్కించుకుని మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాలాజీ కుటుంబంలో మాట్లాడుతూ దేవుని రూపంలో నెక్కొండ ఎస్సై మహేందర్ వచ్చి బాలాజీని ఆస్పత్రులకు తరలించడం ఎంతో సంతోషమని అన్నారు అంతేగాక ఎస్సై మహేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.