`’’చిట్’’ బాధితుల కళ్ళలో ఆనందం!
`ఇంత కాలానికి బాధితులకు మిగిలిన సంతోషం!
`ఆఖరు బాధితుడి వరకు న్యాయం జరిగేలా ‘‘నాయని’’ ప్రయత్నం.
`బాధితుల పక్షాన ఒక్కడు ఎమ్మెల్యే ‘‘నాయని రాజేందర్ రెడ్డి’’ కొట్లాడుతూ వచ్చారు.
`ఇప్పుడు ‘‘నాయిని’’ బాధితులకు న్యాయం చేసి చూపిస్తున్నారు!
`’’నాయని రాజేందర్ రెడ్డి’’ అసలైన ‘‘ప్రజా నాయకుడు’’ అనిపించుకున్నారు.
`బాధితులకు న్యాయం చేసి ‘‘నాయిని’’ శబాష్ అనిపించుకున్నారు.
`’’నేటిధాత్రి’’ పదేళ్లకు పైగా బాధితుల పక్షాన ‘‘అక్షర పోరాటం’’ చేస్తూ వచ్చింది!
`అనేక సార్లు చిట్ కంపెనీ గుండాలు
‘‘నేటిధాత్రి’’ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది.
`అయినా ‘‘నేటిధాత్రి’’ వెనుకడుగు వేయలేదు!
`ఎన్ని బెదిరింపులు వచ్చినా అదరలేదు.
`బాధితులకు న్యాయం జరిగేదాకా అక్షర పోరాటం ఆపలేదు.
`అన్ని ‘‘చిట్ కంపెనీ’’ల బాధితులకు న్యాయం జరిగేదాకా ‘‘నేటిధాత్రి’’పోరాటం ఆగదు.
`చిట్ కంపెనీలు శవాల మీద పేలాలు కూడా వదలరు!
`బాధితులు కాకున్నా సొమ్ముకు ఎసరు?
`చిట్ కంపెనీలు, అధికారులు కలిసి చిట్స్ పేరుతొ దోచుకు తిన్నారు?
`బాధితులకు అందాల్సిన సొమ్ములో కూడా నొక్కాలనుకున్నారు!
`జనం సొమ్ము ఇప్పటికే పందికొక్కుల్లా తిన్నారు?
`జనం సొమ్ముతో చిట్ దొంగలు ఆస్తులు కూడబెట్టుకున్నారు?
`గత పాలకుల అండతో చిట్ వ్యాపారులు జనం సొమ్ము మింగేశారు!
`చిట్ వేసిన పాపానికి జనాన్ని కష్టాల పాలు చేశారు!
`కష్ట జీవుల సొమ్ముతో చిట్ దొంగలు జల్సాలు చేశారు!
`రూపాయి, రూపాయి కొడబెట్టుకున్న పేదవాళ్లను నిండా ముంచారు?
`అంతస్తులమీద అంతస్తులతో బంగాళాలు కట్టుకున్నారు.
`భూములు కొనుక్కున్నారు.. ఆస్తులు సంపాదిచుకున్నారు?
`బోర్డులు తిప్పేసి జనం నెత్తి కొట్టి కంపెనీలు మూసేశారు!
`గత పాలకుల అండతో రెచ్చిపోయారు?
`బాధితులను భయపెట్టి బతికేశారు?
`బాధితుల పక్షాన నిలవాల్సిన నాయకులు చిట్ కంపెనీలకు కొమ్ము కాశారు?
`చిట్ కంపెనీలకు నాయకులు అమ్ముడు పోయారు?
`అయినా అధికారుల వంకర బుద్ది మారలేదు.
`బాధితుల సొమ్ములో కూడా కొంత కన్నం పెట్టాలని చూశారు.
`చిట్ కంపెనీల కక్కుర్తి బుద్ధికి ఆనవాలు!
`అధికారుల అవినీతికి నిదర్శనాలు!
`15 సంవత్సరాల తర్వాత జరిగిన న్యాయం.
`అప్పటికే అన్యాయమైపోయిన బాధిత జనం.
`ఇంకా వారి పేరు చెప్పుకొని దోచుకునే పన్నాగం?
`‘‘ఛీ ఛీ’’ అని ఉమ్మినా తుడుచుపోతున్న ‘‘చిట్ కంపెనీల’’ వైనం!
