చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ లో బుధవారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల సందర్భంగా నోబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత ప్రఖ్యాత భౌతిక శాస్త్ర పితామహుడు స్వర్గీయ సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి పాఠశాల కరస్పాండెంట్ రాజ్ మహమ్మద్ ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే ప్రయోగాలు చేయడము నేర్చుకోవాలి కలలు కనాలి కలలునిజం చేసుకోవాలి ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన వకృత పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం గుండా రమేష్ భాస్కర్ శివరాజ్ పరమేశ్వరి శైలజ రేణుక మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.