పటిష్ట విదేశంగ విధానంతో పెరిగిన దేశప్రతిష్ట

రక్షణ రంగంలో స్వావలంబనం

పొరుగుదేశాలకే మొదటి ప్రాధాన్యత

 యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ ద్వారా తూర్పు, ఆగ్నేయాసి దేశాల సంబంధాలకు ప్రాధాన్యం

 అమెరికాతో సంబంధాలు బలోపేతం

 పుతిన్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా మోదీ

 ‘ఇది యుద్ధాల కాలం కాదు’ అని పుతిన్‌కు చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ

 డోనాల్డ్‌ ట్రంప్‌కు మంచి మిత్రుడిగా మోదీ

 అగ్రరాజ్యాలను మనేజ్‌ చేయడంలో అసమాన ప్రతిభ

 దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి రక్షణరంగం వృద్ధి

 ప్రత్యేక ఆహార్యంతో ప్రపంచ నాయకులను ఆకర్షించే ఛరిష్మా నాయకుడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారాల్లో ఎప్పుడూ తాను అనుసరించబోయే విదేశాంగ విధానంపై పెద్దగా చెప్పిందేమీ లేదు. ఎక్కువగా దేశీయ, రాష్ట్రీయ అంశాలపై విపక్షాలపై విమర్శల దాడులకే పరిమితమయ్యారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నరేంద్రమోదీ అనుసరిస్తున్న విదే శాంగ విధానానికి మూలాలు నాటి కాంగ్రెస్‌ ప్రధాని పి.వి.నరసింహారావు అనుసరించిన విదేశాంగ విధానంలో ఉన్నాయి. ఆయన అనుసరించిన పొరుగుదేశాలకు ప్రాధాన్యత, లుక్‌ ఈస్ట్‌ పాలసీని, తర్వాత ప్రధాన పదవిని చేపట్టిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి అనుసరించారు. తర్వాత మన్మోహన్‌ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడిచింది. దాన్నే ఇప్పుడు నరేంద్రమోడీ కొనసాగిస్తున్నారు. కాకపోతే పి.వి. ప్రతిపాదించిన ‘లుక్‌ ఈస్ట్‌’ పాలసీని ‘యాక్ట్‌ ఈస్ట్‌’ పాలసీగా మార్చి మోదీ అమలు చేస్తున్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘డిజిటల్‌ ఇండియా’ నినా దాలతో భారత ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగం గా ఆయన ప్రధమ ప్రాధాన్యత ఆగ్నేయాసియా దేశాలకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడం, తూర్పు మరియు ఆగ్నేయాసియా దేశాలతో నెరపే వాణిజ్యం దేశానికి ఎంతో లాభసాటిగా వుంటుందన్న సత్యాన్ని గుర్తించడమే. దీన్ని మొట్ట మొదట గుర్తించింది తెలంగాణ బిడ్డ పి.వి. నరసింహారావు. కాగా మోదీ ప్రభుత్వం ఇస్లామిక్‌ దేశాలకు కూడా సన్నిహితం కావడానికి యత్నించి సఫలీకృతమైంది. బహ్రైన్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి మధ్యప్రాచ్య దేశాలతో నేడు మన సంబంధాలు ఎంతో పటిష్టంగా కొనసాగుతున్నాయంటేమన విదేశాంగ విధానంలోని పటిష్టతే కారణం. ఇదే సమయంలో మనకు ఇజ్రాయిల్‌ అ త్యంత ఆప్తమిత్ర దేశం. 

అమెరికాతో సంబంధాలు బలోపేతం

నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక అమెరికాతో మన సంబంధాలు మరింత బలోపేతమయ్యా యి. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా…ఒకవేళ మోదీ ప్రధాని అయితే యు.ఎస్‌.తో మన సంబంధాలు ఎట్లా వుంటాయోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే మోదీగుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో నాటి యు.ఎస్‌. అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ప్రభుత్వం మోదీకి వీసా నిరాకరించింది. ఈ అనుమానాలకు ప్రధాన కారణమిది. అయితే ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ గెలుపు పవనాలు మోదీకి అనుకూలంగా వున్న సంగతిని పసిగట్టిననాటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌, ప్రధాని అభ్యర్థిగా వున్న నరేంద్ర మోదీని స్నేహ పూర్వకంగా కలిశారు. తర్వాత అప్పటి యు.ఎస్‌. అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఎన్డీఏ కూట మి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి మాట్లాడమే కాకుండా యు.ఎస్‌.కు ఆహ్వానించారు. తప్పుడు ప్రచారాలను నమ్మి వీసా నిరాకరించిన యు.ఎస్‌. తనకు తానే వీసా రద్దును ఎత్తివేసి మోదీలోని నిలువెత్తు నిజాయతీకి నిదర్శనం. తర్వాత అధికారంలోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌తో కూడా నరేంద్ర మోదీ బలమైన స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. 

