ఇసుక క్వారీల ప్రారంభానికి ముహూర్తం ఖరారు ఆనందంలో ఉమ్మడి మండల ప్రజలు.
ఇసుక రవాణాకు “మ్యానువల్ డంపింగ్ “ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు సిద్ధం. గ్రామ ప్రజలు క్వారీ యజమాన్యానికి సహకారం అందించాలి.
పలిమేల మహాదేవపూర్ గోదావరి కి ఆనుకొని ఆరు ఇసుక క్వారీలు ప్రారంభానికి అనుమతులు.
పెద్దంపేట ఇసుక క్వారీ పనులు ప్రారంభం, ఇసుక రవాణా కొరకు మాన్యువల్ పద్ధతిలో ఇసుక సిద్ధం చేస్తున్న యజమాన్యం.
క్వారీల యజమాన్యం గ్రామస్తులకు ప్రత్యేక ఉపాధి కల్పించాల్సిన అవసరం, మాన్యువల్ పద్ధతితో గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి.
ఇసుక రవాణా, క్వారీల నిర్వహణలో సమాచార సాంకేతిక అపుహాలను నమ్మి ప్రజలు అధికారులు మోస పోవద్దు, గత నాలుగు సంవత్సరాలు అపూహలతో ఉపాధికి కోల్పోయి అనేక ఇబ్బందులు.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న మహాదేవపు ఉమ్మడి మండలం లో 2016 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతం నుండి ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖజానా ఆదాయం సమకూర్చడం లో సఫలీకృతం కావడం జరిగింది. మరోవైపు ఉమ్మడి మండలంలోని ప్రజలకు సుమారు ఐదు సంవత్సరాల పాటు ఉపాధి కూడా లబ్ధి పొందడం జరిగింది. కోవిడ్ అనంతరం 2021 మహాదేవపూర్ నుండి అంబడ్ పల్లి వరకు గోదావరి సరిహద్దుకు కొనసాగిన సుమారు 14 క్వారీలు మూసివేయడం కాలేశ్వరం పరిధిలోని మరో 8 క్వారీలు మూసి వేసి నామమాత్రంగా క్వారీలు నిర్వహణ కొనసాగడం నేటికీ జరుగుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో క్వారీల మూసివేత ప్రభుత్వ ఖజానాకె, కాదు పేదా మధ్య తరగతి కుటుంబాలకు ఒకేసారి ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులకు దారి తీసే పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి మండల ప్రజలు ఇసుక క్వారీల ప్రారంభంతో తమకు ఉపాధి కలుగుతుందని గత మూడు సంవత్సరాల నుండి అనేక ఆశలు పెట్టుకొని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ ప్రజలకు ప్రకృతి సంపద తిరిగి ఆ పేద ప్రజలకు వరంగా మరే సందర్భం గ్రామంలో ఉపాధి ఉందే మరో సువర్ణ అవకాశం కలగడంతో ఆ ప్రజల్లో ఆనందానికి అంతు లేకుండా పోయింది. మహాదేవపూర్ ఉమ్మడి మండలం పలిమెల అంబడ్ పల్లి గ్రామాలకు ఆనుకుని ఉన్న గోదావరి నుండి ఇసుక రవాణాకు గత సంవత్సరం నవంబర్లో ఐదు ఇసుక క్వారీలు ఏర్పాటు చేస్తూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ప్రస్తుతం 6 నూతన ఇసుక క్వారీల్లో యజమానులు పనులు ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కుతమకు ఉపాధికి డొక లేదు అని హర్షం వ్యక్తం చేయక తప్పడం లేదు.
ప్రకృతి సంపద పనులు ప్రారంభం, పేదల కండల్లో ఆనందం.