హైదరాబాద్, నేటిధాత్రి:
ఎట్టకేలకు వరంగల్‌కు చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థకు చెందిన బాదితుల గోడు ప్రభ్వుతం పట్టించున్నది. వారికి రావాల్సినసొమ్మును వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిఏం. రేవంత్‌రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు చొరవ తీసుకున్నారు. వారికి అందాల్సిన సొమ్ము అందేందుకు సమయం ఆసన్నమైంది. హన్మకొండ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి గత పదేళ్ల కాలంగా బాదితుల పక్షనా పోరాటం చేస్తున్నారు. బాదితులకు న్యాయం జరగాలని గత ప్రభుత్వంతో పోరాటం చేశారు. కాని సాద్యం కాలేదు. అప్పటి పాలకులు పట్టించుకోలేదు. బాదితుల గోడు వినిపించుకోలేదు. హన్మకొండ జిల్లాకు చెందిన నాయకులు బాధితుల పక్షాన నిలవలేదు. వారికి న్యాయం చేయాలన్న ఆలోచన చేయలేదు. చిట్ ఫండ్ కంపనీలకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. వారిని కాపాడుకుంటూ వచ్చారు. బాదితులను ఏనాడు పట్టించుకోలేదు. బాధితులు ఆ నాయకుల చుట్టూ ఎంత తిరిగినా కనికరం చూపలేదు. చిట్ ఫండ్ కంపనీలు పేదల సొమ్ము దోచేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించారు. బాదితులు మొరపెట్టుకొని, మొరపెట్టుకొని పదేళ్ల కన్నీరు కార్చారు. అయినా వారికి బాదితులకు న్యాయం చేయాలనిపించలేదు. కాని ఆ సమయం నుంచే బాధితుల పక్షాన హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంతగానో పోరాటం చేశారు. చివరకు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాదితులకు న్యాయం జరిగేలా చేశారు. అందుకోసం ఆయన ఎంతో శ్రమించారు. అనేక సార్లు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, ఒప్పించారు. బాదితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆఖరుకు ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి, బాదితుల కళ్లలో నేడు ఆనందం చూస్తున్నారు. బాదితులు సంతోషం కోసం ఎంతగానో కృషిచేశారు. అయితే గత దశాబ్ద కాలం క్రితమే హన్మకొండలోని ఓ చిట్ ఫండ్ కంపనీ చిట్స్ వేసిన పేద ప్రజలకు నిండా ముంచేసింది. వారికి రావాల్సిన సొమ్మను ఎగ్గొట్టింది. ఈ విషయం బాదితులు అనేక సార్లు తమ గోడును నేటిధాత్రికి వినిపించారు. దాంతో అప్పటి నుంచి నేటిధాత్రి బాదితుల పక్షాన అక్షర పోరాటం చేస్తూ వస్తోంది. కొన్ని వందల కథనాలు రాసింది. అయినా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. చెవికెక్కించుకోలేదు. అయినా నేటిధాత్రి తన ప్రయత్నం ఆపలేదు. ఆ సందర్భంలో అనేక సార్లు చిట్ ఫండ్ సంస్ధకు చెందని పెద్దలు, గూండాలు బెదిరింపులకు దిగారు. నేటిధాత్రిని అదిరించాలని చూశారు. అయినా వినకపోవడంతో పలు మార్లు నేటిధాత్రి పత్రిక కార్యాలయం మీద దాడులు చేశారు. నేటిధాత్రి పత్రికా కార్యాలయంలో వస్తువులు ద్వంసం చేశారు. కంప్యూటర్లు పగుల గొట్టారు. అయినా నేటిధాత్రి వెరలేవు. చిట్ ఫండ్ సంస్ద గూండాలు ఎంత భరితెగించినా తట్టుకొని నేటిధాత్రి నిలబడిరది. అక్షరపోటారం చేసింది. అయినా బాదితులకు న్యాయంచేయడానికి ఏ ఒక్క నాయకుడు ఆనాడు ముందుకు రాలేదు. అయితే గత పదేళ్ల నుంచి చిట్స్ కంపనీల బాదితుల పక్షాన పోరాటం చేస్తున్న నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది. బాదితులకు మోసం ఎలా జరిగిందనేదానిపై అనేక సార్లు వివరణలు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు నాయిని రాజేందర్ ప్రయత్నం ఫలించింది. నేటిధాత్రి అక్షర పోరాటం ప్రతిఫలించింది. బాదితులకు న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. అయితే ఒక్క చిట్ ఫండ్ కంపనీ బాదితులకే న్యాయం జరుగుతోంది. ఇంకా హన్మకొండ జిల్లాలో బాదితులను మోసం చేసిన సంస్ధలు ఇంకా పదులు సంఖ్యలో వున్నాయి. ఆ చిట్ ఫండ్ కంపనీల చేతుల్లో మోసపోయిన బాదితులు వేల సంఖ్యలో వున్నారు. వారికి కూడా న్యాయంజరగాల్సి వుంది. చిట్ పండ్ కంపనీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. వాటి