తొలిసారి ప్రధాని అయ్యాక దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా బ్రిక్స్‌,ఆసియన్‌, జి`20 సదస్సులకు హాజరయ్యారు. తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటగా ఆయన సందర్శించిన దేశం నేపాల్‌. ఈ సందర్భంగా నేపాల్‌కు ఒక బిలి యన్‌ డాలర్ల సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు. తర్వాతి కాలంలో నరేంద్రమోదీ అమెరికాలో చాలాసార్లు పర్యటించి ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కృషిచేశారు. భారత్‌`బాంగ్లాదేశ్‌ ఎన్‌క్లేవ్స్‌ (వీటినే చిత్‌మహల్స్‌ లేదా పాషా ఎన్‌క్లేవ్స్‌ అనికూడా పిలుస్తారు) ఒప్పందానికి 2015లో భారత పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం మన్మోహన్‌ సింగ్‌ హయాంలో జరిగింది. మణిపూర్‌ రాష్ట్రం గుండా మయన్మార్‌కుభూ అనుసంధానతకు వీలు కల్పించే ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయడంతో ఈ విషయంలో ఎన్నోఏళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడిరది. 2020లో గాల్వాన్‌ సంఘటన తర్వాత భారత్‌`చైనా సంబంధాలు బాగా క్షీణించాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు 900 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ను రెండుసార్లు సందర్శించారు. అక్కడి ప్రభుత్వం ప్రధానికి ఆదేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 2022 నాటికి ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌లు మంచి మిత్రులుగా మారిపో యారు. 2023లో జీ`20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆఫ్రికన్‌ యూనియన్‌ దేశాలు జీ`20లో శాశ్వత సభ్యత్వాన్ని పొందాయి. మోదీ నేతృత్వంలో భారత్‌ గ్లోబల్‌ సౌత్‌ నాయకురాలిగా ఎదగడమే కాదు, ఈ ప్రాంత దేశాల వాణిని వినిపించడం మొదలుపెట్టింది. 

రక్షణరంగంలో స్వయం సమృద్ధి

మోదీహయాంలో మనదేశ రక్షణరంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే రెండో దేశంగా కొనసాగుతున్న ప్పటికీ, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధన యత్నాలు మొదలై చివరకు చాలా వరకు సఫలీకృతం కావడమే కాకుండా, రక్షణ రంగ ఉత్పత్తును విదేశాలకు ఎగుమతి చేసేస్థాయికి ఎదగడం గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. మోదే ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పుణ్యమానిరక్షణరంగ పరికరాల తయారీలో భారత్‌ గణనీయమైన ప్రగతి సాధించింది. షెకత్కార్‌ కమిటీ సిఫారసులను కచ్చితంగా అమలు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం రక్షణరంగాన్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరణ, స్వయం సమృద్ధి సాధన దిశగా మన రక్షణ రంగాన్ని ముందుకు నడిపింది. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్‌తో మన వ్యవహారశైలి పూర్తిగామారిపోయింది. ఉగ్రవాద దేశానికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పే విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోంది. 2020లో గాల్వన్‌ లోయ సంఘర్షణ తర్వాత, 2021 జనవరిలోకూడా భారత్‌`చైనా దళాల మధ్య సంఘర్షణ చోటుచేసుకుంది. చైనా దళాలను మన జవాన్లు తరిమికొట్టిన వీడియోలు కూడా సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇదిలావుండగా 2021లో భారత్‌`రష్యాల మధ్య సాంకేతిక, రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎస్‌`400 క్షిపణి వ్యవస్థను రష్యానుంచి మనదేశం కొనుగోలు చేసింది. రష్యా`యుక్రెయిన్‌ యుద్ధంలో మనదేశం తటస్థ వైఖరి కొనసాగించింది. శాంతియుత చర్చల ద్వా రానే పరిష్కారాన్ని సాధించగలమని హితవు పలికింది. ‘ఇది యుద్ధాల కాలం కాదు’ అని పుతిన్‌కు చెప్పగలిగిన ప్రపంచంలో ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. ఆయన పుతిన్‌తో అన్న ఈ మాటలు బహుళ ప్రచారం పొందాయి. రష్యా`యుక్రెయిన్‌ యుద్ధ సమయంలో ఆపరేషన్‌ గంగ పేరుతో యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను మోదీ ప్రభుత్వం మనదేశానికి విజయవంతంగా తరలించింది. ఈ సందర్భంగా దాదాపు 19వేల మంది భారతీ యులను అక్కడినుంచి మన ప్రభుత్వం ఖాళీ చేయించింది. విశేషమేంటంటే ఇతరదేశాలకు చెందిన విద్యార్థులను కూడా మనదేశం ఈ ఆపరేషన్‌లో తరలించింది. 

