
వేడుకల్లో పాల్గొన్న మండల తహసిల్దార్ తిరుమలరావు
వీణవంక, ( కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి:వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులచే అధికారులు ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ కూడలి వద్ద చేరుకొని
, మానవహారం ఏర్పడి, ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు
వీణవంక గ్రామంలోని వృద్ధ ఓటర్లకు అధికారులు పూలమాలవేసి,శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం తహసిల్దార్ తిరుమల్ రావు మాట్లాడుతూ…సామాన్యుడికి ఓటు హక్కు వజ్రాయుధం అంటూ, ఓటు మనందరి హక్కు అని, 18 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కలిగి ఉండాలని, ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, ఓటుతోనే ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని, యువత ఓటును ఆయుధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిష్పక్షపాత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి ,కులం ,వర్గం ,భాష తేడా ఎటువంటి ఒత్తిడి లను ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేసినారు. ఈ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనాథ్, బిఎల్వోలు, ఇతర శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.