బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్
గొల్లపల్లి నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన సదస్సును బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటర్లే పాలకులని, ఓటు హక్కు మనందరి జన్మ హక్కు,దేశ భవిష్యత్ బాగుండాలంటే నిజాయితీగా ఓటు వేయాలని అన్నారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులను వినియోగించుకోవడం చాలా ముఖ్యమని అందులో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవడం తమ బాధ్యతగా భావించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం మని,ఓటు హక్కు విలువ ప్రతి ఒక్కరు గుర్తించి దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా రాష్ట్ర శిక్షణ సమన్వయకర్త తాడూరి శ్రీనివాస్ చారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లయ్య,జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి రావు, ప్రతిమ ఫౌండేషన్ మండల ఆర్గనైజర్ దోనకొండ చందు,విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు,పాల్గొన్నారు.