కాలయాపన చేస్తున్న అధికారులు
ఇబ్బంది పడుతున్న మండల ప్రజలు
శాయంపేట నేటి ధాత్రి:
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోజు నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు నిరంతరం సరఫరా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ శాయంపేట మండలం నుండి మాందారి పేటకు వెళ్లే దారిలో రోడ్డు పోసి సంవత్సరం దాటినా కూడా మధ్య భాగంలో విద్యుత్ స్తంభాలు నిలబడి ఉన్నాయి. స్తంభాలు రోడ్డుపై నిలబడి యున్న వానిని చూసుకుంటూ ప్రతిరోజు ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యధోరణిగా వ్యవహరి స్తున్నారు.మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాలు తీసివేసే ప్రక్రియ అలాగే ఉంది కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షాకాలం సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రజలు వాపో తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని రోడ్డుపై నిలబడి ఉన్న స్తంభాలను తీసివేసే సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.