ఇట్టకేలకు ఉమ్మడి మండల ప్రజల కల సహకారం అయింది. మూడు సంవత్సరాలుగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఆ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముక్తేశ్వరుడు కరుణించడం ఆ ముక్తిశ్వరుడి సన్నిధిలో పారుతున్న గోదావరి మండల ప్రజలకు ప్రకృతి సంపదలను అందించే విధంగా ప్రకృతి సంపద ఇసుక క్వారీల ప్రారంభం పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని వెళ్ళు విరిసేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహదేవ్పూర్ ఉమ్మడి మండలంలో 6 నూతన ఇసుక క్వారీలను ప్రారంభించుటకు టి ఎస్ ఎం డి సి శాఖ అంబడ్ పల్లి గ్రామ గోదావరి సరిహద్దు నుండి మొదలుకొని పంకెన గ్రామం వరకు, అంబడ్ పల్లి 2 అంబడ్ పల్లి 3, అంబడ్ పల్లి 4, పంకెన1,పంకెన2, పెద్దంపేట 1, పేర్లతో ఇసుక క్వారీలను ప్రారంభించుటకు యజమాన్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెండర్ దక్కించుకొని అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న యజమానులు ఇసుక రవాణాకు పనులను ప్రారంభం చేసుకునే క్రమంలో పడ్డారు. ఒక లక్ష మ్యాట్రిక్ టన్నులతో పాటు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అలాగే లక్ష అరవై వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను రవణ కొరకు శాఖ ఆరు క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో పాటు, మాన్యువల్ పద్ధతిలో ఇసుక రవాణా మరియు డంపింగ్, ట్రాక్టర్లలో స్థానిక ప్రజల నుండి ఇసుకను లోడ్ చేయడం లాంటి నిబంధనలతో ఆరు ఇసుక క్వారీలను ప్రారంభానికి అనుమతులు జారీ చేయడం తో పనులు కొనసాగించడం జరుగుతుంది.
ఇసుక క్వారీల ప్రారంభానికి ముహూర్తం ఖరారు ఆనందంలో ఉమ్మడి మండల ప్రజలు.
తెలంగాణ రాష్ట్ర వైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మహదేవ్పూర్ మండల పరిధిలో నూతన ఇసుక క్వారీలకు అనుమతులు పనులు ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు ముహూర్తం ఖరారు రావడంతో ఉమ్మడి మండల ప్రజల్లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సుమారు మూడు సంవత్సరాలుగా ఒకేసారి ఉపాధి కోల్పోయి వేయికండ్లతో ఉపాధి కొరకు చూస్తున్న ఆ నిరుపేద ప్రజలకు ఇసుక క్వారీల ప్రారంభం ప్రకృతి అందించిన వరం తో ప్రజలకు ఉపాధి ప్రభుత్వ ఖజానాకు ఆసరా చేసే ఇసుక క్వారీలు ఇసుక తరలింపునకు యజమాన్యం పనులు ప్రారంభిస్తూ మరికొద్ది రోజుల్లో ఇసుక రవాణాకు ముహూర్తం ఖరారు కావడంతో ఉపాధి లేక విలవిల బోయిన ఆ గ్రామాలు తమ గ్రామంలోని ఉపాధి కలిగే విధంగా ఇసుక క్వారీలు ప్రారంభం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిగతా క్వారీల ప్రారంభం కొరకు ఎదురు చూడడం జరుగుతుంది.
ఇసుక రవాణాకు “మ్యానువల్ డంపింగ్ “ప్రారంభం త్వరలో ఇసుక రవాణాకు సిద్ధం. గ్రామ ప్రజలు క్వారీ యజమాన్యానికి సహకారం అందించాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణా విషయంలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఇసుక రవాణాలో ఔకత్వకలను జరగకుండా చర్యలు చేపట్టే క్రమంలో మరోవైపు ఇసుక క్వారీలు నిర్వహించే ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలు ఉండడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కలిగేలా ప్రభుత్వం మరియు టిఎస్ఎండిసి శాఖ ప్రత్యేక నిబంధనలతో క్వారీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇసుక రావణాలకు మాన్యువల్ డంపింగ్ లోడింగ్ అన్ లోడింగ్ చేసే క్రమంలో మిషనరీ ఇలాంటి వాటిని నిషేధిస్తూ గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలతో లోడింగ్ చేసి ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుండి ఇసుక తీసుకువచ్చి డంపింగ్ చేసే విధానాన్ని అవలు పరచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టి ఎస్ ఎన్ డి సి అలాగే ప్రభుత్వం జారీ చేసిన మాన్యువల్ డంపింగ్ పద్ధతిని అనుసరిస్తూ ఇసుక క్వారీ యజమానులు ఆయా గ్రామస్తులతో ఇసుక డంపింగ్ పనులు చేపట్టే క్రమంలో పడ్డారు. ఇక ప్రస్తుతం మహాదేవపూర్ మరియు పలిమెల గోదావరి ప్రాంతాల్లో నిర్వహించ పడుతున్న ఇసుక క్వారీలకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోకుండా ప్రజలు ఇసుక డంపింగ్ వ్యవహారంలో కూలి విషయాలతో పాటు ఇతర రవాణా సౌకర్యాలకు సంబంధించి గ్రామస్తులు క్వారీల యజమానులతో పాక్షికంగా వ్యవహరిస్తూ కూలి గిట్టుబాటు తోపాటు ఇతర వ్యవహారాలను యజమానులతో చర్చించి ప్రజలు మరియు వారి యజమానుల సమన్వయం పాటిస్తూ ఉపాధి కోల్పోకుండా ఇసుక క్వారీల యజమానులకు డంపింగ్ వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్తుల సహాయ సహకారాలు అందిస్తూ ఇసుక క్వారీల నిర్వహణ సాఫీల జరిగేలా ప్రజలు మరియు యజమాన్యులు కలిసి నడవాల్సిన అవసరం ఉంది.
