కుషాయిగూడ నేటి ధాత్రి
ఫిబ్రవరి 22
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మార్చు 9
న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించుకొని జిల్లా న్యాయ సేవాధికార స్వంస్థ, మల్కాజ్ గిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయ మూర్తి
బి. ఆర్. మధుసూదన్ రావు , కార్యదర్శి డి. కిరణ్ కుమార్ , డి.సి.పి మల్కాజ్గిరి పద్మజ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ మార్చ్ 9న వచ్చేనెల నాడు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో క్రిమినల్ కేసులు పరిష్కరించబడేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరి మరియు కుషాయిగూడ జోన్ లకు సంబందించిన పోలీస్ అధికారులు హాజరు కావడం జరిగింది.