జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిపెడ మండలం ఏపిఓ ను బదిలీ చెయ్యాలి
సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిఆర్డిఓ పిడి కి వినతి పత్రం
మరిపెడ నేటిధాత్రి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరిపెడ మండలం ఏపీఓ గా విధులు నిర్వహిస్తున్న మంగమ్మ దీర్ఘకాలికంగా ఒకే చోట గత 13 సంవత్సరాలుగా పనిచేస్తూ వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ మరిపెడ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి అవకతవకలు ఇటీవల కాలంలో భారీ స్థాయిలో బయటపడటం తన సొంత మండలం లోని తాను దీర్ఘకాలంగా పనిచేయడం వలన రాజకీయ ప్రాబల్యం ఉండటం వలన సాధారణ బదిలీలు జరిగిన కూడా తాను ఇక నుండి బదిలీ కాకుండా మళ్లీ ఇదే చోట యధావిధిగా పోస్టింగ్ లో కొనసాగుతూ వస్తుంది రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీలల్లో అందరూ ఏపీఓ లు నాలుగు ఐదు సంవత్సరాలకి ఇతర మండలాలకు బదిలీ అయినారు కానీ మరిపెడ ఏపీవో మాత్రం గత 13 సంవత్సరాల నుండి మరిపెడ మండలం నుండి బదిలీ కాలేదు ఈ మండలం నుండి బదిలీ చేయాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.