నుంచి కూడా బాదితులకు రావాల్సిన సొమ్మును ఇప్పించే ప్రయత్నం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేయాలిన బాదితులు విన్నవించుకుంటున్నారు. వారికి కూడా న్యాయం జరిగేలా ఎమ్మెల్యే ఇప్పటికే చొరవ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ, మోసాలు చేస్తున్న చిట్కంపనీలపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఇదిలా వుంటే ఇంత జరుగుతున్నా బాదితుల సొమ్మును మరో రకంగా ఎలా నొక్కేయాలో కూడా ఆ చిట్ కంపనీ పకడ్బందీ ప్లాన్ వేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు డిపాజిట్ల సొమ్మును చెల్లించేందుకు సుతారం ఇష్టం లేని చిట్కంపనీ, రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందితో చేతులు కలిపారు. కొత్త తెలివి తేటలు చూపించాలనుకున్నారు. అందుకు ఓ ఉద్యోగి సహాకారంలో బాదితుల సొమ్ములో కూడా కొంత నొక్కేయాలని చూశారు. అది కాస్త వెలుగులోకి వచ్చింది. బాదితులకు ఇవ్వాల్సిన సొమ్ము నుంచి ఎంత వీలైతే అంత తమ ఖాతాలో వేసుకోవాలని చిట్ కంపనీ ప్రయత్నం చేసింది. ఆ సలహా ఓ ఉద్యోగి ఇచ్చినట్లు తెలుస్తోంది. చిట్టిలలో డిఫాల్టర్ల పేర్లను తమ బందువుల పేరు మీదకు మార్చి అలా సొమ్ము నొక్కేయాలని చూసినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. అంటే జనం సొమ్ము జనాలకు ఇవ్వడానికి ఇంకా ఆ కంపనీలకు మనసు ఒప్పడంలేదు. ఇలా జనం సొమ్ము పంది కొక్కుల్లా ఇప్పటికే తిన్నారు. వందల కోట్లు వెనకేసుకున్నారు. జనం సొమ్ముతో ఆస్దులు పోగు చేసుకున్నారు. భూములు కొనుగోలు చేసుకున్నారు. రియల్ వ్యాపారంలోకి దిగారు. ఇలా వందలకోట్లకు అదిపతులలయ్యారు. అయినా వారి దన దాహం తీరడంలేదు. బాదితుల సొమ్మును మొత్తంగా మింగేయాలనుకున్నారు. సంస్దలు నష్టాల బారిన పడ్డాయని లేనిపోని లెక్కలు సృష్టించి, కంపనీలు మూసేశారు. జనం సొమ్ముతో ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఎవరైనా పలకరిస్తే మొసలి కన్నీళ్లు కారుస్తూ, దివాళా మొకాలు పెడుతుంటారు. ఇలా జనం సొమ్మును అప్పనంగా మెక్కిన కంపనీలు అనేకం వున్నాయి. ఒక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే చిట్ కంనీలు సుమారు వెయ్యి కోట్ల వరకు జనాన్ని మోసం చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. చిట్ ఫండ్ సంస్దలు ఏర్పాటు చేసుకొని సదరు కంపనీల యజమానులు వేలాది కోట్ల రూపాయలు ఆర్జించినట్లు తెలుస్తోంది. చిట్ ఫండ్ కంపనీలు ఏర్పాటు చేస్తారు. పేద ప్రజలను టర్గెట్ చేస్తారు. వీది వ్యాపారుల మీద కన్నెస్తారు. రోజు కొంత లాభసాటి వ్యాపారం చేసుకుంటూ పొదుపు చేసుకునే స్ధోమత వున్న వారిని గుర్తిస్తారు. వారి వద్దకు వెళ్లి చిట్టిలు కట్టేలా ఒప్పిస్తారు. ఒత్తిడి చేస్తారు. నమ్మకం కలిగిస్తారు. సొమ్ముకు భరోసా కల్పిస్తామని మాయ మాటలు చెబుతారు. ఎవరినో నమ్మిచిట్టిలు వేసి మోసపోవడం కన్నా, ప్రభుత్వం గుర్తించిన చిట్ ఫండ్ కంపనీలలో సొమ్ము భద్రమని నమ్మిస్తారు. అలా కొంత సమయం నమ్మకం వ్యాపారం చేసినట్లు జనాల విశ్వాసం పొందుతారు. ఒక్కొక్కరి చేత పలు చిట్లు వేయించి డిఫాల్లర్లుగా మార్చేస్తారు. సొమ్ములు ఎగ్గొట్టేందుకు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. చిట్స్ సమయం పూర్తయినా రకరకాల సంతకాల పేరుతో నెలల తరబడి జాప్యాలు చేస్తారు. చిట్ వేసిన వారి డబ్బులు ఎగ్గొట్టేందుకు వేయాల్సిన వేషాలన్నీ వేస్తారు. ఇదే సమయంలో పెరిగిన రియల్ బూమ్‌ను ఆసరాగా చేసుకొని చిట్ కంపనీలు ప్రజల సొమ్ముతో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశాయి. అటు చిట్స్ వ్యాపారం ఇటు, రియల్ వ్యాపారం జాయింట్‌గా చేస్తూ బాధితులను నిండా ముంచేశాయి. బాదితులకు ప్లాట్లు అంటగట్టి, వారి చేత మరింత సొమ్మును కట్టించుకున్నారు. అయినా వారికి ప్లాట్లు కూడా ఇవ్వకుండా వేదిస్తున్నారు. ఇలా కస్టమర్లను బాదితులను చేసి సొమ్ము చెల్లించకుండా నరకం చూపిస్తున్నారు. శవాల మీద పేలాలు ఏరుకొని తినేంతగా చిట్ కంపనీలు దిజగారిపోయాయి.