పలిమేల మహాదేవపూర్ గోదావరి కి ఆనుకొని ఆరు ఇసుక క్వారీలు ప్రారంభానికి అనుమతులు.
గత మూడు సంవత్సరాల క్రితం ఉమ్మడి మండలంలో వాహనాల అలజడి ప్రజల అండల్లో ఆనందం ఎటు చూసినా ఏదో ఒక పనిలో నిమగ్నమైన గ్రామీణ ప్రజల ఆ కల మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. టీఎస్ ఎంబీసీ శాఖ గత సంవత్సరం నవంబర్లో మహాదేవపూర్ ఉమ్మడి మండలం వీడిగడ్డ ప్రాజెక్ట్ గోదావరి వద్ద ఆరు నూతన ఇసుక క్వారీలను మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థానిక అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇసుక కాంట్రాక్టర్లు క్వారీలను టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకున్న అనంతరం ఎన్నికల నిబంధన అమలులో ఉండడంతో ముందుకు సాగించలేక పోవడం జరిగింది. తిరిగి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇసుక క్వారీల రవాణా అవకతవకల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ప్రభుత్వం మాన్యువల్ పద్ధతిని అనుసరిస్తూ నూతన 6 క్వారీల నిర్వహణకు అగ్రిమెంట్ చేస్తూ టిఎస్ఎండిసి శాఖ ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చింది. అంబడ్ పల్లి,2,3,4, లింకల గడ్డ 1,పంకేన,1,2 పేర్లతో ఆరు ఇసుక క్వారీలు 160 మ్యాట్రిక్ టన్ లక్ష క్యూబిక్ మీటర్లు నాలుగు క్వారీలకు కేటాయిస్తూ మరో రెండు క్వారీలకు నాలుగు లక్షల మెట్రిక్ టన్ ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుటకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇసుక క్వారీల యజమానులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం ఇసుక డంపింగ్ మాన్యువల్ పద్ధతిలో ప్రారంభించి ఇసుక రవాణా కొరకు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నం కావడం జరిగింది.
పెద్దంపేట ఇసుక క్వారీ పనులు ప్రారంభం, ఇసుక రవాణా కొరకు మాన్యువల్ పద్ధతిలో ఇసుక సిద్ధం చేస్తున్న యజమాన్యం.
