-బిజెపి మతతత్వ=కార్పొరేట్ విధానాల ను ఎండగడదాం
-ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
-జిల్లా కార్మిక సంఘాల పిలుపు.
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశయిపల్లి గ్రామంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని మండల సి ఐ టి యు కన్వీనర్ గురజాల శ్రీధర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ సామాన్య ప్రజానీకం మరియు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఫిబ్రవరి 16 దేశవ్యాప్త కార్మికుల సమ్మె=గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని జాయింట్ కార్మిక సంఘాలు, సంయుక్త కిషన్ మోర్చాకిలాభారత స్థాయిలో నిర్ణయించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, మరియు వేములవాడలో రెండు నియోజకవర్గాల కేంద్రంగా ఉదయం 10 గంటల వరకు రెండు నియోజకవర్గాల కార్మికులు కర్షకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపునివ్వడం జరుగుతుంది.
కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చే పది సంవత్సరాలు పూర్తయింది, అయినా రైతాంగం, కార్మిక వర్గ, ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. భారత్ వెలిగిపోతుంది, వచ్చేదిఅయేగా, విశ్వ గురు, ఆత్మ నిర్భార్భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చి ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం మోసం చేసుకుంటా వస్తుంది, బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ హామీ ఇచ్చింది, ఆమెని తుంగలో దొరికింది. సామాన్య ప్రజానీకం పై విపరీతమైన అధిక ధరలు పెంచి జీవన్ ప్రమాణాలను దెబ్బతీసింది. ఇలా అనేక రకాలుగా బిజెపి ప్రభుత్వం కేవలం బడా కార్పొరేట్ శక్తులకే కొమ్ముగాసింది తప్ప సామాన్య ప్రజానీకానికి, కార్మిక వర్గానికి చేసిన పనులు ఏమీ లేవు, కావున ఇవన్నీటికి వ్యతిరేకంగా గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, అమాలి సంఘం అధ్యక్షులు కుర్మా రవి, కుర్మా రాజేష్, కుర్మా సంజీవ్, కుడుకాల గిరిబాబు, బుర్గు పర్శరములు, బూరుగు రమేష్. చంద్రకాంత్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.