బసవరాజు శిల్పకళలకు జాతీయ గుర్తింపు
◆:- జిల్లా కళాకారుడికి అరుదైన గౌరవం
◆:- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రానికి చెందిన హోతి బసవరాజు చెక్కిన అందమైన రాతి శిల్పాలకు ప్రాణం పోసినట్లుగా చెక్కిన ఈ శిల్పాలకు జాతీయ గుర్తింపు లభించింది. బసవరాజుకు చిన్నతనం నుంచి శిల్పకళలపై మక్కువ ఉండటంతో ఆయన ఆ కళల వైపే పరుగులు తీశాడు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే — సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ గ్రామానికి చెందిన బసవరాజు 19 జూన్ 1979లో జన్మించారు. బసవరాజు తండ్రి అడిగప్ప టీచర్ వృత్తిలో కొనసాగుతుండగా, ఆయన శిల్పకళపై దృష్టి సారించారు. తండ్రి ప్రోత్సాహంతో, తల్లి ఆప్యాయతతో చదువు ముందుకు సాగిస్తూనే శిల్పకళపై ప్రేమ పెంపొందించుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో శిల్పకళలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

రాజు చెక్కిన రాతి శిల్పాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బసవరాజు చెక్కిన శిల్పాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో 98వ జాతీయ ఆర్ట్స్ దినోత్సవానికి ఆహ్వానం అందింది. శిల్పకళలు చెక్కడంలో నైపుణ్యత సాధించిన బసవరాజుకు డాక్టరేట్ బిరుదు కూడా లభించింది.

డాక్టర్ బసవరాజు చెక్కిన శిల్పాలలో విధి శిల్పాలు, సామాజిక సందేశాలతో పాటు ప్రకృతి పరిరక్షణ, చెట్ల పెంపకం, పశు–పక్షాదుల రక్షణ, కాలుష్య నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించేలా ఈ శిల్పాలు చెబుతుంటాయి.

ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ నిర్వహించే సొసైటీ భవనంలో ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు సుష్మా కపూర్ ఆర్ట్స్ אַד్వైజర్ మరియు కన్సర్వేషన్ అధికారి చేత ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనలో శిల్పి డాక్టర్ బసవరాజు రూపొందించిన రెండు కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నాయి — అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవులు–జంతువులు–జలాల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిపాదించేలా రూపొందించిన ఈ శిల్పాలు జాతీయ స్థాయిలో గుర్తింపును తెస్తాయని డాక్టర్ బసవరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
