
Vanaparthi SP Urges Public to Use Lok Adalat
13 న వనపర్తి జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్
కక్షలతో ఏమీ సాధించలేము
జిల్లా ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి
వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయిని ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే అప్పుడే సమసిపోతాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13న వనపర్తి జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ఉంటుందని కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని జాతీయన లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, దొంగతనాల కేసులు, జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, బ్యాంకు రికవరీ, ఫోన్ ల రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం చెక్ బౌన్స్ కేసులో రాజీ పడ్డ కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలతో లో రాజీ పడాలని ఎస్పీ సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులను వృధా చేసుకోవద్దని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని గౌరవించి వినియోగిo చు కోవాలని ఎస్పీ కోరారు.పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు