
Negligence Leads to Flooded Roads
అధికారుల నిర్లక్ష్యం/ జలమయం అయిన నివాస ప్రాంతాలు రోడ్లు — ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం
◆:- విచ్చల విడిగా వ్యర్థాలను వదులుతున్న అల్లనా
◆:- దుర్గంధం వాసన వదిలిన అల్లనా
◆:- చెరువులను తలపిస్తున్న వెంచర్లు,రోడ్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాహిరాబాద్ నియోజకవరగంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం తిరిగి పరిశీలించడం జరిగింది ,బారి వర్షాలకు రోడ్లు,వెంచర్ లు అన్ని జలమయం అయ్యాయి వాగులు వంకలు బోర్లి పోతున్నాయి ప్రతిసారి వర్షాలు కురుస్తున్న సమయంలో ఇదే అదనుగా భావించి అల్లనా పశువదశాల వ్యర్థాలను నాళాలో ప్రవహిస్తున్న నీటిలో వదులుతున్నాడు దింతో చుట్టూ ప్రక్కల దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ప్రజలు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలున్నాయి అల్లనా వ్యర్టాలను వదులుతున్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది

ఈ వ్యర్థాలు మొత్తం నారింజలో కలిసి నారింజ నీరు మొత్తం కలుషితమవుతున్నది ఈ విషయమై గత జూన్ మాసంలో పొల్యూస్యన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన నాటి నుండి నేటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,అధికారులు అల్లనా యాజమాన్యంతో కుమ్ముక్కై ఏ చర్యలు తీసుకోవడం లేదు,మరియు నాళాలు కాలువలు మళ్లించి,చిన్నవిగా చేసి అధికార పార్టీ నాయకులు వ్యాపారులు అక్రమంగా వెంచర్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అక్రమ వెంచర్ ల లో మొత్తం నీరు నిలబడి చేరువులను తలపిస్తున్నాయి గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వారు స్పందిస్తే ఇలా జరిగేదికాదు ప్లాట్లు కొనే వారు క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల అసమర్థతే, మరియు

ఈ బారి వర్షాలకు రోడ్లపై బారి లోతుగా నీరు నిలబడి అల్గోల్,మరియు రాయిపల్లి డి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి,నారింజ పూర్తిగా నిండుకొని గేట్లు చేడిపోయి సరిగ్గా తెరుచుకోనందున నీరు వెనక భాగాన నిలబడి పంటపొలాల్లో నీరు నిలబడి పంట నష్టం జరుగుతున్నది గేట్లపై నుండి నిరంత వృధాగా కర్ణాటకకు తరలిపోతున్నది అధికారులు,ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే నీటిని కపడుకోనేవారం,ఇప్పటి కైనా అధికారులు,ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,సి.యం. విష్ణువర్ధన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు,