మరిపెడలో ఉడ్ క్రాఫ్ట్ షాప్ ను ప్రారంభిస్తున్న నవీన్ రావు
యువత ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలి
– చేతి వృత్తులవారు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
మరిపెడ నేటిధాత్రి.
యువత ఉద్యోగాల సాధన పైనే కాకుండా వ్యాపారాల నిర్వహణపై కూడా దృష్టి సారించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.బుధవారం మరిపెడ పట్టణ కేంద్రంలో చోడోజు వీరభద్రా చారి నూతనంగా ఏర్పాటుచేసుకున్న ఉడ్ క్రాఫ్ట్ ఫర్నిచర్ షాప్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు కేంద్రమైన మరిపెడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందనన్నారు. పట్టణంలో యువత సరైన ప్రణాళికతో వ్యాపార రంగంలోకి దిగితే సులువుగా విజయం సాధించవచ్చని తెలిపారు.వ్యాపారాల నిర్వహణతోనే త్వరగా ఆర్థిక అభివృద్ధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే అనేక రకాలైన వ్యాపార సంస్థలు పట్టణంలో నెలకొని ఉన్నాయని,నూతనంగా ఏర్పాటైన శ్రీ వీరభద్ర ఉడ్ క్రాఫ్ట్ వర్క్ షాప్ వినియోగదారుల ఆదరణ పొంది వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.మారుతున్న కాలానికి అనుగుణంగా చేతి వృత్తుల వారు టెక్నాలజీ ని అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బీఆర్ ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్, మాసబత్తిని సతీష్,రేఖ వెంకటేశ్వర్లు,పానుగోతు వెంకన్న, కత్రోజు వెంకటాచారి,మాజీ ఎంపీటీసీ శ్రీరాముల రాములు,కట్టోజు అంజయ్య,రాగి సైదాచారి,బుచ్చయ్య,సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.