జైపూర్ నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామపంచాయతీ గోపాల్ పూర్ కు చెందిన జుమ్మడి మహేందర్ s% రాజయ్య ను గుడుంబా విక్రయ దారునిగా అనుమానిస్తూ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు మంచిర్యాల డివిజన్ ఎక్సైజ్ శాఖ ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గుడుంబా క్రయ విక్రయ అనుమానిత కుటుంబాలను మంచిర్యాల డివిజన్ ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. కాగా జూమ్మడి మహేందర్ గుడుంబా క్రయ విక్రయాలకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేక ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ తహసీల్దార్ ప్రసాద్ వనజా రెడ్డి ఎదుట బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్, ప్రసాద్,మహేష్ ప్రణీత మంచిర్యాల అబ్కార్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.