
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల పరిలలోని నస్కల్ గ్రామంలోని మూడవ అంగన్ వాడీ సెంటర్లో శుక్రవారం నాడు జాతీయ పోషణ మాసం పురస్కరించుకొని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు, మహిళలకు లోప పోషణ లేని మంచి ఆర్యోగాన్ని దాని ప్రతిష్ట పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి సరిౖయెన పోషణ సమాచారాన్ని అందిస్తానని తెలిపారు. పోషకాహారం శుద్దమైన త్రాగునీరు పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తాం. ప్రతి బడిలో ఫ్రీ ప్రైమరి పిల్లల అభివృద్దికి క్షేత్రాల గురించి వెలిగేతి చాటుతామని తెలిపారు. పోషణ అబియాన్, జనచైతన్యంలో భాగస్వామిని చేసి జన చైతన్యం ద్వారా ప్రజలంరికి సంపూర్ణ ఆరోగ్యవంతులు తీర్చిద్దితామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ, ఆయా శోభరాణి, విద్యార్థులు వారి తల్లులు పాల్గోన్నారు.