నవోదయ హైస్కూల్ లో నేషనల్ సైన్స్ డే వేడుక

విక్షిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలు

శాయంపేట నేటి ధాత్రి;

శాయంపేట మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులతో తయారు చేసినటువంటి పాఠ్యంశం కృత్యాలు ప్రయోగ ప్రదర్శనలు జాతీయ సైన్స్ దినోత్సవం 1987 నుండి రామన్ ఎఫెక్ట్ యొక్క ఆవిష్కరణ జ్ఞాపకార్థం మరియు దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు.
డ్రాయింగ్, ఫ్యూచర్ సైన్స్ అధునాతన సాంకేతికతలపై వ్యాసాలు రాయడం, అన్ని తరగతుల విద్యార్థులు తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యంతో అన్ని మినీ వాక్యూమ్ క్లీనర్, మినీ ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫికేషన్, పాత నాణేలు, ప్రొటీన్ న్యూట్రిషన్ ఫుడ్స్, మైక్రోస్కోప్ వంటి వివిధ రకాల ప్రయోగాలను ప్రదర్శించారు. నేచురల్ గెట్ కాయిల్, గ్యాస్ వెల్డింగ్, ఎర్త్ క్వేక్ డిక్టేటర్, విండ్ ఎనర్జీ, చంద్రయాన్ 3, సోలార్ పవర్ మరియు మరెన్నో, ఎగ్జిబిట్స్ ఇంఛార్జ్ ఆకుల శివ(ఫిజిక్స్), సౌమ్య(జనరల్ సైన్స్) ఈ కార్యక్రమంలో అందరు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు, విద్యార్థులందరూ పాల్గొన్నారు ప్రధానోపాధ్యాయురాలు మామిడి పృధ్వి చేతుల మీదుగా బహుమతులు అందజేసారు, దర్శకురాలు మామిడి అనురాధ,మామిడి పృధ్వి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోనే భవిష్యత్తు ఉంటుందని, కాబట్టి రాబోయే సంవత్సరాల్లో పాఠశాలలో కొత్త ఆచరణాత్మక విధానంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు అధిక మొత్తంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!