మహదేవ్ గుమ్మడి మండలంలో ఇసుక రవాణా నూతనంగా ఏర్పాటు చేయబడిన ఇసుక క్వారీలు మెన్యువల్ పద్ధతిలో ఇసుక డంపింగ్ పనులు ప్రారంభించడం తో గ్రామస్తులు ఉపాధి పొందడం ఆనందంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరు ఇసుక క్వారీల్లో గత పది రోజుల నుండి పెద్దంపేట ఇసుక క్వారీ 160 మ్యాట్రిక్ టన్ లక్ష క్యూబిక్ మీటర్ల అనుమతి కలిగి ఉన్న ఈ క్వారీ స్థానికులకు ఉపాధి కల్పిస్తూ గోదావరి నుండి డాక్టర్లలో మాన్యువల్ పద్ధతి ద్వారా గ్రామస్తుల తో ఇసుకను నింపి రవాణా కొరకు స్టోర్ చేయడం ప్రారంభించడం జరిగింది. మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ విషయంలో గ్రామానికి చెందిన అనేకమంది ఉపాధి పొందడంతోపాటు వారికి గిట్టుబాటు ధర కూలి అందడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేయక తప్పడం లేదు. పెద్దంపేట ఇసుక క్వారీ మరి కొద్ది రోజులపాటు మాన్యువల్ పద్ధతితో ఇసుకను స్టోర్ చేసి రవాణా చేయుటకు సిద్ధంగా ఉంది. అలాగే ఇతర ఐదు క్వారీలు కూడా ఇసుక స్టోర్ కొరకు భూముల లీజు వ్యవహారంతో పాటు గ్రామస్తులతో కూలి విషయంలో చర్చలు అలాగే ట్రాక్టర్ లోడింగ్ వ్యవహారంపై గిట్టుబాటు ధర తోపాటు రహదారి కొరకు భూముల లీజు లాంటి పనుల్లో ఇతర క్వారీల యజమానులు ఒప్పందాల కొరకు చర్చించుకోవడం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో మిగతా ఇసుక క్వారీలు కూడా ప్రారంభం కానున్నాయి.
క్వారీల యజమాన్యం గ్రామస్తులకు ప్రత్యేక ఉపాధి కల్పించాల్సిన అవసరం, మాన్యువల్ పద్ధతితో గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి.
ప్రస్తుతం ఉమ్మడి మహాదేవపూర్ మండలంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆరు ఇసుక క్వారీల కు సంబంధించి కాంట్రాక్టర్లు పలు క్వారీల ఇసుక డంపింగ్ మాన్యువల్ పద్ధతి ద్వారా ఇప్పటికీ పనులు ప్రారంభం కావడం జరిగింది అలాగే మరికొన్ని ఇసుక క్వారీలు ప్రారంభానికి మూసుకోలేదు. ప్రధానంగా గ్రామస్తులకు సంబంధించి మాన్యువల్ పద్ధతిలో ఇసుక లోడింగ్ వ్యవహారంలో గ్రామస్తులు కూలి విషయంలో వేయడం తోపాటు భూముల లీజు విషయాల్లో అలాగే స్థానిక ట్రాక్టర్ల ద్వారా గోదావరి నుండి ఇసుక రవాణా చేసి స్టోర్ చేసే వ్యవహారం ధర నిర్ణయంపై సుముఖత లేకపోవడం క్వారీల ఆలస్యానికి కారణమని చెప్పవచ్చు. క్వారీ యజమానులు మారుమూల ప్రాంత ప్రజలకు ఉపాధి విషయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇసుక క్వారీల నిర్వహణ కాంట్రాక్టర్లకి కాకుండా ప్రజలతో పాటు ప్రభుత్వా ఆదాయానికి కూడా ఎంతో ఆసరా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు స్థానిక ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మానువల్ పద్ధతి స్థానిక ప్రజలకు అలాగే ఇతర వాహన దారులకు కూడా ఒక వరంగా భావించాల్సిన అవసరం ఉంది. మానువల్ పద్ధతిలో ఒక ఇసుక క్వారీలో సుమారు ప్రతిరోజు 200 ఒక ట్రాక్టర్ లు సుమారు 30 ట్రిప్పులు ఒక్కొక్క ట్రాక్టర్కు 20 నుంచి 40 కూలీలతో మాన్యువల్ పద్ధతి ద్వారా ఇసుక రవాణాకు అవసరం పడుతుంది అని అంచనా. దీని ప్రకారం 6 ఇసుక క్వారీలకు సుమారు 1200 ట్రాక్టర్లు అలాగే సుమారు మూడు వందల నుండి 450 వరకు ప్రతిరోజు గ్రామస్తులకు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాక్టర్ మరియు కూలీల ధర విషయానికొస్తే ఒక ట్రాక్టర్ 30 ట్రిప్పులకు ట్రిప్పుకు 200 నుండి 350 రూపాయల వరకు యాజమాన్యం అందిస్తే ఒకరోజు 6000 నుండి 9000 