మందమర్రి, నేటిధాత్రి:-
మండలంలోని అందుగుల పేటలో గల నయరా పెట్రోల్ బంక్ లక్కీ డ్రా విజేతగా నిలిచి, స్కూటిని గెలుచుకున్న మామిళ్ళ అరుణ్ కుమార్ కు శనివారం నయరా డిడిఎం క్షితీష్ సాహు బైక్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నయారా సంస్థ గత రెండు నెలలుగా పెట్రోల్ కస్టమర్లకు స్కీమును ప్రవేశపెట్టగా 200 పెట్రోల్ పోసుకున్న ప్రతి కస్టమర్ కు కూపన్ జారీ చేసి గెలుపొందిన వారికి పది రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు నగదు బహుమతి అందిస్తూ, లక్కీ డ్రా లో గెలుపొందిన వారికి స్కూటీని అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయరా సేల్స్ అధికారి కోట శివ, మనిజిత్ కిషోర్, నయారా డీలర్ కే శ్రావణ్ కుమార్, మేనేజర్ ఎన్ చంద్రశేఖర్, సేల్స్ మెన్ కుమార్, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భూబత్తుల శ్రీనివాస్ తో పాటు సభ్యులు పాల్గొని నయారా పెట్రోల్ బంక్ యజమాని శ్రావణ్ ను అభినందించి, సన్మానించారు.