మోదీ ఇమేజ్‌

నరేంద్ర మోదీ పూర్తి శాఖాహారి. ఆల్కహాల్‌ వంటి పానీయాలకు దూరం. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా, పూర్తి సమయం పనిలో నిమగ్నమయ్యే మనస్తత్వం కలిగిన నిబద్ధ నాయకుడు నరేంద్రమోదీ. 2012, ఆగస్టు 31న నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి గూగుల్‌ హ్యాంగవుట్‌లో పౌరులతో లైవ్‌చాట్‌లో పాల్గన్నారు. ఈవిధంగా ఇందులో పాల్గన్న మొట్టమొదటి భారత రాజకీయ నాయకుడు నరేంద్రమోదీ. మోదీ ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఆయన తనవస్త్రధారణ ద్వారా ప్రత్యేకంగా కనిపించడానికి యత్నిస్తుంటారు. యు.ఎస్‌. అధ్యక్షుడు బరాకఒబామాను కలిసినప్పుడు హాఫ్‌ స్లీవ్డ్‌ కుర్తా ధరించి తన ప్రత్యేక ఆహార్యంతో ప్రజలను, మీడియాను అమితంగా ఆకర్షించారు. చురుకైన, అసాధారణ, లెక్కచేయని మనస్తత్వ మరియు అత్యద్భుత ఛరిష్మా కలిగిన నాయకుడిగా, మేధావులు మోదీని పరిగణిస్తారు. సంక్లిష్ట నిర్ణయా లు తీసుకోగల సామర్థ్యం కలిగిన రాజనీతిజ్ఞుడిగా వర్తమాన భారత రాజకీయాల్లో మోదీ తనస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ సామర్థ్యం కారణంగానే దేశాన్ని ఆర్థిక, రక్షణ రంగాల్లో మరింత పురోగామి దిశగా తీసుకెళ్లగలుగుతున్నారన్నది దేశ ప్రజల్లో అత్యధికుల అభిప్రాయం. ఇదే ఆయన తరగని ఛరిష్మాకు కారణం.

మోదీపై బయోపిక్‌లు

మోదీపై 2017లో ‘మోదీ కాకా కా గాన్‌’ పేరుతో తుషార్‌ అమృత్‌ గోయల్‌ తొలి బయోపిక్‌ నిర్మించారు. 2019లో ఒమంగ్‌ కుమార్‌ ‘ప్రధాని నరేంద్ర మోదీ’ పేరుతో హిందీ చిత్రాన్నినిర్మించారు. ‘మోదీ: ఎ జర్నీ ఆఫ్‌ కామన్‌ మ్యన్‌’ పేరుతో ఒక వెబ్‌సిరీస్‌ 2019 మే నెలలో విడుదలైంది. 2014లో 7 ఆర్‌సీఆర్‌ (7 రేస్‌కోర్స్‌ రోడ్‌) పేరుతో విడుదలైన ‘డాక్యు డ్రామా’లో ప్రముఖ భారతీయ రాజకీయవేత్తల గురించి వివరించారు. ఇందులో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవరకు ఆయన ప్రస్థానాన్ని చక్కగా చూపించారు. 

మోదీ ప్రధానిగా ఎన్నో విదేశీ అవార్డులను, అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు.ఇన్ని అవార్డులను, పురస్కారాలను మరే ఇతర భారత నేత అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. 2008లో నరేంద్ర మోదీ ‘జ్యోతిపుంజ్‌’ పేరుతో గుజరాతీ భాషలో ఒక పుస్తకాన్ని ప్రచు రించారు. ఇందులో ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల గురించిన వివరాలున్నాయి. ప్రధాని అయ్యాక ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పేరుతో పుస్తకాన్ని రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే పిల్లలకు ఇది మార్గదర్శకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!