Koundinya Maharshi Jayanti Celebrated Grandly
ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు
నర్సంపేట,నేటిధాత్రి:
కార్తీక పౌర్ణమి రోజున జన్మించిన గౌడ కులగోత్రం,గౌడవంశం మూల పురుషుడు కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలను గౌడ కుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపా వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్ గౌడ్ నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యుగంలో ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన వినాశకరమైన విపత్తులు వచ్చినప్పుడు మానవ వినాశనం, దైవ వినాశనం, వృక్ష వినాశనం నుంచి ప్రజల్ని కాపాడడం కోసం అవతరించిన పరమేశ్వర ప్రసాది కౌండిన్య మహాముని అని పేర్కొన్నారు. దైవ గౌడ జాతి ఆవిర్భావానికి మూలపురుషుడు గౌడ గోత్రదారి నేటికీ ఏకకుల గోత్రనామ దయంతో దేశవ్యాప్తంగా గౌడ జాతి పిలవబడుతుందని తెలిపారు.కార్తీకమాసంలో గౌడ కుల గోత్ర పూజ, గౌడ కులదైవాలను ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో దేశవ్యాప్తంగా వర్ధిల్లేల ఆశీర్వదించే పవిత్రదినం కార్తీక పౌర్ణమి రోజు అని తెలియజేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
