డిఇఓ ఎన్. రాంకుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్ష డిఇఓ ఎన్. రాంకుమార్ తెలిపారు
జవహర్ నవోదయ లో ఆరవ తరగతి ప్రవేశం పొందుట కొరకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపాలపల్లిలో 238 మంది దరఖాస్తు చేసుకోగా 194 మంది విద్యార్థులు హాజరైనట్లు పరిషత్ ఉన్నత పాఠశాల కాటారం పరీక్షా కేంద్రంలో 1977 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 143 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ ఎన్. రాంకుమార్ ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్ రెడ్డి తెలియజేశారు. వారు రెండు పరీక్ష కేంద్రాలను సందర్శించి ప్రవేశ పరీక్ష నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వీరి వెంట డి సి ఇ బి సహాయ కార్యదర్శి భద్రయ్య పరీక్షల విభాగం కుసుమ కృష్ణమోహన్ పాల్గొన్నారు.