ప్రభుత్వ దవాఖానాలలో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలి

కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి,

జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య,

జనగామ, నేటిధాత్రి:-
ప్రభుత్వ దవాఖానాలలో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు, ప్రజలకు అందుతున్న ప్రజా వైద్యంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్, జఫర్ గడ్, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, బచ్చన్నపేట ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పక్కాగా నార్మల్ డెలివరీలు ( సహజ ప్రసవాలను) ప్రోత్సహించాలని అందుకు వైద్య సిబ్బంది గ్రామ, వార్డు స్థాయిలలో పక్క ప్రణాళికతో పని చేయాలని సూచించారు, జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో షెడ్యూల్ ప్రకారము వైద్య తరగతులు నిర్వహించి కళాశాలలో కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు,
ప్రభుత్వ వైద్య శాలలో ఆత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించినందున ప్రజలకు వాటిపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు తీసుకొనుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామాల్లో పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు.
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నిరంతర వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాలరావు, కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్ డాక్టర్, పి.సుగుణాకర్ రాజు, డాక్టర్ అనురాధ, డిప్యూటీ డిఎంహెచ్వోలు, డాక్టర్ రవీందర్, డాక్టర్ అశోక్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ సుధీర్, డాక్టర్ మల్లికార్జున్, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కరుణాకర్ రాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!