నూతన పల్సర్ ఎన్ 150 బైక్ లాంచ్ చేస్తున్న నవీన్ రావు

వినియోగదారులకు నచ్చేలా బజాజ్ ఎన్ 150బైక్.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటి దాత్రి.

మోటార్ బైకు రంగంలో బజాజ్ కంపెనీ ప్రజలను, వినియోగదారులను ఆకర్షించే విధంగా తమ మోడళ్లను లాంచ్ చేస్తోందని,నూతనంగా లాంచ్ చేసిన పల్సర్ ఎన్150 యువతను అత్యధికంగా ఆకట్టుకునేలా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. సోమవారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని నాని మోటార్స్ షోరూంలో బజాజ్ పల్సర్ నూతన మోడల్ ఎన్ 150 బైక్ ను మునిసిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర రవి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుగులోత్ వెంకన్నలతో కలిసి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిరుచులు, వారి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా బజాజ్ తన ప్రొడక్ట్ ను ఉత్పత్తి చేస్తోందన్నారు. నూతనంగా లాంచ్ చేసిన బైకు కొత్త ఫ్యూచర్లతో, నూతన లుక్ తో యువతను ఆర్షించేలా ఉందన్నారు. ఈ సందర్భంగా షోరూం ప్రొప్రెటర్ బిక్కి వేణు కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం షోరూం ప్రొప్రెటర్ మాట్లాడుతూ కొత్త బైకు నూతన ఫీచర్లతో లాంచ్ అయ్యిందని, అదే విధంగా దసరా పండుగ నేపథ్యంలో మరిపెడ షోరూం నందు కొత్త ఆఫర్లను వినియోగదారులకు కల్పించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం సూపర్వైజర్ కొండ కృష్ణ, బజాబ్ ఫైనాన్సర్ మెరుగు రాము, శ్రీరామ్ మేనేజర్ కిషోర్, అసిస్టెంట్ మేనేజర్ ఉపేందర్, మెకానిక్ అనీల్, టీవీఎస్ షోరూం డీలర్ శ్రీనివాస్, హోండా షోరూం డీలర్ నగేష్, హీరో షో రూం డీలర్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!