అన్ని గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలి
బలరాం నాయక్ కి ఏ బి ఎస్ ఎఫ్ ,స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వినతి పత్రం
హనుమకొండ జిల్లా ,నేటిధాత్రి:
ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
స్వేరోస్ ఇంటర్నేషనల్ హనుమకొండ మాజీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అయ్యే నవోదయ,సైనిక్ స్కూల్ లను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా మహాబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి నవోదయ ,సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని అందులో చదువుతున్న విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచి అర్హులైన విద్యార్థులను ఆదుకునే విధంగా పార్లమెంటులో చర్చించి విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు మరియు గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనీ అదేవిధంగా అన్ని గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా ఎంపీ గారిని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దొగ్గేల వినయ్, సునీల్ నాయక్, వెంకట్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.