మొగుళ్ళపల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి
మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ మొట్లపల్లి పాఠశాలలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారిచే మొగుల్లపల్లి, మొట్లపల్లిలో. ఎన్.సి.సి. విద్యార్థులకు ,విపత్తులు,వాటి నివారణ చర్యలు అవగాహన కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి. లింగాల కుమారస్వామి, పాల్గొని మాట్లాడుతూ మానవ తప్పిదాలు లేదా ప్రకృతి,వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, సునామిలు, భూకంపాలు, వచ్చినపుడు ఏ విధంగా అప్రమత్తం కావాలో ఎన్.సి.సి విద్యార్థులుగా,మీరు ఏ విధoగా నివారించాలో, ప్రయోగాలు చేసి ఎన్.డి.ఆర్.ఎఫ్.బృందం విద్యార్థులకు విపత్తుల నివారణ చర్యలను గురించి ఆచరణాత్మకంగా చూపించి విద్యార్థులకు కళ్లకు కట్టినట్టుగా చూపించడమే కాకుండా విద్యార్థులు కూడా ఆచరింప చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సి హెచ్ రఘు, మొగుల్లపల్లి ఎన్ సీసీ అధికారి
జి రాజయ్య, ఎన్డీఆర్ఎఫ్. అధికారి సుశాంత్ కుమార్, ఎన్టీఆర్ఎఫ్ బృందం, సీనియర్ ఉపాధ్యాయులు నరసింహ స్వామి, సంపత్ కుమార్ , వీరయ్య, రవీందర్, ఉమారాణి, గ్లోరీ రాణి, శకుంతల, శోభారాణి, కవిత, సందీప్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.