వరకు ట్రాక్టర్ కిరాయి అలాగే కూలింగ్ విషయానికొస్తే 150 రూపాయల నుండి 250 రూపాయల వరకు సుమారు 30 ట్రిప్పుల విషయానికొస్తే ఒక్క కూలికి 1500 నుండి 2500 రూపాయల వరకు ఒక్కరోజు కూలి పొందే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్ మరియు గ్రామ ప్రజలు పై తెలిపిన ధర కూలి మరియు కిరాయిలకు సంబంధం లేకుండా వారి యొక్క కష్టాలను ఎండ తీవ్రత దృశ్య పని ప్రభావాన్ని గుర్తించి గ్రామస్తులు ఏకతాటిపై వచ్చి చర్చించుకున్న అనంతరం వారి నిర్ణయం మేరకు ముందుకు సాగడం ఉత్తమం. కానీ ఇసుక క్వారీ నిర్వహణ యజమాన్యానికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామస్తులు అలాగే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇసుక రవాణా ఆదాయాన్ని సంపూర్ణంగా అందేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఇసుక రవాణా, క్వారీల నిర్వహణలో సమాచార సాంకేతిక అపుహాలను నమ్మి ప్రజలు అధికారులు మోస పోవద్దు, గత నాలుగు సంవత్సరాలు అపూహలతో ఉపాధికి కోల్పోయి అనేక ఇబ్బందులు.
ఇసుక రవాణా విషయంలో కాంట్రాక్టర్ మరియు గ్రామస్తులు ప్రత్యేకంగా టీఎస్ఎండిసి అధికారులు ఇసుక రవాణా విషయంలో క్వారీల నిర్వహణపై సాంకేతిక సమాచార మాధ్యమంలో అనేక అపూహలు రావడ జరుగుతుంది. కానీ అపూహలకు నమ్మి పేద ప్రజలకు ఉపాధికి దూరం చేసే విధంగా అధికారులు మరియు కాంట్రాక్టర్లు అపూహలు నమ్మి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు. సమాచార సాంకేతిక మాధ్యమంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఇసుక రవాణా విషయంలో అనేక అపోహల కు సంబంధించి పోస్టులు రావడంతో పాటు పలువురు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడం కూడా జరుగుతుంది. అలాంటి సందర్భంలో కాంట్రాక్టర్ మరియు అధికారులు ఇబ్బందులకు గురికాకుండా స్థానిక ప్రజల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇసుక క్వారీలు నిర్వహించ బడి గ్రామాల ప్రజలు కూడా అపూహలను నమ్మి ఇసుక క్వారీల యజమానులపై నిరాశకు గురికాకుండా ఆయా గ్రామాల ప్రజలు టీఎస్ఎండిసి శాఖ తోపాటు ఇసుక క్వారీల నిర్వాహకులకు అపోహలపై వారికి సహకరించే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. గతంలో నిర్వహించిన ఇసుక క్వారీలకు కూడా అనేక అపూహలతో నిర్వాహకులకు ఇబ్బందులకు గురి చేయడం భరించలేని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు క్వారీలను వదిలిపెట్టి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం స్థానిక ప్రజలు ఉపాధిని కోల్పోయి నేటికీ అనేక ఇబ్బందులు పడినటువంటి సందర్భం ప్రస్తుతం ప్రజల దగ్గరే ఒక సాక్ష్యంగా ఉంది. కాలేశ్వర ముక్తేశ్వరుని ఆశీస్సులతో కొత్తగా ఏర్పాటు అయిన ఆరు ఇసుక క్వారీలకు మండల ప్రజలంతా యజమానులకు సహాయ సహకారాలు అందిస్తూ సంపూర్ణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక క్వారీల నిర్వహణ కొరకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ సంపూర్ణంగా ఇసుక క్వారీ నిర్వహణ కొనసాగించేలా చేయడం యావత్ మండల ప్రజలకు రాబోయే మరో మూడు నుండి నాలుగు సంవత్సరాల వరకు ఉపాధికి ఎలాంటి డొక లేకుండా కొనసాగుతుందని గ్రామాల్లోని ఉపాధితో కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా తమ జీవితాలు కొనసాగుతాయి అన్న విషయాన్ని మండల ప్రజలు ప్రత్యేకంగా క్వారీలు ఏర్పాటు చేయబడిన గ్రామాల ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.